Actress Anu Aggarwal: ప్రేమకు కొత్త అర్థాన్ని చెప్పిన బాలీవుడ్ నటి.. సెక్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
08 January 2024, 21:46 IST
- Actress Anu Aggarwal: అలనాటి బాలీవుడ్ నటి అను అగర్వాల్ ప్రేమ, సెక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రకారం ప్రేమను చిన్న హవభావాలతో అనుభూతి చెందవచ్చని, గొప్పగా చెప్పాల్సిన పనిలేదని అన్నారు. తన జీవితంలో సెక్స్ ముగిసిపోయిన అధ్యాయమని పేర్కొన్నారు.
అను అగర్వాల్
Actress Anu Aggarwal: 90వ దశకంలో బాలీవుడ్‌లో ఆషిఖీ సినిమాతో యావత్ దేశాన్ని కుదేపేసిన హీరోయిన్ అను అగర్వాల్(Anu Aggarwal). కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు చిత్రసీమ నుంచి వైదొలిగిన ఈ నటి ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లిపోయింది. ఇటీవలే ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అను ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో ప్రేమ గురించి తెలియజేశారు. తన అభిప్రాయం ప్రకారం ప్రేమ(Love) అనేది పూర్తిగా విభిన్నమైన అంశమని, సెక్స్(Sex) కానే కాదని స్పష్టం చేశారు.
"నా లవ్ లైఫ్‌కు ఏమైందంటారా? నేను ఎల్లప్పుడు ఓపెన్‌గా మాట్లాడతాను. ఓపెన్‌గానే ఉన్నాను. ప్రేమ గురించి మాట్లాడాలంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమ నా జీవితంలో వేరే మార్గంలో సంపూర్ణమైంది. అది సెక్స్ మాత్రం కాదు. అది నా జీవితంలో ఎప్పుడో చాలా కాలం క్రితమే ముగిసిపోయిన అధ్యాయం." అని అను అన్నారు.
ప్రేమకు వేరే అర్థాన్ని చెప్పింది అను అగర్వాల్. "చిన్న పిల్లల నుంచి వచ్చే ప్రేమ ఎంతో అమాయకంగా, నిజాయితీగాఉంటుంది. ప్రేమను పునరుద్ధరించాలి. చిన్న చిన్న హవ భావాలతో ప్రేమను అనుభూతి చెందవచ్చు. దాని గురించి ఎవరైనా పెద్దగా లేదా గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం పునరాలోచిస్తే సరిపోతుంది." అని అను అగర్వాల్ స్పష్టం చేశారు.
బాలీవుడ్‌లో 80, 90వ దశకంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అను అగర్వాల్. తన కెరీర్‌ను దూరదర్శన్‌లో ప్రసారమైన ఓ సీరియల్‌తో ప్రారంభించారు. అనంతరం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆమెకు 1990లో వచ్చిన ఆషిఖీ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. రాహుల్ రాయ్‌తో నటించిన ఈ సినిమా ఆమెకు బ్రేక్ ఇచ్చింది. 1996 తర్వాత చిత్రసీమకు గుడ్ బై చెప్పిన ఆమె.. 2001లో సన్యాసీగా మారినట్లు తెలిపారు.
టాపిక్