తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hari Hara Veera Mallu Release Date: హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఇదే.. షూటింగ్ మొదలుపెట్టిన పవన్ కల్యాణ్

Hari Hara Veera Mallu Release Date: హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఇదే.. షూటింగ్ మొదలుపెట్టిన పవన్ కల్యాణ్

Hari Prasad S HT Telugu

Published Sep 23, 2024 10:57 AM IST

google News
    • Hari Hara Veera Mallu Release Date: హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది. సోమవారం (సెప్టెంబర్ 23) సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఈ మచ్ అవేటెడ్ గుడ్ న్యూస్ వెల్లడించారు. అంతేకాదు ఈరోజు నుంచే పవన్ తిరిగి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడం విశేషం.
హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఇదే.. షూటింగ్ మొదలుపెట్టిన పవన్ కల్యాణ్

హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఇదే.. షూటింగ్ మొదలుపెట్టిన పవన్ కల్యాణ్

Hari Hara Veera Mallu Release Date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ మళ్లీ మొదలైంది. అంతేకాదు ఈ మూవీ రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ (సోమవారం 23) అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ లో పవన్ ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. ఇప్పుడు మళ్లీ తన పెండింగ్ సినిమాలపై దృష్టి సారించాడు.

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఇదే..

పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ కానుంది. అంతేకాదు సోమవారం (సెప్టెంబర్ 23) ఉదయం 7 గంటల నుంచి విజయవాడ దగ్గర్లోనే తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఎక్స్ అకౌంట్ ద్వారా మెగా సూర్య ప్రొడక్షన్ వెల్లడించింది. ఇది నిజంగా పవర్ స్టార్ అభిమానులకు పండగలాంటి వార్తే.

"ఎవరూ ఆపలేని శక్తి.. ఎవరూ విచ్ఛిన్నం చేయలేని స్ఫూర్తి. వచ్చే ఏడాది మార్చి 28న మీ దగ్గర్లోని థియేటర్లలోకి వచ్చేస్తోంది. ది వారియర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు షూటింగ్ లో చేరారు. హరిహర వీరమల్లు షూటింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు విజయవాడలోని ఓ సెట్ లో తిరిగి ప్రారంభమైంది" అనే క్యాప్షన్ తో మెగా సూర్య ప్రొడక్షన్ ఈ విషయం తెలిపింది.

హరి హరి వీరమల్లు పార్ట్ 1

హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రానుంది. పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ అనే పేరుతో రాబోతోంది. మూవీ రిలీజ్ డేట్ వెల్లడిస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ ఓ ఖడ్గాన్ని గాల్లోకి దూస్తూ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు. ఈ కొత్త పోస్టర్ లో క్రిష్ జాగర్లమూడితోపాటు జ్యోతి కృష్ణ పేరు కూడా ఉంది. గతంలో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన క్రిష్ తర్వాత తప్పుకోగా.. జ్యోతి కృష్ణ ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.

నిజానికి మూడు రోజుల కిందటే ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెల్లడించారు మేకర్స్. విజ‌య‌వాడ‌లో జ‌రుగ‌నున్న లేటెస్ట్ షెడ్యూల్‌లో హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ నిక్ పావెల్ సార‌థ్యంలో ఓ భారీ యుద్ద స‌న్నివేశం చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు వెల్ల‌డించారు.

గ‌తంలో నిక్ పావెల్ బ్రేవ్ హార్ట్‌, గ్లాడియేట‌ర్‌, బోర్న్ ఐడెంటిటీ, ది లాస్ట్ స‌మురాయ్‌, రెసిడెంట్ ఈవిల్ రిట్రిబ్యూష‌న్‌తో పాటు హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీస్‌కు ప‌నిచేశాడు. హాలీవుడ్‌లో ప‌లు భారీ బ‌డ్జెట్ మూవీస్‌కు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా, ఫైట్ కొరియోగ్రాఫర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

ఈ యాక్ష‌న్ ఎపిసోడ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు సీనియర్ నటులు నాజర్, రఘుబాబు, క‌మెడియ‌న్‌ సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప పి శ‌ర్మ కూడా భాగం కాబోతున్న‌ట్లు తెలిసింది. దాదాపు నాలుగు వంద‌ల మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు, ఫైట‌ర్ల‌తో మునుపెన్నడూ టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడని స్థాయిలో నెక్స్ట్ లెవెల్‌లో ఈ యుద్ధ సన్నివేశాల‌ను తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది.

తదుపరి వ్యాసం