Waltair Veerayya Hindi Release Date: బాలీవుడ్‌లోకి వాల్తేర్ వీరయ్య - రిలీజ్ డేట్ ఇదే
Waltair Veerayya Hindi Release Date: చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా హిందీలో రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా హిందీ టైటిల్ ఏదంటే...
Waltair Veerayya Hindi Release Date: చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ మరో హీరోగా నటిస్తున్నాడు.
కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. జనవరి 13న ఈ సినిమాను హిందీలో విడుదలచేయబోతున్నట్లు వెల్లడించారు. బాలీవుడ్‌లోనూ ఈ సినిమాను వాల్తేర్ వీరయ్య టైటిల్‌తోనే రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు.
ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులను టాప్ ప్రొడక్షన్ హౌజ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే హిందీ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నట్లు తెలిసింది. స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు చెబుతున్నారు.
చిరంజీవి గత చిత్రం గాడ్‌ఫాదర్ హిందీలో 10 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. సల్మాన్‌ఖాన్ అతిథి పాత్రలో నటించినా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. వాల్తేర్ వీరయ్య మాత్రం కేవలం చిరు ఇమేజ్‌ను నమ్ముకొని బాలీవుడ్‌లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా హిందీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వాల్తేర్ వీరయ్య సినిమాలో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ సెకండాఫ్‌లో కనిపిస్తుందని చిరంజీవి వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.