Gundeninda Gudigantalu Serial: ప్రేమ విషయంలో తమ్ముడికి బాలు వార్నింగ్ - మాటతప్పిన మీనా - శృతిపై రోహిణి డౌట్
21 September 2024, 7:27 IST
Gundeninda Gudigantalu : గుండెనిండా గుడిగంటలు ప్రోమోలో శృతి, రవిల ప్రేమ విషయం భార్య ద్వారా తెలుసుకున్న బాలు ఆవేశం పట్టలేకపోతాడు. రవి పనిచేస్తోన్న రెస్టారెంట్‌కు వెళ్లి అందరి ముందే అతడి కాలర్ పట్టుకొని నిలదీస్తాడు. శృతిని పెళ్లిచేసుకోవడానికి వీలు లేదని తమ్ముడికి వార్నింగ్ ఇస్తాడు.
గుండెనిండా గుడిగంటలు సీరియల్
Gundeninda Gudigantalu Serial: రవిని శృతి ప్రేమిస్తుందని తెలిసి మీనా షాకవుతుంది. రవిని లేవదీసుకుపోయి వెంటనే రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంటానని మీనాతో శృతి అంటుంది. ఆమె స్పీడు చూసి మీనాకు కంగారు పడుతుంది. రవికి తన ప్రేమ గురించి చెప్పే ధైర్యం ఇంట్లో లేదని నిర్ణయించుకున్న శృతి పెళ్లి విషయంలో మీనా సాయం కోరుతుంది. తమ ప్రేమ పెళ్లిని సక్సెస్ చేసే బాధ్యతను మీనాపై పెడుతుంది. పోలీస్ స్టేషన్‌లో పడ్డ బాలును విడిపించినందుకు బదులుగా తనకు ఈ సాయం చేయాలని కోరుతుంది.
మీనా సలహా...
శృతి, రవిల పెళ్లి జరిపిస్తే భర్తతోపాటు అత్తింటివారికి తాను శత్రువుగా మారే ప్రమాదం ఉందని మీనా భయపడుతుంది. మనోజ్, బాలు తనకు చెప్పకుండా పెళ్లిచేసుకున్నారని, కనీసం రవి పెళ్లి అయినా తన చేతుల మీదుగా జరిగితే బాగుంటుందని మామయ్య సత్యం అన్న మాటలను మీనా గుర్తుచేసుకుంటుంది. రవిని మర్చిపోతే మంచిదని శృతికి సలహా ఇస్తుంది మీనా. ఆమె మాటలతో శృతి కోపం మరింత పెరుగుతుంది. తాను ఈ విషయం తేల్చుకుంటానని వెళ్లబోతుంది. భర్తతో పాటు సత్యం మావయ్యతో మీ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతానని శృతిని కన్వీన్స్ చేసి పంపిస్తుంది మీనా.
శృతి ఫైర్...
తనను మోసం చేసి పెళ్లిచూపులకు తీసుకెళ్లిన తల్లిదండ్రులపై శృతి ఫైర్ అవుతుంది. రవి అంటే ఇష్టమని, అతడినే పెళ్లిచేసుకుంటానని తేల్చిచెబుతుంది. సంజుతోనే నీ పెళ్లి జరిపించి తీరుతామని కూతురితో అంటారు శోభన, సురేంద్ర. రవి సంగతి సంజుకు తెలియకుండా ఉంచాలని సురేంద్ర అనుకుంటాడు.
బాలు అనుమానం నిజమైంది...
రవి, శృతిల ప్రేమ విషయం బాలుకు ఎలా చెప్పాలా అని మీనా చాలా ఆలోచిస్తుంది. చివరకు ధైర్యం చేసి భర్తతో వారి ప్రేమ గురించి చెబుతుంది. శృతిని రవి ప్రేమిస్తోన్నట్లు తనకు అనుమానం ఉండేదని, అది నిజమేనని నీ మాటలతో తేలిందని బాలు అంటాడు.
శృతిని రవి పెళ్లిచేసుకోవడానికి బాలు ఒప్పుకోడు. నాన్నను శృతి తండ్రి మోసం చేశాడని బాలు అంటాడు. అదే కాకుండా తమ్ముడిని తన మనుషులతో శృతి తండ్రి కొట్టించాడని, అలాంటి వ్యక్తి కూతురిని రవి ప్రేమించడానికి వీలు లేదని అంటాడు. తన తండ్రితో రవి, శృతిల ప్రేమ విషయం చెప్పొద్దని మీనాతో అంటాడు.
ప్రభావతికి తెలియకుండా...
రవి, శృతిల ప్రేమ విషయం తల్లికి తెలియకుండా జాగ్రత్త పడాలని బాలు అనుకుంటాడు. శృతి కోటీశ్వరుడి కూతురు అని తెలిస్తే వెంటనే తన తల్లి ఈ పెళ్లికి ఒప్పుకుంటుందని అనుకుంటాడు. ఈ ప్రేమ సంగతి తాడోపేడో తెల్చుకోవాలని ఆవేశంగా తమ్ముడు పనిచేస్తోన్న రెస్టారెంట్‌కు వెళాడు బాలు.
అందరి ముందే రవి కాలర్ పట్టుకుంటాడు. నేను ఏం చెప్పాను నువ్వేం చేశావని తమ్ముడిని నిలదీస్తాడు. బాలు దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియక రవి కంగారు పడతాడు. అందరూ ముందు రవిని అవమానించడం కరెక్ట్ కాదని బాలును మీనా వారిస్తుంది.
రవికి వార్నింగ్...
శృతిని ప్రేమించడానికి, పెళ్లిచేసుకోవడానికి వీలులేదని రవికి వార్నింగ్ ఇస్తాడు బాలు. ఇంకోసారి నీ నోటి వెంట ప్రేమ అనే మాట వినిపిస్తే ఈ బాలు అంటే ఏంటో చూపిస్తానని హెచ్చరిస్తాడు. అన్నయ్య వార్నింగ్‌కు రవి భయపడిపోతాడు. బాలు తమ ప్రేమను గెలిపిస్తాడని ఊహిస్తాడు రవి.
కానీ అతడే తమ ప్రేమకు అడ్డు చెప్పడం చూసి రవి షాకవుతాడు.శృతి కట్టుబొట్టు చూసి ఆమెపై ప్రభావతి, రోహిణిలకు డౌట్ వస్తుంది. ఆమె తమ ఇంటికి ఎందుకొచ్చింది? మీనాతో ఏం మాట్లాడిందనేదానిపై ఎంక్వైరీలు చేయడం మొదలుపెడతారు.
మీనా ఫిక్స్..
ప్రేమను గెలిపిస్తానని శృతికి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేకపోవడంతో బాధపడుతుంది మీనా . శృతికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతుంది. భర్త మాటను ధిక్కరిస్తూ రవి, శృతిలప్రేమను గెలిపించడం కోసం మీనా ఏం చేసింది? కొడుకు ప్రేమ సంగతి ప్రభావతికి తెలిసిందా? లేదా అన్నది సోమవారం నాటి గుండెనిండా గుడి గంటలు ఎపిసోడ్‌లో చూడాల్సిందే.
టాపిక్