Raju Yadav: ఆ క్రికెటర్‌కు జరిగిన సర్జరీ ఆధారంగా గెటప్ శ్రీను రాజు యాదవ్ మూవీ: డైరెక్టర్
15 May 2024, 12:23 IST
Raju Yadav Director Cricketer Lakshmipathy Balaji: జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా చేస్తున్న రాజు యాదవ్ సినిమాను ప్రముఖ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీకి జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు మూవీ డైరెక్టర్ కృష్ణమాచారి తెలిపారు.
ఆ క్రికెటర్‌కు జరిగిన సర్జరీ ఆధారంగా గెటప్ శ్రీను రాజు యాదవ్ మూవీ: డైరెక్టర్
Getup Srinu Raju Yadav Cricketer Lakshmipathy Balaji: బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా రాజు యాదవ్ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజు యాదవ్ మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కృష్ణమాచారి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
మీ నేపథ్యం గురించి చెప్పండి?
మాది మహబూబ్ నగర్. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు దర్శకుడు వేణు ఉడుగుల గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశాను. దీంతో పాటు ఒక స్పానిష్ ఫిల్మ్, మరిన్ని కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాను. దర్శకుడిగా 'రాజు యాదవ్' నా తొలి చిత్రం.
'రాజు యాదవ్' కాన్సెప్ట్, స్మైల్ క్యారెక్టరైజేషన్ గురించి ?
దాదాపు 90 శాతం మనుషుల్లో ఎదో ఒక చిన్న లోపం ఉంటుంది. ఈ కథకు ఒక లోపం ఉన్న పాత్ర కావాలి. ఈ తరహాలో కొత్త క్యారెక్టరైజేషన్ చెప్పాలని భావించాను. అలాంటి సమయంలో రాజేంద్రప్రసాద్ గారు, అలీ గారు నటించిన ఓ సినిమాలో కోటి రూపాయిలు లాటరీ టికెట్టు తగిలితే నవ్వుతూనే చనిపోయిన ఓ సీన్ ఉంటుంది. సినిమా అంతా అలా నవ్వుతూనే ఉంటాడు. అది నా మైండ్‌లో బాగా రిజిస్టర్ అయ్యింది.
అలాగే ప్రముఖ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీకి చిన్నప్పుడు ఎదో సర్జరీ జరిగింది. దాని కారణంగా ఆయన మొహం ఎప్పుడూ నవ్వుతూ ఉన్నట్లే కనిపిస్తుంది. తన నవ్వు వెనుక ఉన్న రహస్యాన్ని ఓ సందర్భంలో ఆయనే చెప్పారు. ఇలాంటి లోపంతో క్యారెక్టరైజేషన్ రాసుకుంటే బావుంటుందనిపించింది. చాలా ఫన్ జనరేట్ అయ్యే పాత్ర ఇది.
ఈ కథకి ఏదైనా సినిమాల స్ఫూర్తి ఉందా ?
ముందుగా చెప్పినట్లు క్యారెక్టరైజేషన్‌లో స్ఫూర్తి తప్పితే ఈ కథకి సంబధించి ఏ సినిమాని స్ఫూర్తిగా తీసుకోలేదు. సహజత్వం కూడకున్న సినిమాలంటే ఇష్టం. రాజు యాదవ్ కూడా రియలిస్టిక్‌గా ఉంటుంది. అన్నీ రియల్ లోకేషన్స్‌లో షూట్ చేశాం.
చంద్రబోస్ గారి రాసి పాడిన పాటకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది కదా.. దాని గురించి ?
ఈ కథలో రాసినప్పుడు ఆ సిట్యువేషన్‌కి చంద్రబోస్ గారితో ఎలాగైనా పాట రాయించాలని అనుకున్నాం. ఆయన అద్భుతంగా రాశారు. లిరిక్స్ స్వయంగా పాడి వినిపించారు. నాకు, సంగీత దర్శకుడు హర్షవర్షన్ రామేశ్వర్‌కి బోస్ గారు పాడింది చాలా బావుందనిపించింది. ఆయనతోనే పాడించాలని అనుకున్నాం.
అయితే ఆయన మాత్రం సాహిత్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. నా వాయిస్ సరిగ్గా కుదరకపొతే వేరే సింగర్‌తో పాడించాలని చెప్పారు. ఫైనల్‌గా ఆయన పాడింది రికార్డ్ చేశాం. అవుట్ పుట్‌పై ఆయన చాలా ఆనందం వ్యక్తం చేశారు. లిరిక్స్‌లోని ఎమోషన్ ఆయన గొంతులో చాలా అద్భుతంగా పలికింది.