తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu July 31st Episode: గుప్పెడంత మనసు- కాలేజీలోకి రిషి ఎంట్రీ- శైలేంద్రే ఎండీ అని అనౌన్స్- ధరణికి డౌట్

Guppedantha Manasu July 31st Episode: గుప్పెడంత మనసు- కాలేజీలోకి రిషి ఎంట్రీ- శైలేంద్రే ఎండీ అని అనౌన్స్- ధరణికి డౌట్

Sanjiv Kumar HT Telugu

31 July 2024, 9:00 IST

google News
  • Guppedantha Manasu Serial July 31st Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 31వ తేది ఎపిసోడ్‌లో వసుధారతో కలిసి రిషి కొత్త ప్లాన్ వేస్తాడు. కాలేజీలోకి రిషిలా రంగా ఎంట్రీ ఇస్తున్నట్లు శైలేంద్ర అనుకునేలా చేస్తాడు. శైలేంద్ర అన్నయ్యే ఎండీ అని రిషి ప్రకటిస్తాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 31వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 31వ తేది ఎపిసోడ్‌

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 31వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో సర్ మీరు ఇన్నాళ్లు ఎందుకు దూరంగా ఉన్నారు. మీరు మిస్ అయినప్పుడు మీకు ఆరోగ్యం బాలేదు. ఆరోగ్యం బాగయ్యకైన రావాలనిపించలేదా. నేను గుర్తుకు రాలేదా. మీ నాన్న గారు కూడా మీకు గుర్తుకు రాలేదా అని వసుధార అడుగుతుంది. మీరంతా నాకు గుర్తుకు వచ్చారు. కానీ, విధి ఆడిన వింత నాటకం బాటలోనే నేను నడిచాను. మీరంతా నాతోనే ఉన్నారు అని రిషి అంటాడు.

మీరు లేరనుకుని

కాలేజీ ఆపదలో ఉన్నప్పుడు అయినా మీరు రాలేదు. ఎందుకు రాలేదు అని వసుధార అడుగుతుంది. నువ్ ఉన్నావుగా వసుధార. నువ్ ప్రతిసారి కాలేజీని కాపాడావు. కానీ, ఈసారి నువ్ కాలేజీని వదిలేశావ్. అందుకే వచ్చాను అని రిషి అంటాడు. మావయ్య మీకోసం అల్లాడిపోతున్నాడు. మీరు లేరనుకుని బతుకుతున్నారు అని వసుధార అంటుంది. ఇందాకే డాడ్‌ను చూశాను. కలవలేదు. సొంత తండ్రిని దూరం నుంచి చూసిన దురదృష్టవంతున్ని అని రిషి అంటాడు.

మీరు రంగాగా ఎందుకు మారారు అని వసుధార అడిగితే రిషి చెప్పడు. ఇప్పుడు కూడా నిజం చెప్పరా. దాపరికం అంటే సహించని మీరే.. దాపరికం లేని ప్రేమను కోరుకున్న మీరు ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదని వసుధార అడుగుతుంది. నువ్ కూడా నా దగ్గర కొన్ని విషయాలు దాచావు. అప్పుడు నువ్ చెప్పిన సమాధానం.. అంతా మన మంచికోసమే అని. నేను అదే చెబుతున్నాను. నేను ఏం చేసిన మన మంచికోసమే అని రిషి అంటాడు.

అనుకోకుండా ఎదురుపడలేదు

మీరు శైలేంద్ర దగ్గర కూడా రంగాగా ఎందుకు ఉంటున్నారు. మీరే రిషి అని చెప్పేస్తే అయిపోతుంది కదా. అసలు కాలేజీ దూరం కావడానికి కారణం అని వసుధార చెప్పబోతుంటే.. నాకు తెలుసు వసుధార అని రిషి అంటాడు. దాంతో షాక్ అయిన వసుధార మీకు తెలుసా అని అడుగుతుంది. హా నాకు తెలుసు వసుధార. నేను నీకు అనుకోకుండా ఎదురుపడ్డాను అనుకుంటున్నావ్ కదా. కానీ, నువ్ ఆపదలో ఉన్నావని తెలిసే ఎదురుపడ్డాను అని రిషి చెబుతాడు.

