Hunt OTT Release Date: హంట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
31 January 2023, 10:11 IST
- Hunt OTT Release Date: హంట్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది. సుధీర్ బాబు నటించిన ఈ మూవీ సరికొత్త థ్రిల్లర్ కథతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
హంట్ మూవీలో సుధీర్ బాబు
Hunt OTT Release Date: టాలీవుడ్ లో కొత్త కథలతో ప్రయోగాలు చేసే నటుడు సుధీర్ బాబు నటించిన హంట్ మూవీ గత గురువారం (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. హంట్ మూవీ ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
మహేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీలో సుధీర్ తోపాటు శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ నటించారు. పాత్రల పరంగా వైవిధ్యతకు ప్రాధాన్యమిచ్చే సుధీర్ బాబు మరోసారి కొత్తదనాన్ని నమ్మి ఈ సినిమా చేశారు. ఇలాంటి రోల్ చేయాలంటే కాస్తంత ధైర్యం కావాల్సిందే. పోలీస్ ఆఫీసర్ రోల్‌కు అతడి లుక్, ఫిజిక్ చక్కగా కుదిరాయి.
పోలీస్ కమీషనర్‌గా శ్రీకాంత్ నటన బాగుంది. మరో ఇంపార్టెంట్ రోల్‌లో ప్రేమిస్తే భరత్ కనిపించాడు. ఈ ముగ్గురి చుట్టే కథ ఎక్కువగా నడుస్తుంది. క్రైమ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్స్‌లో కొత్త కోణాన్ని టచ్ చేస్తూ రూపొందిన సినిమా ఇది. మలయాళ సినిమా ముంబై పోలీస్ ఆధారంగా హంట్ సినిమాను తెరకెక్కించారు. గతాన్ని మర్చిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్ కథ ఇది.
దాదాపు తాను సాల్వ్ చేసిన ఓ కేసును గతాన్ని మర్చిపోవడం వలన తిరిగి ఫస్ట్ నుంచి ఎలా టేకాఫ్ చేశాడనే పాయింట్‌తో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా దర్శకుడు మహేష్ ఈ సినిమాను తెరకెక్కించారు. సింపుల్ పాయింట్‌ను డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు డైరెక్టర్. సినిమా మొత్తం అర్జున్ ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ అంశాలు బాగున్నా వాటిలో వేగం పెరిగితే బాగుండేది. యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.