తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gautham Vasudev Menon: ఆ ఇద్దరు క్రికెటర్లు స్ఫూర్తిగా మూవీ చేస్తా: దర్శకుడు గౌతమ్ మీనన్

Gautham Vasudev Menon: ఆ ఇద్దరు క్రికెటర్లు స్ఫూర్తిగా మూవీ చేస్తా: దర్శకుడు గౌతమ్ మీనన్

15 November 2023, 21:52 IST

google News
    • Gautham Vasudev Menon: ఓ ఇద్దరు క్రికెటర్లను స్ఫూర్తిగా తీసుకొని తన తదుపరి సినిమా చేయనున్నట్టు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ వెల్లడించారు. ఆ వివరాలివే..
గౌతమ్ వాసుదేవ్ మీనన్
గౌతమ్ వాసుదేవ్ మీనన్

గౌతమ్ వాసుదేవ్ మీనన్

Gautham Vasudev Menon: డైెరెక్టర్ గౌతమ్ వాయిదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ధృవ నచ్చత్తిరం సినిమా విడుదలకు రెడీ అవుతోంది. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రం నవంబర్ 24వ తేదీన థియేటర్లలోకి రానుంది. సుమారు ఏడేళ్ల క్రితం షూటింగ్ మొదలైన ధృవ నచ్చత్తిరం (తెలుగులో ధృవ నక్షత్రం) అనేక అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో దర్శకుడు గౌతమ్ మీనన్ ఉన్నారు.

క్రికెట్ నేపథ్యంలో తన తదుపరి సినిమా ఉండనుందని దర్శకుడు గౌతమ్ మీనన్ తాజాగా చెప్పారు. ధృవ నచ్చిత్తరం ప్రమోషన్లలో భాగంగా నేడు (నవంబర్ 15) భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ తమిళ కామెంటరీలో గౌతమ్ పాల్గొన్నారు. కాసేపు సరదాగా కామెంటరీ చేశారు. ఈ సందర్భంగా తన తదుపరి సినిమా స్టోరీ గురించి వివరించారు.

తదుపరి సినిమా ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు డైరెక్టర్ గౌతమ్ మీనన్ స్పందించారు. క్రికెట్ ప్రపంచం గురించి తన నెక్ట్స్ స్టోరీ ఉంటుందని అన్నారు. భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలను స్ఫూర్తిగా తీసుకొని ఇద్దరు ఫ్రెండ్స్ క్యారెక్టర్లను డిజైన్ చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల నుంచి వారిద్దరూ ఎలా ఎదిగారన్న కథాంశంతో సినిమా చేయనున్నట్టు తెలిపారు.

భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహా అతడితో కలిసి ఆడిన స్నేహితుడు వినోద్ కాంబ్లీ స్ఫూర్తిగా మూవీ చేస్తానని గౌతమ్ మీనన్ చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలనే ఆయన తీసుకునే అవకాశం ఉంటుంది.

ధృవ నచ్చత్తిరం మూవీ సినిమా రిలీజ్ సమీపిస్తుండటంతో ప్రమోషన్లను జోరుగా చేస్తోంది మూవీ యూనిట్. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ గౌతమ్ మీనన్ వ్యవహరిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం వస్తోంది.

ధృవ నచ్చత్తిరం సినిమాలో విక్రమ్ సరసన రితూ వర్మ హీరోయిన్‍గా నటించారు. సిమ్రన్, పార్తిబన్, రాధికా శరత్ కుమార్, వినాయకన్, దివ్యదర్శిని, గౌతమ్ మీనన్, ధనంజయన్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించారు. నవంబర్ 24న 'ధృవ నచ్చత్తిరం చాప్టర్ 1 - యుద్ధకాండం' రిలీజ్ కానుంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

తదుపరి వ్యాసం