ఇవన్ని మీకెలా తెలిసాయి సార్ అని వసుధార అడుగుతుంది. అన్నింటికి నీకు త్వరలోనే క్లారిటీ వస్తుంది. అంతవరకు నువ్ నన్ను ఏం అనకుండా. నేను ఏ కారణం లేకుండా చేయను అని నీకు తెలుసు కదా. అప్పుడు నేను అన్నయ్య దగ్గర ఎందుకు రంగాగా నటిస్తున్నానో అర్థం చేసుకో. ఎలాగైనా మన కాలేజీని కాపాడుకోవాలి. రేపు మనం కాలేజీకి వెళ్దాం అని ఏదో ప్లాన్ చెబుతాడు రిషి. దాంతో సరేనని సంతోషపడుతుంది వసుధార.

ఏ దేవుడు కూడా

మన రిషిధారల బంధం కలిసి కాలేజీని కాపాడుకుందా. ఇక మన ఇద్దరి మధ్య ఎడబాటు ఉండదు వసుధార అని రిషి అంటాడు. దాంతో ప్రేమగా రిషిని హగ్ చేసుకుంటుంది వసుధార. మరోవైపు కాలేజీని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటదట. ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా పూర్తయిందట. డీబీఎస్టీ కాలేజీ అంటే దేవాలయం. ఆ దేవాలయాన్ని ఏ దేవుడు కాపాడలేకపోతున్నాడు. రిషి సార్, వసుధార మేడమ్ కాలేజీని చాలా తీర్చిదిద్దారు. మనం రావడానికి వాళ్లే కారణం. మహేంద్ర సర్, ఫణీంద్ర సార్ మనల్ని సొంత బిడ్డల్లా చూసుకున్నారు అని విద్యార్థులు మాట్లాడుకుంటారు.

ఇప్పుడు వచ్చే ఎండీ ఎలా ఉంటారో అని భయంగా ఉందిరా అని విద్యార్థులు అనుకుంటారు. మరోవైపు ఫణీంద్ర గారు మీరు చెప్పాల్సింది ఏమైన ఉందా. ఇలా చేయడానికి నాకు మనసు ఒప్పడం లేదు. కానీ, తప్పదు. సంతకాలు పెట్టండి అని మినిస్టర్ అంటాడు. ఫణీంద్ర, మహేంద్ర ఫైల్స్ చూస్తుంటారు. ఇప్పుడే వస్తానని వెళ్లిన శైలేంద్ర రంగాకు కాల్ చేసి త్వరగా రమ్మని చెబుతాడు. సరేనని, కంగారుపడొద్దని రంగా చెబుతాడు.

విద్యార్థులు కూడా ముఖ్యమే

ఇంతలో కాలేజీ గేట్ ముందు రిషి కారు వచ్చి ఆగుతుంది. విద్యార్థులు అంతా రిషిని చూసి సంతోషంగా ఆశ్చర్యపోతారు. కాలేజీలోకి రిషి వెళ్తాడు. మరోవైపు ఏదోటి చేయండి సార్ అని శైలేంద్ర డ్రామా ప్లే చేస్తాడు. రిషి వసుధారలో ఎవరు వచ్చినా సరే ఈ కాలేజీ మీ చేతిలోనే ఉంటుంది. మీ ఎమోషన్ కాదనలేను. కానీ, విద్యార్థులు కూడా ముఖ్యమే కదా అని మినిస్టర్ అంటాడు. అప్పుడే ఆగండి అని రంగా ఎంట్రీ ఇస్తాడు. రంగాను చూసి అంతా సంతోషపడతారు.

రిషి అంటూ లేచి నిలబడతారు. సర్ నేనొచ్చాను. ఈ కాలేజీ భూషణ్ ఫ్యామిలీది. గవర్నమెంట్ ఎలా హ్యాండోవర్ చేసుకుంటుంది అని రిషి అంటాడు. మీరు లేరు. వసుధార కూడా లేరు. మీ తర్వాత ఆ పదవి చేపట్టేందుకు మీ ఫ్యామిలీలో ఎవరు లేరు అని రిషి అంటాడు. ఎందుకు లేరు సార్. మా శైలేంద్ర అన్నయ్య ఉన్నాడు కదా అని రిషి అంటాడు. దాంతో మహేంద్ర షాక్ అవుతాడు. దేవయాని సంతోషడుతుంది. రిషి నువ్ పూర్తిగా ఆలోచించే చెబుతున్నావా అని మినిస్టర్ డౌట్ పడతాడు.

నిద్రలో కలవరించిన శైలేంద్ర

అవును సార్. ఈ కాలేజీ బాధ్యతలు మా శైలేంద్ర అన్నయ్యకు అప్పజెప్పండి సార్ అని రిషి అంటాడు. సరే నువ్ చెప్పాకా కాదనలేను రిషి. ఈరోజు నుంచి శైలేంద్ర గారు డీబీఎస్టీ కాలేజీకి ఎండీ బాధ్యతలు చేపడుతున్నారు అని మినిస్టర్ అంటాడు. వెంటనే ఎస్.. నేనే.. నేనే డీబీఎస్టీ కాలేజీ ఎండీ శైలేంద్ర భూషణ్ అని నిద్రలో కలవరిస్తాడు శైలేంద్ర. దాంతో శైలేంద్ర మొహంపై నీళ్లు కొట్టి ధరణి లేపుతుంది. దాంతో లేచిన శైలేంద్ర మనమేంటీ ఇక్కడ ఉన్నాం అని అంటాడు.

మనం ఇక్కడే ఉండాలి అని ధరణి అంటుంది. అంటే నాకు కల వచ్చిందా అని శైలేంద్ర అనుకుంటాడు. పొద్దున వచ్చిన కలలు నిజమైపోతారని అంటారు అని శైలేంద్ర అంటే.. అదేంటీ నిన్నే కదా ప్రభుత్వం కాలేజీని తీసుకుంటుందని బాధపడ్డారు. ఇప్పుడే మీరు ఎండీ అయినట్లు కలలు కంటున్నారు ఏంటీ అని డౌట్ పడుతుంది ధరణి. ఆశ మనిషికి ఉండటం సహజం అని శైలేంద్ర అంటాడు. మన కాలేజీ మనకు వచ్చే అవకాశం లేదన్నారు. ఇప్పుడు ఇలా అంటున్నారు అని ధరణి అంటుంది.

ఫణీంద్ర ఎమోషనల్

మన సిక్త్స్ సెన్స్ హింట్స్ ఇస్తుంది అని శైలేంద్ర అంటాడు. మన కాలేజీ మన చేతుల్లోకి వస్తే చాలు. మీరు ఎండీ అనేది తర్వాత అని ధరణి వెళ్లిపోతుంది. ఛీ నా జీవితం నేను ఎండీ అయినా పర్వాలేదట. కానీ, కాలేజీ మాత్రం ఉండాలట అని శైలేంద్ర అంటాడు. కట్ చేస్తే డీబీఎస్టీ కాలేజీని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకోబుతందని మీటింగ్‌లో చెబుతాడు మినిస్టర్. మీరేమైనా మాట్లాడుతారా అని ఫణీంద్రను అడుగుతాడు మినిస్టర్.

లేదు. మా నాన్న కలను నిజం చేయలేకపోతున్నాను అని చాలా ఎమోషనల్ అవుతాడు ఫణీంద్ర. మీరు బాధపడకండి డాడ్. రిషిలా రంగా వచ్చి ఆ ప్రాసెస్ ఆపించేస్తాడు. అప్పుడు మన కాలేజీ మన చేతుల్లోనే ఉంటుంది అని శైలేంద్ర అనుకుంటాడు. కాలేజీ గురించి, రిషి, వసుధార గొప్పతనం, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్ గురించి గొప్పగా చెబుతాడు మినిస్టర్.

నాకు బాధగానే ఉంది

జగతి, రిషి చనిపోవడం, వసుధార వెళ్లిపోవడం, మీరు ఎండీగా ఉండేందుకు అయిష్టపడటం వల్లే ఈరోజు కాలేజీని గరర్నమెంట్ తీసుకుంటుంది. ఇలా జరుగుతున్నందుకు నాకూ చాలా బాధగా ఉంది అని మినిస్టర్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం