Naga Chaitanya Motor Racing Team: రేసింగ్ టీమ్ ఓన‌ర్‌గా నాగ‌చైత‌న్య-naga chaitanya buys hyderabad blackbird motor racing team ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya Motor Racing Team: రేసింగ్ టీమ్ ఓన‌ర్‌గా నాగ‌చైత‌న్య

Naga Chaitanya Motor Racing Team: రేసింగ్ టీమ్ ఓన‌ర్‌గా నాగ‌చైత‌న్య

HT Telugu Desk HT Telugu
Sep 14, 2023 02:08 PM IST

Naga Chaitanya Motorsport Team: నాగ‌చైత‌న్య కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. హైద‌రాబాద్ బ్లాక్‌బ‌ర్డ్స్ అనే మోట‌ర్ రేసింగ్ టీమ్‌ను కొనుగోలు చేశాడు.

నాగ‌చైత‌న్య
నాగ‌చైత‌న్య

Naga Chaitanya Motorsport Team: అక్కినేని హీరో నాగ‌చైత‌న్య మోట‌ర్ రేసింగ్ టీమ్‌కు ఓన‌ర్‌గా మారాడు. హైద‌రాబాద్ బ్లాక్‌బ‌ర్డ్స్ (హెచ్‌బీబీ) రేసింగ్ టీమ్‌ను కొనుగోలు చేశాడు. మోట‌ర్ రేసింగ్ గేమ్‌లో భాగ‌మ‌వ్వాల‌నే త‌న క‌ల ఈ రూపంలో తీర‌డం ఆనందంగా ఉంద‌ని నాగ‌చైత‌న్య పేర్కొన్నాడు.

yearly horoscope entry point

రేసింగ్ గేమ్స్ ప‌ట్ల ఆస‌క్తిని క‌లిగిన యువ ప్ర‌తిభావంతుల‌కు హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ టీమ్ చ‌క్క‌టి వేదిక‌గా మారుతుంద‌ని నాగ‌చైత‌న్య తెలిపాడు. డ్రైవ‌ర్స్ ఛాంపియ‌న్‌షిప్‌తో ఇండియ‌న్ రేసింగ్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన నాగ‌చైత‌న్య టీమ్ సెకండ్ పొజిష‌న్‌లో నిలిచింది. ఈ ఏడాది జ‌రుగ‌నున్న ఫార్ములా 4 ఇండియ‌న్ చాంఫియ‌న్‌షిప్ లో నాగ‌చైత‌న్య టీమ్ పోటీచేయ‌బోతుంది.

నాగ‌చైత‌న్య టీమ్‌కు అఖిల్ ర‌బీంద్ర‌, నీల్ జానీ డ్రైవ‌ర్స్‌గా కొన‌సాగ‌నున్నారు. రేసింగ్ గేమ్స్ ప‌ట్ల ముందునుంచి అక్కినేని హీరోలు స్పెష‌ల్ ఇంట్రెస్ట్ చూపుతూవ‌చ్చారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగిన రేసింగ్ గేమ్స్‌లో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య‌, అఖిల్ సంద‌డి చేశారు.

మ‌రోవైపు కార్తికేయ 2 డైరెక్ట‌ర్ చందూ మొండేటితో త‌దుప‌రి సినిమా చేయ‌బోతున్నాడు నాగ‌చైత‌న్య‌. జాల‌ర్ల జీవితాల బ్యాక్‌డ్రాప్‌లో డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం.

సెప్టెంబ‌ర్ 20 నుంచి నాగ‌చైత‌న్య, చందూ మొండేటి మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకాబోతున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకంపై బ‌న్నీవాస్ నిర్మించ‌నున్నారు. చందూ మొండేటితో పాటు శివ‌నిర్వాణ‌తో నాగ‌చైత‌న్య ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

Whats_app_banner