Guntur Kaaram OTT: గుంటూరు కారం ఓటీటీ వెర్షన్‌లో మదర్ సెంటిమెంట్ సాంగ్, కబడ్డీ ఫైట్ సీన్ యాడ్ ?
Guntur Kaaram OTT: గుంటూరు కారం ఓటీటీ వెర్షన్‌లో మదర్ సెంటిమెంట్‌సాంగ్‌తో పాటు కబడ్డీ ఫైట్‌ను కూడా యాడ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.

Guntur Kaaram OTT: మహేష్ బాబు గుంటూరు కారం మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా థియేటర్లలో భారీగా వసూళ్లను రాబట్టింది. మహేష్‌బాబు కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 18 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 240 కోట్ల వరకు గ్రాస్‌ను 122 కోట్లకుపైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఏపీ, తెలంగాణలోని చాలా చోట్ల గుంటూరు కారం మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. నైజాం ఏరియాలో దాదాపు నలభై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు 34 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 135 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో పన్నెండు కోట్లకుపైగా వసూళ్లను సాధించాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
కబడ్డీ ఫైట్ యాడ్...
గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓటీటీ వెర్షన్‌లో కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్నట్లు సమాచారం. థియేటర్లలో నిడివి ఎక్కువ కావడంతో అమ్మ సాంగ్‌తో పాటు కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌ను మేకర్స్ కట్ చేశారు. ఈ అమ్మ సాంగ్, కబడ్డీ యాక్షన్ సీన్‌ను ఓటీటీలో యాడ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. కబడ్డీ యాక్షన్ ఎపిసోడ్ ఫైట్ ఓటీటీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుందని అంటున్నారు.
గుంటూరు కారం మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. మహేష్‌బాబుకు తెలుగులో ఉన్న క్రేజ్ కారణంగా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నలభై కోట్లకు నెట్‌ఫ్లిక్స్ గుంటూరు కారం డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు తెలిసింది.
హ్యాట్రిక్ కాంబో...
అతడు, ఖలేజా తర్వాత మహేష్‌బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం మూవీ తెరకెక్కింది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌కు యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి త్రివిక్రమ్ ఈ మూవీని రూపొందించారు. రమణ పాత్రలో మహేష్ యాక్టింగ్, ఎనర్జీ లెవెల్స్ బాగున్నా త్రివిక్రమ్ కథలో మాత్రం కొత్తదనం మిస్సయిందనే విమర్శలు వచ్చాయి.
అత్తారింటికి దారేది....
అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురములో కథల్లో మార్పులు చేస్తూ త్రివిక్రమ్ గుంటూరు కారం కథను రాసుకున్నాడంటూ మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్‌ను ట్రోల్ చేశారు. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందించాడు.
కాగా త్వరలోనే గుంటూరు కారం సక్సెస్ మీట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలిసింది. మహేష్ బాబు ఇంట్లో జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు త్రివిక్రమ్ మిస్సయ్యాడు. అందుకే మరో సారి సక్సెస్ మీట్‌ను నిర్వహించనున్నట్లు తెలిసింది.గుంటురు కారం తర్వాత అగ్ర దర్శకుడు రాజమౌళితో అడ్వెంచరస్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు మహేష్ బాబు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి రానుంది.