Guppedantha Manasu July 17th Episode: గుప్పెడంత మనసు- దేవయాని కన్నింగ్ ప్లాన్- కొత్త విలన్ ఎంట్రీ- రంగాను చూడనున్న అన్న
Guppedantha Manasu Serial July 17th Episode: గుప్పెడంత మనసు సీరియల్ జూలై 17వ తేది ఎపిసోడ్‌లో రిషి కావాలనే వసుధార నుంచి ఎస్కేప్ అయ్యాడని రంగా అంటాడు. మరోవైపు సరజతో ఎమ్ఎస్ఆర్ శిష్యుడి పెళ్లి చూపులు జరగనున్నట్లు తెలుస్తోంది. దానికి శైలేంద్రను పిలుస్తాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో సరోజ తన పెళ్లి చూపులు ఆపేయమని రంగాతో అంటుంది. కానీ, రంగా మాత్రం ఆపనని, మీ నాన్న చూసిన సంబంధమే చేసుకోమ్మని అంటాడు. నేను నిన్ను తప్పా ఇంకెవరినీ పెళ్లి చేసుకోను. సంబంధం కోసం వచ్చిన ప్రతి పెళ్లి కొడుకుని పొలిమేర దగ్గర పాతిపెడతాను అని సరోజ అంటుంది. తర్వాత బుజ్జి రారా అని తీసుకెళ్లబోతూ వసుధారను చూసి ఆగిపోతుంది సరోజ.
నీ పెళ్లి చూపులు సక్సెస్
చిన్న కప్‌లో రాయి వేస్తూ వసుధార ఉంటుంది. అందులో రాయి పడితే నా పెళ్లి చూపులు సక్సెస్ అని కోరుకున్నావా. కానీ రాయి బయట పడింది అంటే నా పెళ్లి చూపులు సక్సెస్ కాదనేగా అని సరోజ అంటుంది. నేను అలా కోరుకోలేదు. కప్‌లో పడితేనే సక్సెస్ కాదని కోరుకున్నా. కానీ పడలేదు. అంటే నీ పెళ్లి చూపులు సక్సెస్ అని వసుధార అంటుంది. దాంతో చిరాకుగా రారా బుజ్జి అని తీసుకెళ్లిపోతుంది సరోజ. మరోవైపు ఎండీ సీటు దక్కట్లేదని దేవయానితో చెబుతాడు శైలేంద్ర.
ఇన్నాళ్లు జగతి, రిషి, వసుధార అనుకున్నా. తర్వాత మను గాడు అడ్డుగా ఉంటే.. వాడిని ఎలాగోలా పోయేలా చేశాను. ఇప్పుడు కూడా నాకు పదవి దక్కట్లేదు. ఆ మినిస్టర్ గాడు ఏదేదో వాగుతున్నాడు. వసుధార, రిషి వచ్చి చెబితే గానీ ఇవ్వడట. నేను వాళ్లను కప్పెట్టేశాను. చనిపోయిన వాళ్లు ఎలా బతికి వస్తారు. మనం కలలు కనడం తప్పా నిజం చేసుకోలేమని అర్థమైంది. నాకు ఆ పదవి దక్కదని అర్థం అవుతోంది అని శైలేంద్ర ఆవేశంగా అంటాడు.
శైలేంద్ర దేవయాని షాక్
ఇంతలో వచ్చిన ధరణి నేను ఎప్పుడో చెప్పాను కదా. కుళ్లు కుతంత్రాలు చేసే వారికి ఆ సీటు దక్కదు. మంచి చేసే వారికి దక్కుతుంది అని ధరణి అంటుంది. నా కోడలు అని ఊరుకుంటున్నా. మేము ఏం చేయలేమని అనుకోకు అని దేవయాని ధరణికి వార్నింగ్ ఇస్తుంటుంది. ఇంతలో మహేంద్రను ఇంటికి తీసుకొస్తాడు ఫణీంద్ర. శైలేంద్ర దేవయాని షాక్ అవుతారు. నేను ఇక్కడ ఉండలేను. మీరు ఏం అనుకోవద్దు. నా దారినే నేను వెళ్లిపోతాను అని మహేంద్ర అంటాడు.
నువ్ నా తమ్ముడివి. ఎక్కడికి వెళ్తావ్. ఒంటరిగా ఎలా ఉంటావ్. నీకు ఇష్టం లేకున్నా నాకోసం ఇక్కడ ఉండు అని ఫణీంద్ర అంటాడు. అదే విషయం శైలేంద్ర, దేవయానికి చెబుతాడు. మీరు మహేంద్రకు బాధ కలిగించేలా మాట్లాడిన, ఏమైనా చేసిన ఊరుకోను. ముందే చెబుతున్నాను అని వార్నింగ్ ఇస్తాడు. మహేంద్రను లోపలికి వెళ్లమంటే.. వెళ్లిపోతాడు. ఏంటీ మమ్మీ కల నిజమా.. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని శైలేంద్ర సంతోషిస్తాడు.
ఏమైనా ప్లాన్ చేశావా
నువ్ అడిగావ్ నేను చేశాను అని దేవయాని అంటుంది. అన్ని బాగా చేస్తున్నావ్ కానీ ఆ ఎండీ సీటు నాకు వచ్చేలా చేయట్లేదేంటీ అని శైలేంద్ర అడిగితే.. ఇదంతా చేసేది అందుకే కదా. ఇక మనం ఎండీ సీటు గురించే ఆలోచిస్తూ ప్లాన్స్ వేయాలి అని దేవయాని అంటుంది. మరోవైపు సరోజతో ఏంటీ పక్కకు తీసుకొచ్చావ్, ఏమైనా ప్లాన్ చేశావా అని సిగ్గూ పడుతూ అడుగుతాడు బుజ్జి. దాంతో ఒక్కటి లాగి పెట్టి కొడుతుంది సరోజ. నాకు పెళ్లి చూపులు. చెడగొట్టడానికి ఏదైనా ప్లాన్ చెప్పమని అడుగుతుంది సరోజ.
పొలిమేర దగ్గర ఆపి వేసేయమంటావా అని బుజ్జి అంటే.. మర్డర్ చేసే మొహమేనా నీది అని సరోజ అంటుంది. నీకు క్యాన్సర్ అని, వారం రోజుల్లో చనిపోతావని చెప్పనా అని బుజ్జి అంటాడు. అలా చేస్తే సుమంగలిగా పైకి పంపించేయాలని డైరెక్ట్‌గా పెళ్లి చేసుకుంటానంటాడు అని సరోజ అంటుంది. బావకు నాకు మధ్య లవ్ ఉందని హింట్ ఇద్దామని సరోజ అంటుంది. నీ గురించి మీ నాన్న వాళ్లకు అన్ని చెప్పి ఉంటారు. అందుకే పెళ్లి చూపులకు పిలిచారు. అది వర్కౌట్ కాదని బుజ్జి అంటాడు.
ప్రేమించిన అమ్మాయితో
లేకుంటే నువ్ నన్ను ప్రేమించావని చెప్పనా అని బుజ్జి అంటే.. తొండ మొహపోడా నేను నిన్ను ప్రేమించడమేంట్రా అని సరోజ అంటుంది. అలా అయితే నేనే నిన్ను ప్రేమించాను అని, దీనికి ఈ ఊరంత సాక్ష్యం అని చెప్పనా. అలా అయితే వర్కౌట్ అవుతుంది. ప్రేమ గుడ్డిది అంటారుగా అని బుజ్జి అంటాడు. సరే అలాగే చేయు అని సరోజ చెబుతుంది. కట్ చేస్తే.. రంగాతో సరోజ మిమ్మల్ని ప్రేమిస్తుంది. అలా ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిగితే జీవితం చాలా బాగుంటుంది అని గొప్పగా చెబుతుంది వసుధార.
మీది మీ రిషి సార్‌ది లవ్ మ్యారేజా అరెంజ్ మ్యారేజా అని రంగా అడుగుతాడు. వసుధార సైలెంట్‌గా ఉంటే.. నేనే గెస్ చేస్తాను అని మీది కచ్చితంగా అరెంజ్ మ్యారేజే. మీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది. ముఖ్యంగా మీపై రిషి సార్ ఇష్టం లేకుండా చేసుకున్నట్లు ఉన్నారు. అందుకే మీకు దూరం అయ్యారు. ఇన్నాళ్లు దూరంగా ఎందుకు ఉంటారు. మీకు ఇష్టం ఉన్నట్లు ఉంది గానీ ఆయనకు లేనట్లుంది అని రంగా అంటాడు. మీరు తప్పుగా గెస్ చేశారండి అని వసుధార అంటుంది.
జగతి మేడమ్ కోసమేనా
లేదు కరెక్టే. మీలోని మంచి విషయాలను ఇష్టపడి ఉంటారు. ఆయనలో మంచి సైడ్ మాత్రమే కాకుండా ఇంకో సైడ్ ఉండి ఉంటుంది. అందరూ మీరు ఆయన మిస్ అయ్యారని అనుకుంటున్నారు. కానీ, మీ నుంచి ఎస్కేప్ అయి ఉంటారు అని మెల్లిగా రంగా అంటాడు. దాంతో కోప్పడిన వసుధార ఎందుకు సార్ ఇలా కావాలనే మాట్లాడుతున్నారు. మీరు నాపై ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారా. ఎన్నోసార్లు నాపై ప్రేమను వ్యక్తపరిచారు కదా. జగతి మేడమ్ కోరిక మేరకే నన్ను పెళ్లి చేసుకున్నారా రంగాను నిలదీస్తుంది.
ఏంటీ మేడమ్. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటీ. అనవసరంగా మీ టాపిక్ తెచ్చాను. నేను పెళ్లి చేసుకున్నట్లు నన్ను లింక్ చేసి మాట్లాడుతున్నారు. ఊర్లో ఎవరైనా వింటే సమస్య. మొన్నే ఓసారి వచ్చి అడిగారు. మీతో ఇంతసేపు మాట్లాడిన తప్పే అని రంగా వెళ్లిపోతాడు. మరోవైపు మహేంద్ర నన్ను అనుమానిస్తున్నావా అని దేవయాని అంటుంది. మిమ్మల్ని అనుమానించకపోతేనే సమస్య అని మహేంద్ర అంటాడు.
బ్లాక్ మెయిల్ చేశారేమో
ఇన్నాళ్లు నాతో ఉన్న అనుపమ సడెన్‌గా వెళ్లిపోవడం ఏంటీ అని మహేంద్ర అంటాడు. అది మాకెం తెలుసు. మాకు చెప్పి వచ్చిందా.. వెళ్లేటప్పుడు చెప్పడానికి అని దేవయాని అంటుంది. తెలివిగా మాట్లాడొద్దు వదిన గారు. ఎప్పుడైనా నా నుంచి దూరంగా అనుపమ ఉండదు. జగతి చనిపోయి నేను బాధలో ఉన్నాను. వసుధార కూడా లేదు. ఇలాంటప్పుడు తను వెళ్లదు అని మహేంద్ర అంటాడు. ఆమె వెళ్లిపోతే మీరెందుకు బాధపడుతున్నారు. మను వస్తాడు కదా అప్పుడప్పుడు అని శైలేంద్ర అంటాడు.
రాడు.. ఈ విషయం మీ ఇద్దరికి తెలుసని నాకు తెలుసు. ఈ యాక్టింగ్ ఏదో బుల్లితెరపై గానీ, వెండితెరపై చేస్తే అవార్డ్స్ వస్తాయి కదా. ఇన్నాళ్లు మనుకు దూరంగా ఉన్న అనుపమ ఇప్పుడు నాకు దూరంగా ఉండి మనుకు దగ్గరైంది అని మహేంద్ర అంటాడు. కొడుకుతో ఉంటే మంచిదేగా అని దేవయాని అంటుంది. ఉంటే మంచిదే. కానీ, దీని వెనుక మీ బ్లాక్ మెయిల్స్ గానీ, ఇంకేమేనా ఉండి ఉంటే నేను వదిలిపెట్టను అని మహేంద్ర అంటాడు.
బలహీనం అవుతాడనుకుంటే
దాంతో శైలేంద్ర భయపడిపోతాడు. మేము ఎలా బ్లాక్ మెయిల్ చేస్తాం. ఏమని చేస్తాం. ఆమె భర్త ఎవరో తెలిస్తే దాన్ని అడ్డుపెట్టుకుని చేయొచ్చు. ఆమె సీక్రెట్స్ నీకే తెలియనప్పుడు మాకు ఎలా తెలుస్తుంది అని దేవయాని అంటుంది. అవును మీకు ఏం తెలియదు అని మహేంద్ర వెళ్లిపోతాడు. ఏంట్రా ఇది అనుపను దూరం చేస్తే ఒంటరిగా బలహీనం అవుతాడనుకుంటే ఇలా చేస్తున్నాడు అని దేవయాని అంటుంది. ఇంతలో శైలేంద్రకు కాల్ వస్తుంది.
సర్ నేను ధన్‌రాజ్‌ని. ఎమ్ఎస్ఆర్ శిష్యుడుని. చిన్న అవసరం ఉండి మీకు కాల్ చేశాను అని అతను అంటాడు. మీ ఎమ్ఎస్ఆర్ ఉండగా నేను సహాయం చేయడమేంటీ అని శైలేంద్ర అంటాడు. ఇంకెక్కడి ఎమ్ఎస్ఆర్ నాలుగైదు క్రిమినల్ కేసులు ఉన్నాయి. తప్పించుకుంటూ అండర్ గ్రౌండ్‌లో తిరుగుతున్నాడు. మీరు నా పెళ్లి విషయంలో హెల్ప్ చేయాలని ధన్‌రాజ్ అంటాడు. నేను ఏం చేయగలనురా అని శైలేంద్ర అంటే.. కాదనొద్దు. మన ఇంటికి వచ్చి మాట్లాడుతాను అని కాల్ కట్ చేస్తాడు ధన్‌రాజ్.
ఎమ్ఎస్ఆర్ శిష్యుడు
ఎవర్రా అని దేవయాని అడిగితే.. ధన్‌రాజ్ అని పెద్ద జాదూగాడూ. ఎమ్ఎస్ఆర్ దగ్గర పనిచేస్తూ కమిషన్స్ తీసుకుంటాడు. వాడికి పెళ్లి విషయం మాట్లాడటానికి ఇంటికి వస్తాడట అని శైలేంద్ర చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. చూస్తుంటే.. సరోజకు పెళ్లి చూపులకు వచ్చేది ఈ ఎమ్ఎస్ఆర్ శిష్యుడు ధన్‌రాజ్ అని తెలుస్తోంది. పెళ్లి చూపులకు శైలేంద్రను తీసుకెళ్తే.. అక్కడ రంగాను చూసే అవకాశం ఉంది. మరి ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి.
టాపిక్