తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hero With Most Cars: తీసింది ఒకే ఒక్క సినిమా.. అదీ డిజాస్టర్.. ఏ స్టార్ హీరో దగ్గర లేనన్ని లగ్జరీ కార్లు.. ఎవరతను?

Hero with most cars: తీసింది ఒకే ఒక్క సినిమా.. అదీ డిజాస్టర్.. ఏ స్టార్ హీరో దగ్గర లేనన్ని లగ్జరీ కార్లు.. ఎవరతను?

Hari Prasad S HT Telugu

14 August 2024, 12:35 IST

google News
    • Hero with most cars: అతడు తీసింది ఒకే ఒక్క సినిమా. అది కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. కానీ దేశంలో ఏ స్టార్ హీరో దగ్గరా లేని విధంగా ఏకంగా 26 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?
తీసింది ఒకే ఒక్క సినిమా.. అదీ డిజాస్టర్.. ఏ స్టార్ హీరో దగ్గర లేనన్ని లగ్జరీ కార్లు.. ఎవరతను?
తీసింది ఒకే ఒక్క సినిమా.. అదీ డిజాస్టర్.. ఏ స్టార్ హీరో దగ్గర లేనన్ని లగ్జరీ కార్లు.. ఎవరతను?

తీసింది ఒకే ఒక్క సినిమా.. అదీ డిజాస్టర్.. ఏ స్టార్ హీరో దగ్గర లేనన్ని లగ్జరీ కార్లు.. ఎవరతను?

Hero with most cars: సెలబ్రిటీలకు లగ్జరీ కార్లపై ఎలాంటి మోజు ఉంటుందో తెలుసు. అయితే ఈ వ్యాపారవేత్త కమ్ హీరో అయిన వ్యక్తికి మాత్రం అంతకంటే ఎక్కువే. ఎందుకంటే ఇతని దగ్గర దేశంలో ఏ స్టార్ హీరో, సెలబ్రిటీ దగ్గరా లేనన్ని కార్లు ఉన్నాయి మరి. ఇంతకీ అతని పేరేంటో తెలుసా? లెజెండ్ శరవణన్. ఆ మధ్య లెజెండ్ అని ఓ సినిమా తీస్తే అది డిజాస్టర్ గా మిగిలిపోయింది.

లెజెండ్ శరవణన్ కార్లు

శరవణన్ అరుళ్ అనే వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ గా మారి తర్వాత 51 ఏళ్ల వయసులో సినిమాల్లోకీ ఎంట్రీ ఇచ్చి లెజెండ్ అనే మూవీ కూడా తీశాడు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా ఫిమేల్ లీడ్ గా నటించింది. అయితే అది కాస్తా అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. కానీ ఓ హీరోగా దారుణంగా ఫెయిలైనా వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన ఇతని దగ్గర లెక్కలేనన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తంగా 26 కార్లు అతని లగ్జరీ కార్ల కలెక్షన్లో ఉన్నాయంటే నమ్మగలరా?

ఇండియాలో షారుక్ ఖాన్, అమితాబ్, రజనీకాంత్, చిరంజీవిలాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోల దగ్గర లేనన్ని కార్లు ఈ లెజెండ్ శరవణన్ సొంతం. ఒకరకంగా అతనికి లగ్జరీ కార్లంటే పిచ్చి. అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ నుంచి వోల్వో కారు వరకు శరవణన్ గ్యారేజీలో లేని లగ్జరీ కారు లేదంటే అతిశయోక్తి కాదేమో.

శరవణన్ కార్ల కలెక్షన్ ఇలా

ఎవరి ఊహకూ అందని విధంగా ఈ లెజెండ్ శరవణన్ దగ్గర ఏకంగా మూడు రోల్స్ రాయిస్ కార్లు ఉండటం విశేషం. అందులో ఏకంగా రూ.12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూడా ఉంది. ఇక రూ.8.23 కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ రెయిత్, రూ.7.25 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఉన్నాయి. ఇవి కాకుండా రూ.4.35 కోట్ల విలువైన ఓ ఫెరారీ కారు, రెండు ఆస్టన్ మార్టిన్, మూడు మెర్సిడీస్, మూడు లంబోర్గిని, నాలుగు బెంట్లీ, ఐదు పోర్షె, రెండు బీఎండబ్ల్యూ, ఒక జాగ్వార్ ఎక్స్‌జేఎల్, ఒక రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీఆర్, ఒక వోల్వో ఎక్స్‌సీ90 టీ8 కార్లు శరవణన్ గ్యారేజీలో ఉన్నాయి.

శరవణన్ దగ్గర ఉన్న లగ్జరీ కార్ల మొత్తం విలువే సుమారు రూ.100 కోట్ల వరకూ ఉంటుందంటే నమ్మగలరా? అంతేకాదు ఈ కార్ల నంబర్లన్నీ 3666 కావడం మరో విశేషం. ఇండస్ట్రీలో తీసింది ఒకే ఒక్క సినిమా అయినా.. శరవణన్ స్టోర్స్ పేరుతో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని అతడు నడుపుతున్నాడు. ఈ సంస్థ టర్నోవర్ ఏకంగా రూ.2500 కోట్లు ఉంటుంది.

శరవణన్ లెజెండ్ మూవీ

శరవణన్ తానే నిర్మాత, హీరోగా తీసిన మూవీ లెజెండ్. 2022లో ఈ మూవీ వచ్చింది. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్. జులై 28, 2022లో రిలీజైన ఈ సినిమాకు తొలి షో నుంచే దారుణమైన నెగటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర మూవీ బోల్తా పడింది. ఊర్వశి రౌతేలా లాంటి హాట్ హీరోయిన్ ను తెచ్చి పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. శరవణన్ నటన చూసి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం