తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu March 11th Episode: గుప్పెడంత మనసు.. రిషి లేడని నమ్ముతున్న వసుధార? శైలేంద్రతో ధరణి టెంపర్ డైలాగ్

Guppedantha Manasu March 11th Episode: గుప్పెడంత మనసు.. రిషి లేడని నమ్ముతున్న వసుధార? శైలేంద్రతో ధరణి టెంపర్ డైలాగ్

Sanjiv Kumar HT Telugu

03 April 2024, 12:36 IST

google News
  • Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ మార్చి 11వ తేది ఎపిసోడ్‌లో రాజీవ్, శైలేంద్రకు మను వార్నింగ్ ఇస్తాడు. దాంతో వీడే మన టార్గెట్. వీన్ని వేసేయాలి అని రాజీవ్ అంటాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ మార్చి 11వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ మార్చి 11వ తేది ఎపిసోడ్‌

గుప్పెడంత మనసు సీరియల్‌‌ మార్చి 11వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Episode 1021: గుప్పెడంత మనసు సీరియల్‌లో కాలేజీలో వసుధార, మను పోస్టర్స్ రాజీవ్ అతికించడం చూస్తాడు మను. దాన్ని వీడియో తీస్తాడు. అదే వీడియోను శైలేంద్ర, రాజీవ్‌కు చూపిస్తాడు మను. రేయ్ నువ్ ఇంత శాడిస్ట్‌లా ఉన్నావేంట్రా. దాన్ని వీడియో తీసి చూపిస్తున్నావా. పోస్టర్స్ ప్రింట్ చేయడం ముందే చూసుంటే అక్కడే ఆపిండొచ్చు కదరా. ప్రింటింగ్ డబ్బులు అయినా మిగిలేవి అని శైలేంద్ర అంటాడు.

మైండ్ ఉండే మాట్లాడుతున్నావా

అసలు నీ పాలసీ ఏంట్రా అని శైలేంద్ర అంటాడు. నాకు పాలసీలు, భీమాలు ఏవి లేవు అని మను అంటాడు. అనవసరంగా మా గురించి తెలియక ఇదంతా చేస్తున్నావ్ అని శైలేంద్ర అంటే.. ఎందుకు తెలియదు. నువ్ ఒక పెద్ద దుర్మార్గుడివి. వాడు పెద్ద వెధవ. మీరు ఇద్దరు తోడు దొంగలు అని ఇప్పుడే తెలిసింది అని మను అంటాడు. భయ్యా.. నువ్ ఎందుకు ఇందులోకి వస్తున్నావ్ అని రాజీవ్ అంటే.. నా పోస్టర్స్ వేసి నన్నేందుకు వస్తున్నావ్ అడుగుతున్నావా. మైండ్ ఉండే మాట్లాడుతున్నావా అని మను అంటాడు.

నువ్ 50 కోట్లు ఇవ్వలేదని అందరికీ చెబుతాను అని శైలేంద్ర అంటాడు. అసలు అప్పే లేదని, నువ్వే క్రియేట్ చేశావని నేనే చెబుతాను. అన్నీ నిజాలే మాట్లాడుకుందాం. అసలు తమ్ముడి భార్యపై ఇలాంటి పనలులు చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా. నీలాంటి దుర్మార్గులు పురణాల్లో, స్టోరీల్లో ఉండటమే తప్పా సమాజంలో ఉండరు అని మను అంటాడు. ఎందుకు ఉండరు అని రాజీవ్ అంటాడు. వసుధార అక్కను, అమ్మను కోల్పోయి.. స్వతహాగా ఎంతో కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నారు. తనకు సపోర్ట్‌గా నిలవాలి కానీ. ఇదేంట్రా అని రాజీవ్ ను మను అంటాడు.

మన టార్గెట్ వాడే

ఇంకోసారి ఇలా చేస్తే అని మను దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇస్తే.. చేస్తాను. ఏం చేస్తావ్. నువ్ తనతో మాట్లాడితే ఏమైనా చేస్తాను అని రాజీవ్ అంటాడు. అవసరం అయితే అది కూడా చేస్తాను అని మను అంటాడు. వసును దగ్గర చేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తాను అని రాజీవ్ అంటే.. అవసరం అయితే ఆ తలను తెంచేసే వరకు నేను వెళ్తాను.. శైలేంద్ర నీకు కూడా అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్లిపోతాడు మను. చూశావా భయ్యా. మనకు వాడు ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో. ముందు వీన్ని వేసేయ్యాలి. వీడే మన టార్గెట్ అని రాజీవ్ అంటాడు. శైలేంద్ర ఆలోచిస్తుంటాడు.

మరోవైపు మను చేసింది కరెక్టే కదమ్మా ఎందుకు ఫీల్ అవుతున్నావ్ అని మహేంద్ర అడుగుతాడు. అనుపమ కరెక్టే కదా అని అంటే.. సైలెంట్‌గా ఉంటుంది. అది కరెక్టా కాదా అని కాదు. కానీ, నాకు అవి నచ్చలేదు అని వసుధార అంటుంది. అది సాఫ్ట్‌గా చెబితే అయిపోయేది. కానీ, అందరిముందు ఇలా అంటే ఎంత ఫీల్ అవుతాడు అని శైలేంద్ర అంటాడు. నేను కూడా బాధపడుతున్నాను మావయ్య అని వసుధార అంటుంది. మను మనకోసం ఎంతే చేశాడు. తనపై ముందు అనుమానపడ్డావ్. తర్వాత మంచోడు అన్నావ్. ఇప్పుడు అదే నమ్ముతున్నావా అని మహేంద్ర అంటాడు.

ఆయన లేకుండా ఏంటీ

అవును మావయ్య అని వసధార అంటే.. నీ మనసులో మంచోడిగా స్థానం సంపాదించుకున్నాడు. అతని తల్లిదండ్రులు ఎంతో గొప్పొళ్లు. అందుకే ఇలాంటి కొడుకుని కన్నారు. నీకు తెలియకుండానే మను పట్ల ఎక్కువ రియాక్ట్ అవుతున్నావని అనిపిస్తుంది. నీ బర్త్ డే చేస్తే తప్పేముంది. అసలు నీ ప్రాబ్లమ్ అంటీ అని అంటాడు మహేంద్ర. రిషి సార్ లేరు కదా మావయ్య. ఆయన లేకుండా ఈ సెలబ్రేషన్స్ ఏంటీ అని వసుధార అంటుంది. అంటే రిషి లేడని నువ్ నమ్ముతున్నావా అని మహేంద్ర అంటాడు.

దాంతో షాక్ అయిన వసుధార.. మావయ్య.. ఇంకోసారి అలా అనకండి. ఆయన వచ్చేవరకు ఇలాంటి సెలబ్రేషన్స్ నాకు వద్దని చెబుతున్నా. ఎందుకు ప్రతిసారి రిషి సార్ పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తారు అని వసుధార అంటుంది. అదికాదు అని మహేంద్ర అంటే.. ఇక నేను ఏం వినదల్చుకోలేదు అని చెప్పేసి వెళ్లిపోతుంది వసుధార. ఏంటిది అనుపమ అని మహేంద్ర అంటే.. తనకు ఇష్టం లేదని చెబుతుంది కదా. వదిలేయ్ అని అనుపమ చెబుతుంది.

టెంపర్ డైలాగ్

మరోవైపు శైలేంద్రను చూస్తూ సంబరపడిపోతుంది ధరణి. ఏంటీ అలా చూస్తున్నావ్ అని శైలేంద్ర అంటే.. మీరు మారిపోయారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య.. అని పిలుస్తుంది ధరణి. ఇంతలో దేవయాని వస్తుంది. ఏంటీ ధరణి. వీడేంటీ ఇలా ఉన్నాడు అని దేవయాని అనుకుంటుంది. కాలేజీకి వెళ్దాం అని ఆయన హడావిడి చేశారు కదా. సర్‌ప్రైజ్ అని ఆయన చెప్పారు కదా. నేను మళ్లీ ఏదో ప్లాన్ చేస్తున్నారని, తప్పు చేస్తున్నారని అనుకున్నాను. కానీ, నిజంగానే సర్ ప్రైజ్ ఇచ్చారని ధరణి అంటుంది.

