Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్-west indies cricketer andre russel sings hindi song steps into bollywood ipl 2024 kkr player russel hindi song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hari Prasad S HT Telugu

Andre Russel Hindi Song: వెస్టిండీస్ క్రికెటర్లు బాలీవుడ్, హిందీ సినిమా, పాటలపై మనసు పారేసుకుంటున్నారు. తాజాగా మరో స్టార్ క్రికెటర్ రసెల్ ఓ హిందీ పాట పాడటం విశేషం.

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Andre Russel Hindi Song: ఐపీఎల్లో ఆడుతూనే మన బాలీవుడ్, హిందీపై మోజు పెంచుకుంటున్నారు వెస్టిండీస్ క్రికెటర్లు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన డ్వేన్ బ్రావో ఇలాగే హిందీ మ్యూజిక్ పై మనసు పారేసుకున్నాడు. ఇక ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్న మరో స్టార్ క్రికెటర్ ఆండ్రి రసెల్ కూడా అదే రూట్లో వెళ్తున్నాడు.

బాలీవుడ్‌లోకి రసెల్

ప్రస్తుతం ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ కు ఆడుతూ బిజీగా ఉన్నాడు ఆండ్రి రసెల్. తన పవర్ హిట్టింగ్ తో ఫీల్డ్ లో క్రికెట్ అభిమానులను అలరించే ఈ స్టార్ ఆల్ రౌండర్.. ఇప్పుడు తన గళం విప్పాడు. ఓ హిందీ పాట పాడాడు. చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ తో కలిసి ఓ మ్యూజిక్ వీడియో చేయడం విశేషం.

ఈ మ్యూజిక్ వీడియో మే 9వ తేదీని రిలీజ్ కానుంది. లడ్కీ తో కమాల్ కీ అనే టైటిల్ తో ఈ వీడియో సాంగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వయోలా డిగ్ బ్యానర్ లో ఈ సాంగ్ రూపొందింది. ఈ వీడియో సాంగ్ తో తాను బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు రసెల్ చెప్పకనే చెప్పాడు. అతడు ఎలాగూ ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ టీమ్ కేకేఆర్ తోనే ఉన్న విషయం తెలిసిందే.

ఈ లడ్కీ తో కమాల్ కీ సాంగ్ రిలీజ్ డేట్ ను ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఇందులో రసెల్ పక్కా మాస్ అవతారంలో కనిపించాడు. లుంగీ కట్టుకొని, సన్ గ్లాసెస్ తో రసెల్ మాస్ లుక్ అదిరిపోయింది. పక్కన అవికా బ్లూ కలర్ శారీలో చాలా క్యూట్ గా కనిపించింది.

షారుక్ మూవీలో రసెల్ సాంగ్?

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రసెల్ కు తన ఓనర్ షారుక్ కు మించిన ఆప్షన్ మరొకరు ఎవరుంటారు? చాలా ఏళ్లుగా రసెల్ క్రికెట్ స్కిల్స్ చూసిన షారుక్.. అతన్ని తన టీమ్ లోనే కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు అతని సింగింగ్, యాక్టింగ్ స్కిల్స్ చూస్తే సినిమాల్లో ఛాన్స్ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎలాగూ ఈ పవర్ హిట్టర్ కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది.

పైగా కేకేఆర్ ఫ్యామిలీతో షారుక్ బాగా కలిసిపోయాడు. అందులోనూ తరచూ అతడు రసెల్ తో కనిపిస్తూ ఉంటాడు. దీంతో ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఓ సినిమాలో కనిపించే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఈ మధ్యే షారుక్ హిట్ మూవీ డంకీలోని లుట్ పుట్ గయా అనే సాంగ్ కూడా రసెల్ పాడుతూ కనిపించాడు. ఇవన్నీ చూస్తుంటే రసెల్ బాలీవుడ్ ఎంట్రీ పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు.