తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Creates History: హనుమాన్ సరికొత్త చరిత్ర.. 92 ఏళ్ల తెలుగు సినిమా హిస్టరీలో ఇదే తొలిసారి

Hanuman Creates History: హనుమాన్ సరికొత్త చరిత్ర.. 92 ఏళ్ల తెలుగు సినిమా హిస్టరీలో ఇదే తొలిసారి

Hari Prasad S HT Telugu

02 February 2024, 15:51 IST

google News
    • Hanuman Creates History: హనుమాన్ మూవీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా నిలవడం విశేషం.
హనుమాన్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లలో సరికొత్త చరిత్ర సృష్టించింది
హనుమాన్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లలో సరికొత్త చరిత్ర సృష్టించింది

హనుమాన్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లలో సరికొత్త చరిత్ర సృష్టించింది

Hanuman Creates History: హనుమాన్ మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ.. ఇప్పుడు తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మూడు వారాల్లోనే సుమారు రూ.300 కోట్ల కలెక్షన్లకు చేరువైన హనుమాన్ సినిమా.. అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా నిలవడం విశేషం.

హనుమాన్ రికార్డు కలెక్షన్లు

హనుమాన్ మూవీ ఈ అరుదైన రికార్డును క్రియేట్ చేసినట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోపాటు మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి సినిమాకు ఈ స్థాయి వసూళ్లు గతంలో ఎప్పుడూ రాలేదని వాళ్లు చెప్పారు. జనవరి 12న రిలీజైన హనుమాన్ మూవీ తొలి మూడు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.270 కోట్ల వరకూ వసూలు చేసింది.

ఇప్పుడు రూ.300 కోట్ల లక్ష్యం వైపు దూసుకెళ్తోంది. ఇప్పటికీ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లలో ఎన్నో సినిమాలు పోటీగా వచ్చినా.. హనుమాన్ దూకుడు మాత్రం తగ్గడం లేదు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా.. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా చరిత్ర సృష్టించింది.

సంక్రాంతి కింగ్ హనుమాన్

హనుమాన్ మూవీ 92 ఏళ్ల టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమా అని మైత్రీ మూవీ మేకర్స్ ఓ ట్వీట్ లో తెలిపింది. "టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హనుమానియా తనకంటూ ఓ చరిత్రను లిఖించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూపి ఆదరాభిమానాలతో ఈ మూవీ చరిత్ర సృష్టించింది. 92 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైమ్ హయ్యెస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది" అని ట్వీట్ చేసింది.

నైజాం ఏరియాలో హనుమాన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 12వ తేదీని గుంటూరు కారం మూవీతోపాటు ఈ సినిమా కూడా రిలీజైంది. అయితే తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో తెలుగు, హిందీల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. గుంటూరు కారంతోపాటు సైంధవ్, నా సామిరంగ మూవీస్ ను వెనక్కి నెట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది.

సంక్రాంతి సినిమాలకు తెలుగులో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రతి ఏటా పెద్ద పెద్ద హీరోలు ఈ పండుగకు థియేటర్లలో సందడి చేస్తారు. గతంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మహేష్ బాబు, నాగార్జున, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోల సినిమాలు సంక్రాంతికి వచ్చాయి. కానీ ఏ మూవీ ఇప్పుడు హనుమాన్ స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది.

హనుమాన్ ఓటీటీ రిలీజ్

థియేటర్లలో మూడు వారాలుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న హనుమాన్ మూవీ కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి రానుంది. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో మిగిలిన మూడు మూవీస్ ఫిబ్రవరిలోనే రిలీజ్ కానుండగా.. హనుమాన్ మాత్రం మార్చి రెండో వారంలోగానీ జీ5 ఓటీటీలో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమా కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం