తమిళనాడులో శరవణ స్టోర్స్‌తో పాపులరైన శరవణన్ ఆరుల్ ది లెజెండ్ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతని వయసు 51 ఏళ్లు. ఈ ది లెజెండ్ మూవీపై చాలా రోజులుగా ఎంతో బజ్ నడుస్తోంది. ఈ సినిమాను ఏకంగా ఐదు భాషల్లో, 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కానీ తీరా చూస్తే మూవీ మాత్రం దారుణంగా ఉంది. ఇందులో శరవణన్ నటన చూసి ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు.
ఇదేం యాక్టింగ్.. ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ లేవు.. ఓవర్ బిల్డప్ అంటూ ట్విటర్‌లో ట్రోల్ చేస్తున్నారు. గురువారం (జులై 28) మూవీ రిలీజ్ అయినప్పటి నుంచీ నెటిజన్లు అతనితో ఆడుకుంటున్నారు. జేడీ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయడం విశేషం. పైగా ఇందులో శరవణన్ సరసన రాయ్ లక్ష్మి, ఊర్వశి రౌతేలాలాంటి హీరోయిన్స్ నటించారు.
మూవీలోని సెంటిమెంట్ సీన్లలోనూ మీరు కడుపుబ్బా నవ్వుతారు.. మీకు ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటే కచ్చితంగా వెళ్లి ఎంజాయ్ చేయండి అంటూ ఓ యూజర్ ట్వీట్ చేయడం విశేషం. ముఖ్యంగా శరవణన్ నటనపైనే చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఇలా ఉండాలి అంటూ మరో యూజర్ సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు.
లీడ్ యాక్టర్ శరవణన్ డ్యాన్స్ చూసిన తర్వాత నా కిడ్నీకి హార్ట్ అటాక్ వచ్చిందంటూ ఇంకో యూజర్ సరదాగా మూవీని ట్రోల్ చేశాడు. నిజానికి ఈ మూవీ ఫస్ట్ లుక్, ట్రైలర్‌లు రిలీజైన సమయంలో శరవణన్ లుక్స్ చూసి ఇతడు హీరో ఏంటి అని నెటిజన్లు పెదవి విరిచారు. ఇప్పుడు ఊహించినట్లుగానే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫన్నీ కామెంట్స్‌తో అతని పరువు తీస్తున్నారు.