Mark Antony Trailer: టైమ్ ట్రావెల్.. కామెడీ.. యాక్షన్.. ఆసక్తికరంగా విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ ట్రైలర్
03 September 2023, 20:54 IST
- Mark Antony Trailer: విశాల్ హీరోగా నటిస్తున్న మార్క్ ఆంటోనీ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది. టైమ్ ట్రావెల్ సహా చాలా అంశాలు ఈ ట్రైలర్‌లో ఆసక్తికరంగా ఉన్నాయి.
Mark Antony Trailer: టైమ్ ట్రావెల్.. డార్క్ కామెడీ.. యాక్షన్.. ఆసక్తికరంగా విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ ట్రైలర్
Mark Antony Trailer: ఫస్ట్ లుక్, టీజర్‌తో భారీ హైప్ తెచ్చుకున్న ‘మార్క్ ఆంటోనీ’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. తమిళ స్టార్ విశాల్ హీరోగా డ్యుయల్ రోల్‍లో నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ నేడు (సెప్టెంబర్ 3) విడుదలైంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో గ్యాంగ్‍స్టర్స్ డ్రామాగా ‘మార్క్ ఆంటోనీ’ రూపొందింది. ఎస్‍జే సూర్య కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేశారు. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రితూ వర్మ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించారు. ఈ సినిమా ట్రైలర్ నేడు వచ్చింది. ట్రైలర్ ఎలా ఉందంటే..
‘ఏం బాసూ.. రెడీ యా.. రికార్డ్ చేసుకో’ అంటూ సాయి కుమార్ వాయిస్ ఓవర్‌తో మార్క్ ఆంటోనీ మూవీ తెలుగు ట్రైలర్ షురూ అయింది. ఆ తర్వాత 1990ల బ్యాక్‍డ్రాప్ గ్యాంగ్‍స్టర్ డ్రామాగా ఉంటుంది. విశాల్ కరడు గట్టిన గ్యాంగ్‍స్టర్ ఆంటోనీలా కనిపించారు. ఈ చిత్రంలో విశాల్ డ్యుయల్ రోల్ చేశారు. ఆంటోనీ కొడుకు మార్క్ పాత్రలోనూ నటించారు. ఎస్‍జే సూర్య కూడా ప్రధాన పాత్ర చేశారు. విశాల్, ఎస్‍జే సూర్య కలిసి చేసిన యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత కాలంలో ఓ సైంటిస్టు చేసిన ట్రైమ్ ట్రావెల్ ఫోన్ సక్సెస్ అవుతుంది. దీంతో మార్క్ టైమ్‍లో వెనక్కి వెళతారు. తన తండ్రి ఆంటోనీ కోసం వెతుకుతారు. మొత్తంగా మార్క్ ఆంటోనీ ట్రైలర్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. టైమ్ ట్రావెల్, గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామా, కామెడీతో ఆకట్టుకుంది.
మార్క్ ఆంటోనీ చిత్రంలో సునీల్, సెల్వరాఘవన్, అభినయ, కింగ్‍స్లే, మహదేవన్ కీలకపాత్రల్లో నటించారు. అధిక్ రవిచంద్రన్ టేకింగ్ విభిన్నంగా ఉన్నట్టు ఈ ట్రైలర్లో తెలుస్తోంది. జీవీ ప్రకాశ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరో హైలైట్‍గా ఉంది. సెప్టెంబర్ 15వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది.
మినీ స్టూడియో పతాకంపై ఎస్.వినోద్ కుమార్.. మార్క్ ఆంటోనీ చిత్రాన్ని నిర్మించారు. వినయ్ వెలుకుట్టి ఎడిటింగ్ చేయగా.. దినేశ్, బాబా భాస్కర్, అజర్ సినిమాటోగ్రాఫర్లుగా ఉన్నారు.