Dhruva Nakshatram: స్టైలిష్ యాక్షన్, ఘాటు రొమాన్సుతో ధృవ నక్షత్రం.. కానీ, విక్రమ్ వాయిసే!
Dhruva Nakshatram Trailer Telugu: చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ నక్షత్రం. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ధృవ నక్షత్రం మూవీ తెలుగు ట్రైలర్‌ను నవంబర్ 9న సాయింత్రం విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
Chiyaan Vikram: వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తంగళాన్ మూవీతో అలరించేందుకు సిద్ధంగా ఉన్న విక్రమ్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ "ధృవ నక్షత్రం". ఈ సినిమాలో రితూ వర్మ హీరోయిన్‌గా విక్రమ్‌కు జోడీగా చేస్తోంది. ధృవ నక్షత్రం ( తమిళంలో Dhruva Natchathiram) సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించారు.త ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ.. రూపొందిస్తున్నారు.
రెండు భాగాలుగా తెరపైకి రానున్న ధృవ నక్షత్రం ఫస్ట్ పార్ట్ "ధృవ నక్షత్రం: ఛాప్టర్ 1 యుద్ధకాండం" ఈ నెల 24న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ధృవ నక్షత్రం తెలుగు ట్రైలర్‌ను గురువారం (నవంబర్ 9) రిలీజ్ చేశారు. "ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధ కాండం" ట్రైలర్‌లో ముంబైలో 2008లో టెర్రరిస్ట్ దాడి జరిగినప్పుడు అప్పటి ఎన్ఎస్ జీ టీమ్ లో ఉన్న ఓ సీనియర్ ఆఫీసర్ తమ వృత్తిలోని సవాళ్లను గురించి మరో వ్యక్తికి చెబుతుంటాడు.
చట్టంలోని రూల్స్ రెగ్యులేషన్స్ ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో తమకు అడ్డుగా మారుతున్నాయని, అందుకే చట్టంతో పనిలేని బేస్ మెంట్ అనే ఓ కోవర్ట్ టీమ్ ను తయారు చేసినట్లు ఆ సీనియర్ ఆఫీసర్ వెల్లడిస్తాడు. క్రికెట్ టీమ్ లా 11 మంది ఉండే బేస్ మెంట్ కోవర్ట్ టీమ్ లోకి స్పెషలిస్ట్ ఆఫీసర్ గా వస్తాడు జాన్. ఈ కోవర్ట్ టీమ్ తరుపున టెర్రరిస్టులతో జాన్ చేసే పోరాటాన్ని ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు.
ధృవ నక్షత్రం ట్రైలర్‌లో గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్, హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి. జాన్ క్యారెక్టర్ లో చియాన్ విక్రమ్ కూల్ అండ్ స్టైలిష్ గా కనిపించారు. ఈ సినిమాలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ కీ రోల్ లో నటించారు. అలాగే ఇందులో చియాన్ విక్రమ్ స్టైలిష్ యాక్షన్ సీన్సుతో పాటు రొమాన్స్ కూడా అదిరిపోనుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. కానీ, విక్రమ్‌కు చెప్పిన తెలుగు డబ్బింగ్ మాత్రం అభిమానులను నిరాశ పరిచేలా ఉంది. హీరోకు ఆ డబ్బింగ్ అంతగా సూట్ కాలేదని తెలుస్తోంది.