తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 6 Episode 76: ఫైమాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ .. చివరి వరకు పట్టు వదలని రేవంత్

Bigg Boss Telugu 6 Episode 76: ఫైమాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ .. చివరి వరకు పట్టు వదలని రేవంత్

19 November 2022, 8:14 IST

google News
    • Bigg Boss Telugu 6 Episode 76: బిగ్‌బాస్ సీజన్ 6 ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఫైమా సొంతం చేసుకుంది. ఈ పాస్ కోసం నిర్వహించిన టాస్క్‌లో రేవంత్, శ్రీహాన్ గట్టిగా కష్టపడినప్పటికీ.. హౌస్ మేట్స్ ఫైమాకు సపోర్ట్ చేయడంతో ఆమె విజేతగా నిలిచింది. రేవంత్ మాత్రం చాలాసేపు నొప్పిని భరిస్తూ అలాగే ఉన్నాడు.
ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్‌లో రేవంత్, ఫైమా
ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్‌లో రేవంత్, ఫైమా

ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్‌లో రేవంత్, ఫైమా

Bigg Boss Telugu 6 Episode 76: బిగ్‌బాస్ సీజన్ 6 చప్పగా సాగుతుందనేది వాస్తవం. మొదట్లో నిదానంగా సాగి బిగ్‌బాస్‌కే కోపం తెప్పించేలా చేసిన హౌస్ మేట్స్.. ఆయన ఆగ్రహంతో రూటు మార్చి కాస్త టాస్క్‌ల్లో ఇన్వాల్వ్ అయ్యారు. అయితే గీతూ ఎలిమినేషన్ తర్వాత మళ్లీ అదే రీతిలో వ్యవహరిస్తుండటంతో ఈ సీజన్‌ వేస్ట్ అని బయట ప్రేక్షకులు కూడా రాజీకి వచ్చేశాడు. ఇదిలా ఉంటే ఈ లేటెస్ట్ ఎపిసోడ్‌లో మళ్లీ కెప్టెన్ అయిన రేవంత్ తన కఠిన నియమాలను హౌస్‌లో రుద్దుతున్నాడు. మరోపక్క కీర్తి.. శ్రీహాన్, శ్రీసత్య తమను టార్గెట్ చేస్తూనే ఉన్నారని, ఆ బాధలో నుంచి తాను బయటలేకపోతున్నానని బిగ్‌బాస్‌తో వాపోతుంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఇచ్చిన టాస్క్‌లో ఫైమా విన్ అవుతుంది.

ముందుగా ఎపిసోడ్ ప్రారంభంలోనే మరోసారి కెప్టెన్ అయిన రేవంత్ నియమాలతో హౌస్ మేట్స్ ఇబ్బంది పడుతున్నారు. రాత్రి ప్లేట్లులో ఎవరో అన్నం పెట్టి మర్చిపోయారు ఎవరో చెప్పండి అనగా.. ఎవ్వరూ నోరు మెదపరు. ఈ అంశంపై కాస్త హడావిడి జరుగుతుంది. అనంతరం ఎక్స్‌ట్రా కప్పులు, బౌల్స్ స్టోర్ రూంలో పెడుతున్నాం, అందరూ కప్పుపై తమ పేర్లు రాసుకోవాలని సూచించాడు. ఈ విషయంలో ఇనాయ, కీర్తి అసంతృప్తి చెందుతారు. నేను రెండు కప్పులు వాడితే మీకు ఇబ్బంది ఏంటి.. అని రేవంత్‌ను ఇనాయ ప్రశ్నిస్తుంది. ఇందుకు రేవంత్ కూడా అందరికీ రెండు కప్పులు లేవు, ఎవరిదానిపై వారు పేర్లు రాసుకుంటే ఇబ్బంది ఉండదని సమాధానమిస్తాడు. అలాగే ఎక్స్‌ట్రా బౌల్స్ స్టోర్ రూంలో ఎందుకుపెడుతున్నారని ప్రశ్నించగా.. పాత్రలు కడిగే వాళ్లకు ఇబ్బందవుతుందని అర్థం చేసుకోవాలని రేవంత్ అంటాడు. మొత్తానికి రేవంత్ కెప్టెన్సీలో ఇనాయ, కీర్తి ఇబ్బంది పడుతున్నట్లు వారి మాటలు చూస్తే అర్థమవుతుంది.

అనంతరం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం బిగ్‌బాస్ టాస్క్ ఇస్తారు. ఎవరికైతే ఈ పోటీలో అర్హత పొందాలనుకుంటారో ఆ ధరకు అది లభిస్తుందని, అందుు సమయానుసారం బిగ్‌బాస్ బజర్ ఇచ్చినప్పుడు.. అక్కడ ఉన్న బజర్ నొక్కాలని చెబుతారు. ఎవరైతే ముందుగా బిగ్‌బాస్ బజర్ నొక్కుతారో వారే ఈ టాస్క్‌లో పోటీ పడటానికి అర్హులవుతారు. అయితే ఈ టాస్క్‌పై ఆదిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఒక్కవారం ఎవిక్షన్ కోసం విన్నర్ ప్రైజ్ మనీ నుంచి డబ్బు తగ్గడం తనకు నచ్చలేదని, తగ్గే డబ్బు బట్టి తాను ఆడేది లేనిది చెబుతాను అని అంటాడు. మొత్తానికి అతడు ఈ టాస్క్‌లో అయితే ఆడడు. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో అందరూ పాల్గొనాలని ఇనాయా చెప్పినప్పటికీ.. ఇది నా టాస్క్ అంటూ నాకిష్టం ఆడనని మిన్నకుంటాడు.

ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ కోసం నిర్వహించిన పోటీలో ముందుగా బజర్ నొక్కిన ఫైమా, శ్రీహాన్, రేవంత్‌ తుది పోటీకి సిద్ధమవుతారు. ఫలితంగా విన్నర్ ప్రైజ్ మనీ మరింత తగ్గుతుంది. ఈ టాస్క్ పూర్తయ్యే సరికి రూ.38,00,100 ఉంటుంది. అనంతరం ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ మొదలవుతుంది. ఈ టాస్క్‌కు శ్రీసత్య సంచాలక్‌గా వ్యవహరిస్తారు. టాస్క్ ప్రకారం ముగ్గురు పోటీదారులు కావిడిని తమ భుజాలపై మోయాలి. బజర్ మోగినప్పుడల్లా హౌస్ మేట్స్ తాము ఎవరికైతే సపోర్ట్ చేయకూడదనుకుంటారో వారి కావిడిపై బరువులు వేస్తుంటారు. ఫిజికల్ టాస్క్ అయిన ఈ పోటీలో శ్రీసత్య మినహా ఇంటి సభ్యులంతా ఫైమాకే సపోర్ట్ చేస్తారు. ఫలితంగా శ్రీహాన్, రేవంత్ కాడేలపై బరువులు వేస్తూ వెళ్తుంటారు.

రేవంత్-ఆదిరెడ్డి మాటల యుద్ధం..

ముందుగా ఆదిరెడ్డి రేవంత్ కావిడపై బరువు వేస్తూ.. కెప్టెన్సీ టాస్క్‌లో ఇనాయ విషయంలో అమ్మాయిని తప్పిస్తే టఫ్ తగ్గుతుంది కదా అని అన్నావ్.. ఈ టాస్క్‌లో నీకంటే వీక్ అయిన ఫైమా టాస్క్‌లో ఉండాలంటే నీకే వేస్తున్నాను అని అంటాడు. ఇందుకు రేవంత్ వీడియో అడుగు అని అంటాడు. ఈ వీడియో రాంగ్ అయితే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతా.. నిజం అయితే వెళ్లిపోతావా? అని సవాల్ చేశాడు ఆదిరెడ్డి. గేమ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకటే అని చాలా సార్లు చెప్పారు కదా.. రేవంత్ అనగా.. కానీ నువ్వు చెప్పలేదు కదా బ్రో అని ఆదిరెడ్డి పంచ్ పేలుస్తాడు. దానికి నేను నిన్ను అడగలేదు అని అనగా.. నేను నీకు చెప్పలేదు అని రీకౌంటర్ ఇచ్చాడు. నిన్ను అడగకుండా మధ్యలో దూరకు అని రేవంత్ అంటే.. నేను దూరతా.. నోటికొచ్చిటన్లు మాట్లాడొద్దు రేవంత్ బ్రో.. జీవితంలో ప్రతి చోటా మనం గెలవలేదు. ఓటమిని తీసుకునే శక్తి మనకు ఉండాలి అంటూ రేవంత్‌తో అంటాడు.

మరోపక్క హౌస్ మేట్స్ అందరూ శ్రీహాన్, రేవంత్‌కు బరువులు వేస్తుండటంతో శ్రీసత్య మాత్రం ఫైమాకు బరువులు వేస్తుంటుంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తే.. శ్రీసత్యను సేవ్ చేద్దామనుకున్న రేవంత్, శ్రీహాన్ వ్యూహాలకు హౌస్ మేట్స్ అడ్డుకట్ట వేశారు. వరుసగా తమకే బరువులు వేస్తుండటంతో ఈ సారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఫైమాదే అంటూ శ్రీహాన్ అంటాడు. దీంతో బరువులు మోయలేక కావిడిని పడేస్తాడు. అనంతరం కింద పడిపోగా.. శ్రీసత్య అతడిని ఒళ్లో పడుకోపెట్టుకుని ఓదార్చుతుంది. శ్రీహాన్ ఓడిపోవడంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోయిందని బాధ శ్రీసత్య ముఖంలో స్పష్టంగా కనిపించింది. రేవంత్ నువ్వు కింద పడేయొద్దు.. శ్రీహాన్ కోసం ఆడు.. గివ్ అప్ ఇవ్వవద్దు అంటూ అతడితో అంటుంది.

పట్టు వదలని రేవంత్..

ఓ పక్క శ్రీహాన్ పడిపోయినా.. రేవంత్ చాలా సేపు ఎక్కువ సేపు బరువులు మోస్తూనే ఉన్నాడు. ఓ సారి కింద పడేసి సిచ్యూయేషన్ వచ్చినా.. మొండిగా ప్రయత్నిస్తాడు. తన శక్తికి మించి దాదాపు ఐదు గంటల సేపు బరువు మోస్తూనే ఉంటాడు. చివరకు తన వల్ల కాక శ్రీహాన్‌ను ఏం చేయాలో సలహా అడుగుతాడు. నీకు 10 బరువులు ఉంటే.. ఫైమాకు రెండే ఉన్నాయి. నువ్వు కష్టపడే రేపొద్దున్న వరకు ఉన్నా.. నీకే కష్టం. ఫైమాకు పెద్దగా ఇబ్బంది లేదు. ఇంక నువ్వే తేల్చుకోని అని శ్రీహాన్ చెప్పగా.. రేవంత్ కావిడిని కిందపడేస్తాడు. ఈ టాస్క్‌లో గెలిస్తే తనకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుందని ఆశించిన శ్రీసత్య ముఖం మాడిపోయింది.

అనంతరం శ్రీహాన్, రేవంత్ ప్రయత్నాన్ని బిగ్‌బాస్ కూడా అభినందిస్తూ.. ఎవిక్షన్ పాస్‌ను ఫైమా గెలిచిందని ప్రకటిస్తారు. ఈ టాస్క్‌లో తనకు ఎక్కువ బరువులు వేసిన ఆదిరెడ్డిపై రేవంత్ బాగానే గుర్రుగా ఉంటాడు. మనుషులను నమ్మి నేను మోసపోయానని అంటాడు. బరువులు మోసి విశ్రాంత తీసుకుంటున్న రేవంత్ దగ్గరకు వచ్చి ఇనాయా ఓదార్చుతుంటుంది. చాలా బాగా కష్టపడ్డారని అభినందిస్తుంది. బిగ్‌బాస్ టాస్క్ గెలవాలని కాకుండా.. బాగా ఆడాలని తాను కోరుకుంటానని రేవంత్ బదులిస్తాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం