Guppedantha Manasu February 6th Episode: రిషి చ‌నిపోయాడ‌ని చెప్పిన మ‌హేంద్ర‌ - శైలేంద్ర కాల‌ర్ ప‌ట్టుకున్న వ‌సు-guppedantha manasu february 6th episode vasudhara warns shailendra changed evidence for rishis death ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu February 6th Episode: రిషి చ‌నిపోయాడ‌ని చెప్పిన మ‌హేంద్ర‌ - శైలేంద్ర కాల‌ర్ ప‌ట్టుకున్న వ‌సు

Guppedantha Manasu February 6th Episode: రిషి చ‌నిపోయాడ‌ని చెప్పిన మ‌హేంద్ర‌ - శైలేంద్ర కాల‌ర్ ప‌ట్టుకున్న వ‌సు

Nelki Naresh Kumar HT Telugu
Feb 06, 2024 07:26 AM IST

Guppedantha Manasu February 6th Episode: రిషి చ‌నిపోయాడ‌ని వ‌సుధార‌తో అంటాడు ముకుల్‌. ఆధారాలు కూడా చూపిస్తాడు. కానీ వ‌సుధార మాత్రం అత‌డి మాట‌లు న‌మ్మ‌దు. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu February 6th Episode: త‌మ‌కు ఓ గుర్తుతెలియ‌ని శ‌వం దొరికింద‌ని, అది రిషిదేన‌ని అనుమానంగా ఉంద‌ని మ‌హేంద్ర‌, వ‌సుధార‌ల‌తో అంటాడు ముకుల్‌. ఆ మాట‌లు విని ముకుల్‌పై ఇద్ద‌రు ఫైర్ అవుతారు. క‌నిపించ‌కుండా పోయిన రోజు రిషి వేసుకున్న టీష‌ర్ట్ ఆ డెడ్‌బాడీ ద‌గ్గ‌ర దొరికింద‌ని ముకుల్ చెబుతాడు. అయినా అత‌డి మాట‌ల‌ను వ‌సుధార‌, మ‌హేంద్ర న‌మ్మ‌రు. డెడ్‌బాడీ ఐడెంటిఫికేష‌న్ కోసం తాము హాస్పిట‌ల్‌కు రామ‌ని ప‌ట్టుప‌డ‌తారు. ముకుల్‌తో పాటు అనుప‌మ క‌న్వీన్స్ చేయ‌డంతో చివ‌ర‌కు మ‌హేంద్ర హాస్పిట‌ల్‌కు వెళ‌తాడు.

వ‌సుధార న‌మ్మ‌కం...

మ‌హేంద్ర‌కు ఫోన్ చేసి ప‌రిస్థితి ఏమిటో క‌నుక్కోమ‌ని కూతురితో అంటాడు చ‌క్ర‌పాణి. అది రిషిది కాదు..ఎవ‌రిదో డెడ్‌బాడీ అని మామ‌య్య వెన‌క్కివ‌స్తాడ‌ని తండ్రితో న‌మ్మ‌కంగా అంటుంది వ‌సుధార‌. గ‌తంలో ఒక‌సారి ఇలాగే జ‌రిగింద‌ని చెబుతుంది. రిషికి ఏం కాద‌ని అంటుంది. మ‌హేంద్ర గుడ్‌న్యూస్‌తోనే వ‌స్తాడ‌ని అనుప‌మ కూడా న‌మ్మ‌కంతో ఎదురుచూస్తుంటుంది.

అప్పుడే మ‌హేంద్ర‌ను తీసుకొని ముకుల్ ఇంట్లో అడుగుపెడ‌తాడు. మ‌హేంద్ర బాధ‌గా ఉండ‌టం క‌నిపించి వ‌సుధార టెన్ష‌న్ ప‌డుతుంది. ఐడెంటిఫికేష‌న్ జ‌రిగిందా? ఆ డెడ్‌బాడీ రిషిది కాద‌ని తేలిందా అంటూ మ‌హేంద్ర‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తుంది వ‌సుధార‌. వ‌సుధార‌ ఎన్ని ప్ర‌శ్న‌లు అడిగిన మ‌హేంద్ర మౌనంగానే ఉంటాడు.

పొర‌పాటు కాదు...క‌రెక్టే...

ముకుల్ పొర‌పాటుగా మిమ్మ‌ల్ని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాడ‌ని, అది రిషి డెడ్‌బాడీ కాద‌ని నాతో చెప్పండి అని మ‌హేంద్ర‌ను గ‌ట్టిగా అడుగుతుంది వ‌సుధార‌. పొర‌పాటుగా కాదు క‌రెక్ట్‌గానే తీసుకెళ్లాడ‌ని మ‌హేంద్ర బాంబు పేల్చుతాడు. అది రిషి డెడ్‌బాడీనే అని క‌న్నీళ్ల‌తో మ‌హేంద్ర కుప్ప‌కూలిపోతాడు.

అలా జ‌ర‌గ‌నే జ‌ర‌గ‌దు. మీరు అబ‌ద్ధం చెబుతున్నార‌ని మ‌హేంద్ర‌తో అంటుంది వ‌సుధార‌. అబ‌ద్ధం కాదు నిజ‌మ‌ని మ‌హేంద్ర బ‌దులిస్తాడు. అది నా రిషి డెడ్‌బాడీనే, రిషి మ‌న‌కు ఇక లేడ‌ని క‌న్నీళ్ల‌తో బ‌దులిస్తాడు. డీఎన్ఏ టెస్ట్‌లో అది రిషి డెడ్‌బాడీ అని తేలింద‌ని మ‌హేంద్ర అంటాడు. అయినా రిషి చ‌నిపోయాడ‌నే నిజాన్ని వ‌సుధార అంగీక‌రించ‌దు. రిషి క్షేమంగానే ఉన్నాడ‌ని వాదిస్తుంది.

ఆధారాలు లేకుండా....

అప్పుడే ఫ‌ణీంద్ర ఫ్యామిలీ అక్క‌డికి వ‌స్తారు. అన్న‌య్య‌ను చూడ‌గానే మ‌హేంద్ర క‌న్నీళ్లు ఆపుకోలేక‌పోతాడు. రిషి మ‌న‌ల్ని వ‌ద‌లిపెట్టి వెళ్లిపోయాడ‌ని బోరున ఏడుస్తాడు. ఆ మాట విన‌గానే దేవ‌యాని, శైలేంద్ర ఆనందం ఆపుకోలేక‌పోతారు. మీరు ఎన్నైనా చెప్పండి రిషికి ఏమైనా అయ్యిందంటే నేను న‌మ్మ‌న‌ని అంద‌రితో వ‌సుధార వాదిస్తుంది.

నిజాన్ని నేనే క‌ళ్ల‌తో చూస్తాన‌ని, హాస్పిట‌ల్ వెళ్దామ‌ని ముకుల్‌తో అంటుంది వ‌సుధార‌. మ‌హేంద్ర వ‌ద్ద‌ని వారిస్తాడు. డెడ్‌బాడీ గుర్తుప‌ట్ట‌లేని స్థితిలో ఆన‌వాళు లేకుండా ఉంద‌ని, చూసి త‌ట్టుకోలేవ‌ని చెబుతాడు. ఏ ఆన‌వాళు లేకుండా అది రిషి డెడ్‌బాడీ అని ఎలా చెబుతార‌ని వ‌సుధార నిల‌దీస్తుంది. నీకు ఎలా చెప్పాలి అది రిషిదేన‌ని క‌న్నీళ్ల‌తో బ‌దులిస్తాడు మ‌హేంద్ర‌.

శైలేంద్ర కాల‌ర్ ప‌ట్టుకున్న వ‌సుధార‌...

రిషి చ‌నిపోయాడ‌నే నిజాన్ని నువ్వు జీర్ణించుకోలేక‌పోతున్నావ‌ని అర్థ‌మ‌వుతుంద‌ని శైలేంద్ర జోక్యం చేసుకొని వ‌సుధార‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. టెస్టుల్లో అది రిషిదే అని తేలింద‌ని చెబుతున్నారు క‌దా అని అంటాడు. అత‌డిపై వవ‌సుధార ఫైర్ అవుతుంది. టెస్టుల‌ది ఏముంది. నీలాంటి వెధ‌వ ఎవ‌డైనా మారుస్తాడు అని ఆన్స‌ర్ ఇస్తుంది. శైలేంద్ర కాల‌ర్ ప‌ట్టుకుంటుంది. నువ్వే రిపోర్ట్స్ మార్చావు క‌దా. నిజం చెప్పు అని నిల‌దీస్తుంది.

శైలేంద్రకు రిపోర్ట్స్ మార్చాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు త‌న కొడుకు ఇంట్లోనే ఉన్నాడ‌ని దేవ‌యాని అంటుంది. వీడు ఎక్క‌డ ఉండైనా అక్ర‌మాలు చేయ‌గ‌ల‌డ‌ని వ‌సుధార చెబుతుంది.. పిచ్చిపిచ్చిగా మాట్లాడ‌కు అంటూ వ‌సుధార‌కు వార్నింగ్ ఇస్తుంది దేవ‌యాని. నా కొడుకు అమాయ‌కుడు. అన్నింటికి వాడిపై ప‌డితే..వాడు ఊరుకున్నా నేను ఊరుకోను అంటూ హెచ్చ‌రిస్తుంది.

నేరాలు చేసేది మీరే కాబ‌ట్టి మీపై నింద‌లు వేస్తున్నాన‌ని వ‌సుధార కూడా కోపంగా బ‌దులిస్తుంది. రిషి చ‌నిపోయిన నిజాన్ని త‌ట్టుకోలేక వ‌సుధార మెంట‌ల్‌గా డిస్ట్ర‌బ్ అయ్యింద‌ని, ఏదేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంద‌ని దేవ‌యాని అంటుంది.

ఎవిడెన్స్ చూపించిన ముకుల్‌...

దేవ‌యాని మాట‌ల‌తో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక‌పోతుంది వ‌సుధార‌. ఆమెను కొట్ట‌డానికి వెళుతుంది. కానీ అనుప‌మ ఆపుతుంది. మీరు న‌మ్మిన న‌మ్మ‌క‌పోయినా రిషి చ‌నిపోయాడ‌న్న‌ది నిజ‌మ‌ని వ‌సుధార‌తో అంటాడు ముకుల్‌. ఎవిడెన్స్ చూపిస్తాడు. మీరు బాధ‌ప‌డిన స‌రే నిజం చెప్ప‌డం నా ధ‌ర్మం. రిషి ఇక లేడు, అత‌డు చ‌నిపోయాడ‌ని అని అంటాడు ముకుల్‌.

అది అబ‌ద్ధం అని వ‌సుధార అంటుంది. అందుకు నా ఊపిరే సాక్ష్యం. రిషి ఎక్క‌డున్నా నేను వెతికి మీ ముందుకు తీసుకొస్తాన‌ని వ‌సుధార కోపంగా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. కూతురిని ఆప‌డానికి చ‌క్ర‌పాణి ప్ర‌య‌త్నిస్తాడు. ఇంత‌లోనే రిషి చ‌నిపోయాడ‌నే నిజాన్ని త‌ట్టుకోలేక ఫ‌ణీంద్ర గుండెనొప్పితో కుప్ప‌కూలిపోతాడు.

రాజీవ్ ప్ర‌త్య‌క్షం...

ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వ‌సుధార ఓ చోట కూర్చుంటుంది. లోక‌మంతా ఏక‌మైనా, దేవుడే దిగి వ‌చ్చినా రిషి చ‌నిపోయాడంటే న‌మ్మ‌కూడ‌ద‌ని వ‌సుధార ఫిక్స‌వుతుంది. ఆమె ముందు హ‌ఠాత్తుగా రాజీవ్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. అత‌డిని చూసి వ‌సుధార షాక‌వుతుంది. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు నిన్ను చూసే అదృష్టం ద‌క్కింది మై డియ‌ర్ మ‌ర‌ద‌లు పిల్లా అంటూ వ‌సుధార‌పై ప్రేమ‌ను కురిపిస్తాడు రాజీవ్‌.

మ‌ళ్లీ ఎందుకొచ్చావ్‌, ఎందుకు నా వెంట ప‌డుతున్నావ‌ని రాజీవ్‌ను నిల‌దీస్తుంది వ‌సుధార‌. క‌ష్టంలో ఉన్నావ‌ని అర్థ‌మైంది, ప్రేమ‌, ఆప్యాయ‌త‌తో నిన్ను ప‌ల‌క‌రిద్దామ‌ని వ‌చ్చాన‌ని చెబుతాడు రాజీవ్‌. రిషి చ‌నిపోయాడంటా క‌దా...బంగారం లాంటి మ‌నిషి అని జాలి చూపిస్తాడు రాజీవ్‌. రిషి చ‌నిపోలేదు. బ‌తికే ఉన్నాడ‌ని రాజీవ్‌తో కోపంగా అంటుంది వ‌సుధార‌.

తోడు లేని ఒంట‌రిదానివి...

నువ్వు తోడు లేని ఒంట‌రిదానివి...నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అంటూ వ‌సుధార‌ను భ‌య‌పెట్టాల‌ని చూస్తాడు రాజీవ్‌. నీ చూపుల‌తో భ‌య‌పెట్టాల‌ని చూస్తున్నావా...నీ చూపుల‌కు ప‌డిపోతా కానీ భ‌య‌ప‌డ‌ను అని రాజీవ్ వార్నింగ్ ఇస్తాడు. నీ గుండెల్లో బాధ తీరిపోయేవ‌ర‌కు క‌న్నీళ్లు పెట్టుకో. కానీ ఒంట‌రిగా ఉండాల‌ని మాత్రం అనుకోకు. నీకు తోడుగా నేనుంటాన‌ని రాజీవ్ త‌న మ‌న‌సులో ఉన్న కుట్ర‌ల‌ను బ‌య‌ట‌పెడ‌తాడు.

నువ్వు ఓకే అంటే నీ మెడ‌లో తాళి క‌డ‌తా అంటూ తాళిబొట్టు తీసి చూపిస్తాడు రాజీవ్‌. నువ్వు మ‌నిషివేనా. ఎదుటివాళ్ల ప‌రిస్థితి అర్థం చేసుకోకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నావ్ అని వ‌సుధార అత‌డికి క్లాస్ ఇస్తుంది. ఇంకోసారి ప్రేమ‌, గీమా అంటూ నా వెంట ప‌డకు అని వార్నింగ్ ఇస్తుంది వ‌సుధార‌. అయినా రాజీవ్ విన‌డు. నువ్వు ఒంట‌రిగా ఉండ‌టం క‌రెక్ట్ కాద‌ని వ‌సుధార చేయిప‌ట్టుకుంటాడు.

దాంతో కోపం ఆపుకోలేక‌పోయిన వ‌సుధార రాజీవ్ చెంప‌పై గ‌ట్టిగా ఒక‌టి కొడుతుంది. చెంప‌దెబ్బ‌ను ప‌ట్టించుకోకుండా వ‌సుధార చేప‌ట్టుకొని లాక్కెళుతుంంటాడు రాజీవ్‌. అప్పుడే ఓ కొత్త క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇస్తుంది. కారులో నుంచి దిగిన ఆ వ్య‌క్తి రాజీవ్‌ను ఆపుతాడు. అత‌డు ఎవ‌ర‌న్న‌ది మాత్రం చూపించ‌కుండా స‌స్పెన్స్‌లో ఉంచారు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner