తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram Distributor: గుంటూరు కారంతో లాభాలు వచ్చాయి: డిస్ట్రిబ్యూటర్

Guntur Kaaram Distributor: గుంటూరు కారంతో లాభాలు వచ్చాయి: డిస్ట్రిబ్యూటర్

Hari Prasad S HT Telugu

26 January 2024, 22:32 IST

    • Guntur Kaaram Distributor: గుంటూరు కారం సినిమాతో తమకు బాగానే లాభాలు వచ్చినట్లు కృష్ణా జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ చెప్పడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు చుట్టూ జరుగుతున్న చర్చ నేపథ్యంలో అతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు
గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు

గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు

Guntur Kaaram Distributor: గుంటూరు కారం మూవీ అసలు బాక్సాఫీస్ కలెక్షన్లు ఎన్ని? ఈ సినిమా కలెక్షన్లను 40 నుంచి 50 శాతం ఎక్కువ చేసి చూపిస్తున్నారా? ప్రొడ్యూసర్ నాగవంశీ కావాలని తప్పుడు లెక్కలు ఇస్తున్నాడా? కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మూవీ కలెక్షన్లపై ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. కానీ, అదొక్కటే నిరాశ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Anushka: అరుంధ‌తిలో అనుష్క ఫ‌స్ట్ ఛాయిస్ కాదు - ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని మిస్‌ చేసుకున్న మ‌ల‌యాళం హీరోయిన్ ఎవ‌రంటే?

గుంటూరు కారం సినిమాకు వచ్చిన నెగటివ్ టాక్ నేపథ్యంలో అసలు ఇంత భారీ కలెక్షన్లు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తమకు ఈ సినిమా వల్ల లాభాలు వచ్చినట్లు చెప్పడం విశేషం.

గుంటూరు కారంతో లాభాలు

గుంటూరు కారం మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైంది. అయితే తొలి షో నుంచే నెగటివ్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో అదే సమయంలో రిలీజైన హనుమాన్ వైపు చాలా మంది ప్రేక్షకులు చూశారు. ఫలితంగా గుంటూరు కారం కలెక్షన్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ట్రేడ్ అనలిస్టులు కూడా హనుమాన్ కలెక్షన్లే ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో గుంటూరు కారం కలెక్షన్లన్నీ తప్పని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. వీటిపై తాజాగా డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ స్పందించాడు. అతడు Gulte.comతో మాట్లాడాడు. "ఇతరుల గురించి నేను మాట్లాడను కానీ కృష్ణా జిల్లా, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు చాలా పెద్ద నెట్‌వర్క్ ఉంది. గుంటూరు కారం అందరికీ లాభాలు తెచ్చిపెట్టిందని నేను చెప్పగలను. మొత్తం సినిమా కలెక్షన్లు ఎన్ని అన్నది మాత్రం వంశీ అన్నకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ రిపోర్టులు అతనొక్కడికే వస్తాయి" అని ధీరజ్ చెప్పాడు.

అతడు ఏబీసీడీ, దొరసాని, డీజీ టిల్లూ, బేబీలాంటి సినిమాలకు ప్రొడ్యూసర్ కూడా. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీని కూడా తీసుకొస్తున్నాడు. గుంటూరు కారం మూవీ గురించి అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాక్సాఫీస్ లెక్కలు తప్పని ఓవైపు వార్తలు వస్తుండగా.. సినిమా వల్ల తమకు లాభాలే వచ్చాయని ఓ డిస్ట్రిబ్యూటర్ చెప్పడం విశేషం.

అంతేకాదు ఈ నంబర్లన్నీ కేవలం అభిమానులు, ప్రొడ్యూసర్లు, మీడియాకే అవసరం అని.. సాధారణ ప్రేక్షకులకు అవసరం లేదని కూడా ధీరజ్ అన్నాడు. వాళ్లు కలెక్షన్లను బట్టి సినిమా చూడరని, కంటెంట్ ఉంటేనే చూస్తారని స్పష్టం చేశాడు.

నిజానికి ఈ సినిమాకు తెలంగాణతో పోలిస్తే ఏపీలో టికెట్ల ధర పెంపు కూడా తక్కువగానే ఉంది. అక్కడ ఒక్కో టికెట్ పై రూ.50 మాత్రమే పెంచారు. తెలంగాణలో అయితే రూ.65, రూ.100 పెంచారు. మూవీకి తొలి రోజే నెగటివ్ టాక్ రావడంతో తెలంగాణలో అంత ధర పెట్టి ఈ సినిమాను చూసే ఆసక్తి ప్రేక్షకులు చూపించకపోవడంతో ఈ ప్రాంతంలో కలెక్షన్లు తగ్గాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం