Gunde Ninda Gudi Gantalu: మీనాకు క్షమాపణలు చెప్పిన రవి - భార్యను వదిలేసిన బాలు - తండ్రికి ఎదురుతిరిగిన శృతి
17 October 2024, 8:26 IST
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 17 ఎపిసోడ్‌లో రవిని కలిసిన మీనా...సత్యం అరెస్ట్ అయిన సంగతి చెబుతుంది. మీరు చేసిన తప్పువల్ల మావయ్యతో పాటు తనకు శిక్ష పడిందని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. క్షమించమని వదిన కాళ్లు పట్టుకుంటాడు రవి.
గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 17 ఎపిసోడ్
Gunde Ninda Gudi Gantalu: తనను బకరాను చేసి శృతి పారిపోయిన సంగతి తన తండ్రి నీలకంఠానికి చెబుతాడు సంజు. కొడుకు మాటలు విని నీలకంఠం ఆవేశపడతాడు. సురేంద్రకు ఫోన్ చేస్తాడు. శృతి లేచిపోయిన విషయం నీలకంఠానికి తెలిసిందని భయపడిన సురేంద్ర ఫోన్ లిఫ్ట్‌చేయడు. కోపం పట్టలేకపోయిన నీలకంఠం...సంజు పెళ్లిలో అతడి పక్కన పెళ్లికూతురిగా శృతినే కూర్చోవాలని తన మనుషులకు ఆర్డర్ వేస్తాడు. శృతిని ఎక్కడున్న వెతికి తీసుకురమ్మని చెబుతాడు.
శృతి వాదన...
తన కుటుంబానికి ఏదో ఆపద జరిగినట్లు రవి మనసు కీడు శంకిస్తుంది. మీనాకు ఫోన్ చేయాలని అనుకుంటాడు. శృతి వద్దని వారిస్తుంది. మనం ఇంటికి వెళదామని రవి అంటాడు. పెద్దలు ప్రేమను అర్థం చేసుకోలేరని, మనల్ని కలవనివ్వరని వద్దని భర్తతో శృతి వాదిస్తుంది. మా తల్లిదండ్రులకు నా మెడలో తాళికంటే కుటుంబ పరువే ముఖ్యమని, మనల్ని తప్పకుండా విడదీస్తారని రవితో అంటుంది శృతి. సంజు కూడా మనపై పగతో రగిలిపోతుంటాడని భయపడుతుంది.
భయపడ్డ రవి...శృతి
శృతి మాటల్ని లెక్కపెట్టకుండా ఇంట్లోవాళ్లను ఒక్కసారి చూసివస్తానని రవి బయలుదేరబోతాడు. వద్దని రవిని బతిమిలాడుతుంటుంది శృతి. అప్పుడే డోర్ కొట్టిన చప్పుడు కావడంతో శృతి, రవి భయపడతారు. సంజు మనుషులేనని శృతి టెన్షన్ పడుతుంది. ఫ్లవర్‌వాజ్ పట్టుకొని వారిపై తిరిగి ఎటాక్ చేయడానికి రవి సిద్ధమై డోర్ తీస్తాడు. కానీ ఎదురుగా మీనా ఉండటంతో రవి, శృతి ఇద్దరుషాకవుతారు.
రవికి మీనా క్లాస్...
వదిన నువ్వు ఇక్కడ అని రవి మధ్యలోనే మాట ఆపేస్తాడు. ఏ రాలేననుకకున్నారా...నాతో ఇంటికివస్తానని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి తలదాచుకున్నారా సిగ్గుగా లేదా అంటూ రవికి క్లాస్ ఇస్తుంది మీనా. ఇంట్లో చిన్నవాడివని నిన్ను కొడుకులా చూసుకున్నానని, మీ ప్రేమ కోసం ఇంట్లోవాళ్లందరితో పోరాడాను.
నీ పెళ్లి నా చేతులతోనే చేయాలని ఆశపడ్డానని మీనా ఎమోషనల్ అవుతుంది. చివరకు నీ దొంగపెళ్లికి నాతో సంతకం పెట్టించి నన్ను పావుగా వాడుకున్నావని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. సత్యంపై సురేంద్ర కిడ్నాప్ కేసు పెట్టాడని, మావయ్యను అరెస్ట్ చేసి లాకప్‌లో ఉంచారని జరిగిన సంగతి రవి, శృతికి చెబుతుంది మీనా.
వదిన కాళ్లు పట్టుకున్న రవి...
మావయ్యనుజైలులో చూస్తుంటే ప్రాణం విలవిలలాడుతుందని, ఆయనకు ఎందుకు ఇంత శిక్ష పడాలి...నిన్ను కన్నందుకా...నీకు నచ్చిన చదువు చెప్పినందుకా అంటూ రవికి క్లాస్ ఇస్తుంది మీనా. పెళ్లికి ఒప్పుకోలేదని ఎవరైనా కన్నతండ్రిపై ఇలా పగతీర్చుకుంటారా అని రవిని దులిపేస్తుంది మీనా.
నన్ను క్షమించమని మీనా కాళ్లు పట్టుకుంటాడు రవి. శృతి కూడా మీనాకు క్షమాపణలు చెబుతుంది. మీనా వెంట రవి వెళ్లడానికి సిద్ధపడతాడు. శృతి కంగారుపడుతుంది. వద్దని అంటుంది. తాను ఇప్పుడు వెళ్లకపోతే సత్యం కొడుకుగా తాను చనిపోయినట్లేనని రవి ఎ మోషనల్ అవుతాడు. చివరకు మీనా వెంట రవి, శృతి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరుతారు.
బాలు వార్నింగ్...
మరోవైపు లాకప్‌లో దిగాలుగా కూర్చుంటాడు సత్యం. పరువు హత్య చేసి వచ్చావా...పిల్లను మాయం చేశావటా అంటూ సెల్‌లో ఉన్న మరో ఖైదీ సత్యాన్ని అవమానిస్తాడు. మా నాన్న గురించి ఇంకో మాట మాట్లాడితే నరికేస్తానని అతడికి లాకప్ బయట నుంచి బాలు వార్నింగ్ ఇస్తాడు.అతడి కాలర్ పట్టుకుంటాడు బాలు. ఎంతకు వదలడు. చివరకు కానిస్టేబుల్స్ వచ్చి విడిపిస్తారు. మీనా పోలీస్ స్టేషన్ దగ్గర కనిపించకపోవడంతో మౌనిక కంగారుపడుతుంది. నువ్వు చేసిన అవమానం తట్టుకోలేకపోయిందని, ఎక్కడికి వెళ్లిందో చూసిరమ్మని బాలుతో అంటుంది మౌనిక. కానీ బాలు అందుకు ఒప్పుకోడు.
బాలు ఆవేశం...
రవి, శృతిలను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వస్తుంది మీనా. రవిని చూడటంతోనే బాలు ఆవేశం పట్టలేకపోతాడు. రవిని చితకబాదుతాడు. ఎస్ఐ వచ్చి బాలును ఆపుతాడు. మీనా మాటలు విని మన కుటుంబం మొత్తం తీసేసావని, తండ్రిని జైలు పాలు చేశావని రవిపై ప్రభావతి ఫైర్ అవుతుంది. రోహిణి, మనోజ్ కూడా రవిని తలో మాట అంటారు.
భార్యను తప్పుపట్టిన బాలు...
మీనా ఏం చెప్పి మీ ఇద్దరి పెళ్లి చేసిందని, తను ఇచ్చిన ధైర్యంతోనే ఈ పెళ్లిచేసుకున్నావా అని రవిని నిలదీస్తుంది ప్రభావతి. బాలు కూడా మీనానే వారి పెళ్లి చేసిందనే భ్రమపడి భార్యను తప్పుపడతాడు. మీనా ఏ తప్పు చేయలేదని రవి, శృతి వాదించిన బాలు, ప్రభావతి వినరు.
తప్పుగా మాట్లాడితే ఊరుకోను...
అప్పుడే అక్కడకు వచ్చిన సురేంద్ర, శోభన కూడా రవిపై కోప్పడుతారు. నా కూతురికి మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసిన నిన్ను వదిలిపెట్టమని, మీ తండ్రితో పాటు నిన్ను జైలుకు పంపిస్తానని రవికి వార్నింగ్ ఇస్తాడు. నీతో పాటు మీ ఫ్యామిలీలో ఎవ్వరిని వదిలిపెట్టనని అంటాడు. ఇంకోసారి మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని సురేంద్రకు బాలు వార్నింగ్ ఇస్తాడు. నీ కూతురిని తీసుకెళ్లింది వాడు...వాడిని ఏమైనా చేసుకొండి అని రవిని చూపిస్తాడు బాలు.
ఎవరూ కిడ్నాప్ చేయలేదు...
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగానే తాను రవిని పెళ్లిచేసుకున్నట్లు ఎస్ఐతో అంటుంది మీనా. తల్లిదండ్రుల నుంచి తనకు రక్షణ కావాలని అంటుంది. శృతిని బలవంతంగా తీసుకెళ్లడానికి సురేంద్ర, శోభన ప్రయత్నిస్తారు. శృతి తన భార్య అని, ఆమెను తీసుకెళ్లే హక్కు మీకు లేదని రవి వారిని అడ్డుకుంటాడు.
మీనాను వదిలేసిన బాలు...
సత్యాన్ని పోలీసులు విడుదలచేస్తారు. జరిగిన సంగతి తండ్రికి చెప్పబోతాడు రవి. కానీ సత్యం కొడుకును దూరంగా తోసేస్తాడు. సత్యంతో పాటు మిగిలిన కుటుంబసభ్యులందరూ కారు ఎక్కువతారు. మీనాను కూడా పిలవమని కొడుకుతో అంటాడు సత్యం. బాలు మాత్రం భార్యను పోలీస్ స్టేషన్‌లోనే వదిలిపెట్టి వెళ్లిపోతాడు. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.
టాపిక్