Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ మోసాన్ని బయటపెట్టిన నిర్మాత..లడ్కీ సినిమాపై కోర్టు స్టే...
18 July 2022, 11:16 IST
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం లడ్కీ ప్రదర్శన నిలిచిపోయింది. ఈ సినిమాపై రవి అనే డిస్ట్రిబ్యూటర్ కోర్టును ఆశ్రయించడంతో ప్రదర్శనను నిలిపివేయాలంటూ సిటీ సివిల్ కోర్లు తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేసింది.
పూజా భలేకర్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాల్లో చిక్కుకోవడం కొత్త కాదు. గత కొన్నేళ్లుగా సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా మరోసారి ఆయన చిక్కుల్లో పడ్డారు.ఇటీవలే వర్మ రూపొందించిన లడ్కీ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వర్మ ఈ సినిమాను రూపొందించారు. పూజా భలేకర్ కీలక పాత్రలో నటించింది.
కాగా ఈ సినిమా ప్రదర్శనను నిలుపుదల చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్ ఎన్.రవి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అతడి వాదనలతో ఏకీభవించిన కోర్టు థియేటర్లలో సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ తాత్కాలిక ఆర్డర్స్ జారీ చేసింది. అంతేకాకుండా సినిమానుడిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు అమ్మడానికి, వాటిలో ప్రదర్శించడానికి వీలులేకుండా ఉత్తర్వులను వెలువరించింది.
ఈ వివాదంపై డిస్ట్రిబ్యూటర్ రవి మాట్లాడుతూ గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను వర్మ తమకు అమ్మారని చెప్పాడు. ఆ తర్వాత రైట్స్ ను తమకు తెలియకుండానే ముంబైకి చెందిన మరో సంస్థకు వర్మ బదిలీ చేశాడని పేర్కొన్నాడు. ఈ మోసంపై వర్మను పలుమార్లు అడిగే ప్రయత్నం చేశామని, కానీ ఆయన బదులివ్వలేదని చెప్పాడు. వర్మపై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశామని, అయినా తమకు న్యాయం జరగకపోవడంతోనే కోర్టును ఆశ్రయించినట్లు డిస్ట్రిబ్యూటర్ రవి పేర్కొన్నాడు. కోర్టు ఆర్డర్స్ తో లడ్కీ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.
టాపిక్