కాలేజీలో వసుధారకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పోస్టర్స్ పెట్టి విషెస్ చెప్పారు. అసలు వసుధార బర్త్ డే నాకే గుర్తు లేదు. ఆయన గుర్తు పెట్టుకుని మరి అడ్వాన్స్‌డ్‌గా చెప్పారు. మీరు ఎంత మంచివారండి. ఎంత గొప్పోళ్లండి. మీరు మారిపోయారండి. మీరు మీ అమ్మ కడుపు నుంచి బయటకు రావడానికి ఎంత కష్టపడ్డారో కానీ, మీరు మారడానికి చాలా కష్టపడ్డారండి. హ్యాట్సాఫ్ అండి అని టెంపర్ మూవీలో పోసాని కృష్ణమురళి డైలాగ్ చెబుతుంది ధరణి. కాఫీ తీసుకొస్తానని సంతోషంగా వెళ్లిపోతుంది ధరణి.

ఏంట్రా నిజంగానే మారిపోయావా అని దేవయాని అడిగితే.. నేను ఎందుకు మారాను మామ్. నేను అనుకుంది ఒకటి. అక్కడ జరిగింది మరొకటి అని కాలేజీలో పోస్టర్స్ గురించి జరిగింది మొత్తం చెబుతాడు శైలేంద్ర. మధ్యలో అతనెందుకు వస్తున్నాడు అని దేవయాని అంటుంది. తెలీద్ మామ్. నేను ఎండీ సీటు కోసం ట్రై చేస్తుంటే వాడు అడ్డు పడుతున్నాడు. భరించలేని పెయిన్ అనుభవిస్తున్నాను అని కోపంతో వెళ్లిపోతాడు శైలేంద్ర.

హ్యాపీగా ఉంచుదాం

మరోవైపు నువ్ చెప్పింది చాలా బాగుంది మను. వసుధార బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా అరెంజ్ చేయమని ఫోన్‌లో అంటాడు మహేంద్ర. కానీ, అని మను అంటే.. ఇంత జరిగినా వసుధార బాధపడుతుందని ఆలోచిస్తున్నావ్ అని నాకు తెలుసు. ఆ సంగతి నేను చూసుకుంటాను. మనమంతా తనకు అండగా ఉండి హ్యాపీగా ఉంచుదాం. నా ఫుల్ సపోర్ట్ నీకే అని మహేంద్ర అంటాడు. అదంతా అనుపమ వింటుంది.

నువ్ చేస్తుంది కరెక్ట్ కాదు మహేంద్ర. వసుధారుక ఇష్టం లేదని చెప్పింది కదా. అయినా ఎందుకు చేస్తున్నావ్ అని అనుపమ అంటుంది. తన సంతోషం కోసం. తను చాలా రోజులుగా ఆందోళనగా, దిగులుగా ఉంది. రేపు తన మొహంలో ప్రశాంతత చూడాలనుకుంటున్నాను అని మహేంద్ర అంటాడు. అలా అయితే తను ప్రళయం సృష్టిస్తుంది. మనునే అందరిముంది కోప్పడుతుంది. అలాగే జరుగుతుంది అని అనుపమ అంటుంది. అలా ఏం జరగదు. నువ్ నా బెస్ట్ ఫ్రెండ్‌వి నాకు సపోర్ట్‌గా మాట్లాడాలి అని మహేంద్ర అంటాడు.

రిషి ఫొటో పట్టుకుని

నాకు తన బర్త్ డే సెలబ్రేషన్స్ చేయాలని ఉంది. కానీ, ఇవాళ ఏం జరిగిందో తెలుసు కదా అని అనుపమ భయపడుతుంది. అన్ని తెలిసే ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నాను. నేను ఎవరు చెప్పిన వినను. వెనక్కి తగ్గను. రేపు వసుధార బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుగుతాయి. నువ్ అనుకున్నట్లు ఏం కాదు అని మహేంద్ర చెప్పేసి వెళ్లిపోతాడు. మరోవైపు రిషి ఫొటో పట్టుకుని నన్నే అంతా తప్పు పడుతున్నారు. నా బాధ ఎవరికీ అర్థం కావట్లేదు. మావయ్య కూడా నన్నే అన్నారు అని వసుధార ఫీల్ అవుతుంది వసుధార.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం