Gunde Ninda Gudi Gantalu: మారిపోయిన బాలు - మనోజ్ జాబ్ గురించి రోహిణి గొప్పలు - రవి, శృతి ఎంట్రీకి లైన్ క్లియర్
30 November 2024, 10:20 IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు ప్రోమోలో బాలు అపార్ట్మెంట్లో క్లీనర్‌గా జాబ్ చేస్తున్నాడని తెలిసి మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు మనోజ్ ద్వారానే రవి, శృతిలను తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తుంది ప్రభావతి. రోహిణి ముందు మనోజ్‌ను ఇరికించేస్తుంది.
గుండె నిండా గుడి గంటలు
Gunde Ninda Gudi Gantalu: అపార్ట్మెంట్ క్లీనర్‌గా జాబ్‌లో చేరతాడు బాలు. మీనాతో పాటు ఇంట్లోవాళ్లకు డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు అబద్ధం ఆడుతాడు. ఫారిన్ కారు నడుపుతున్నట్లు చెబుతాడు. డ్యూటీకి బాలు బయలుదేరుతాడు. కానీ ఇంటి బయట కారు కనిపించకపోవడంతో ఫారిన్ కారు ఏదని బాలును మీనా అడుగుతుంది. కొత్తగా డ్యూటీలో చేరాను కదా...ఇప్పుడే ఓనర్ నన్ను నమ్మి కారు ఎలా ఇస్తాడు అంటూ అబద్ధాలతో కవర్ చేస్తాడు.
బయటపడ్డ నిజం...
అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ భార్య ద్వారా బాలు క్లీనర్‌గా పనిచేస్తోన్న విషయం మీనాకు తెలిసిపోతుంది. అది నిజమో కాదో తెలుసుకునేందుకు అపార్ట్మెంట్ దగ్గరకు వస్తుంది మీనా. అపార్ట్మెంట్లోని అన్ని కార్లు క్లీన్ చేస్తూ బాలు కనిపిస్తాడు. పని రాకుండా ఉద్యోగంలో ఎందుకు చేరుతావని బాలును అపార్ట్మెంట్ వాళ్లు నానా మాటలు అంటారు. ఓ కారు ఓనర్‌పై బాలుపై మొబైల్ దొంగతనం చేశాడనే నింద వేస్తాడు. ఆ మొబైల్ బాలు దొంగతనం చేయలేదనే నిజం ఆ తర్వాత బయటపడుతుంది.
సారీ కూడా చెప్పకుండా...
దొంగ అంటూ తనపై నిందలు వేసిన కారు ఓనర్ కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్లిపోవడంతో బాలు బాధపడతాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. తన టైమ్ బాగోలేదని సర్ధిచెప్పుకుంటాడు... బాధ్యతలు ఉన్నాడో బాధలు భరించాల్సిందేనని తనకు తానే సర్ధిచెప్పుకుంటాడు.
హనీమూన్ ప్రపోజల్...
రవితో కలిసి హనీమూన్ వెళ్లాలని శృతి అనుకుంటుంది. హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్లాలనే విషయంలో స్నేహితురాలి సలహా తీసుకుంటుంది. కానీ శృతి హనీమూన్ ప్రపోజల్‌ను రవి కాదని అంటాడు. నీతో ఏకాంతంగా గడపాలని నాకు ఉంటుందిగా అంటూ రవిని కన్వీన్స్ చేయాలని చూస్తుంది శృతి. ఇప్పటికే మనం ఇద్దరం రెండు ఫ్యామిలీలకు దూరమై ఒంటరివాళ్లమయ్యామని, ఈ బాధలో హనీమూన్‌ను ఏంజాయ్ చేయలేమని రవి సమాధానమిస్తాడు.
ఆస్తిపాస్తుల కోసమైనా...
రవిపై కోపం ఉన్నా...శృతికి ఉన్న ఆస్తిపాస్తుల కోసమైనా వారిని తిరిగి ఇంటికి తీసుకురావాలని ఫిక్సవుతుంది ప్రభావతి. కానీ బాలు ఎలా రియాక్ట్ అవుతాడోనని భయపడిపోతుంది. రవి తిరిగి ఇంటికి రావడం తనకు ఇష్టం లేదని మనోజ్ బిల్డప్‌లు ఇస్తాడు. రవి వస్తే తనకు ఇంట్లో విలువ ఉండదని భయపడిపోతాడు. కానీ మనోజ్ ద్వారానే రవి, శృతిలను ఇంటికి తిరిగి రప్పించాలని ప్రభావతి ఫిక్సవుతుంది.
ప్రభావతి ఐడియా...
మనోజ్‌ను రోహిణి ముందు ఇరికించేస్తుంది. మీ ఆఫీస్‌లో చెప్పి కారు కొనుక్కోమని అంటే మనోజ్ మొహమాటపడుతున్నాడని, నువ్వే వెళ్లి ఆ కారు సంగతి ఏదో చూడమని రోహిణితో అంటుంది ప్రభావతి. తల్లి మాటలు వినగానే మనోజ్ షాకవుతాడు. అత్తయ్య ఇచ్చిన ఐడియా బాగుందని రోహిణి మురిసిపోతుంది. నిజంగానే మీ బాస్‌తో చెప్పి లోన్ మీదా కారు కొనచ్చుగా అని భర్తను అడుగుతుంది. బ్యాక్ టూ బ్యాక్ ట్విస్ట్లత మనోజ్ టెన్షన్ పడతాడు.
రోహిణి బిల్డప్
ఈ నెల మనోజ్ పదిహేను కార్లు అమ్మాడట...ఫుల్ ఏసీలోనే అతడి డ్యూటీ మొత్తం అని రోహిణి బిల్డప్‌లు ఇస్తుంది. నిద్రొస్తే పడుకోవడానికి అంటూ రోహిణి అనగా...బెంచీలు కూడా ఉన్నాయిగా అని ప్రభావతి సమాధానమిస్తుంది. మనోజ్ ఉద్యగం చేయడం లేదన్నా నిజం రోహిణికి తెలిసిపోయిందా? తన వల్లే భర్త క్లీనర్‌గా మారాల్సివచ్చిందనే బాధతో మీనా ఎలాంటి నిర్ణయం తీసుకుందన్నది సోమవారం నాటి గుండె నిండా గుడి గంటలు సీరియల్లో చూడాల్సిందే.