Bigg Boss 6 Telugu 69th Episode: ఎట్ట‌కేల‌కు కెప్టెన్ అయిన ఫైమా - వ‌రెస్ట్ కంటెస్టెంట్‌గా ఇనాయా-bigg boss 6 telugu 69th episode inaya becomes worst contestant of this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu 69th Episode: ఎట్ట‌కేల‌కు కెప్టెన్ అయిన ఫైమా - వ‌రెస్ట్ కంటెస్టెంట్‌గా ఇనాయా

Bigg Boss 6 Telugu 69th Episode: ఎట్ట‌కేల‌కు కెప్టెన్ అయిన ఫైమా - వ‌రెస్ట్ కంటెస్టెంట్‌గా ఇనాయా

Nelki Naresh Kumar HT Telugu
Nov 12, 2022 08:27 AM IST

Bigg Boss 6 Telugu 69th Episode: బిగ్‌బాస్ 6 తెలుగు కొత్త కెప్టెన్‌గా ఫైమా ఎంపికైంది. ఈ వారం వ‌రెస్ట్ కంటెస్టెంట్‌గా ఇనాయా నిలిచింది.

ఇనాయా
ఇనాయా

Bigg Boss 6 Telugu 69th Episode: కెప్టెన్ కావాల‌నే క‌ల‌ను ప‌దో వారంలో నెర‌వేర్చుకున్న‌ది ఫైమా. బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా ఎంపికైంది. వ‌స్తా నీ వెనుక టాస్క్‌లో చివ‌రి వ‌ర‌కు పోరాడింది ఫైమా. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి, శ్రీస‌త్య, ఫైమా పోటాపోటీగా ఆడారు. చివ‌ర‌కు ఈ టాస్క్‌లో ఫైమా గెలిచిన‌ట్లుగా సంచాల‌క్ రేవంత్ ప్ర‌క‌టించాడు.

ఆదిరెడ్డి ఫైర్‌

ఫైమా కెప్టెన్ కావ‌డానికి ఆదిరెడ్డి, రోహిత్ స‌పోర్ట్ చేస్తున్నారంటూ ఇనాయా కూడా వాదించింది. ఆమె మాట‌ల‌తో ఆదిరెడ్డి ఫైర్ అయ్యాడు. నా ద‌గ్గ‌ర యాక్టింగ్ చేయ‌ద్దంటూ ఆమెతో అన్నాడు. నీకు బ్రెయిన్ ఉందా పిచ్చి ప‌ట్టిన‌ట్లుగా మాట్లాడుతున్నావ‌ని గ‌ట్టిగా చెప్పాడు. ఫైమాకు స‌పోర్ట్ చేసిన‌ట్లు నిరూపిస్తే బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతాన‌ని అన్నాడు.

గేమ్ ఆడ‌టం చాత కాక‌పోవ‌డంతోనే అంద‌రిపై ఇనాయా ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని ఫైమా కామెంట్స్ చేసింది. కానీ ఫైమా టాస్క్‌లో గెల‌వ‌గానే అప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన గొడ‌వ‌ను మ‌ర్చిపోయి ఇనాయా ఆమెను కౌగిలించుకున్న‌ది. టాస్క్‌లో ఓడిపోయిన బాధ‌లో ఉన్న శ్రీస‌త్య‌ను శ్రీహాన్ ఓదార్చాడు.

హ‌ర్ట్ అయిన శ్రీహాన్‌

రేవంత్‌, రాజ్ స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూ శ్రీహాన్‌ను ప‌లిచారు. కానీ అత‌డు రాలేదు. మేము పిలిస్తే రావు స‌త్య పిలిస్తే దుప్ప‌టి ప‌ట్టుకొని వ‌స్తావు అంటూ రేవంత్ కామెంట్ చేశాడు. అత‌డి మాట‌ల‌తో శ్రీహాస్ హ‌ర్ట్ అయ్యాడు. ఆ మాట‌ను తాను అన‌లేద‌ని రేవంత్ బుకాయించాడు.

సంచాల‌క్ క‌న్ఫ్యూజ్‌

ఈ వారం వ‌రెస్ట్ కంటెస్టెంట్‌ను ఎంచుకోమ‌ని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇందులో అత్య‌ధిక స్టాంప్‌లు ఇనాయాకు ప‌డ‌టంతో ఆమె జైలుకు వెళ్లింది. ఇందులో తొలుత ఫైమా త‌న ఓటును వాసంతికి వేసింది. గేమ్‌లో వాసంతి ఇన్‌వాల్వ్‌మెంట్ పెద్ద‌గా లేద‌ని అన్న‌ది. ఆ త‌ర్వాత బాలాదిత్య...రేవంత్‌ను వ‌రెస్ట్ కంటెస్టెంట్‌గా పేర్కొన్నాడు సంచాల‌క్‌గా క‌న్ఫ్యూజ్ అయ్యావ‌ని పేర్కొన్నాడు.

జైలుకెళ్లిన ఇనాయా

వాసంతి...కీర్తిని వ‌రెస్ట్ కంటెస్టెంట్‌గా పేర్కొంది. రాజ్‌..శ్రీస‌త్య‌కు, మ‌రీనా...కీర్తికి, శ్రీస‌త్య‌...రేవంత్‌కు వ‌రెస్ట్ కంటెస్టెంట్‌గా స్టాంప్ వేశారు. రేవంత్‌లో ఛేంజ్‌లో క‌నిపించింద‌ని, అత‌డికి న‌చ్చ‌లేద‌ని అన్న‌ది. ఆ త‌ర్వాత ఆదిరెడ్డి, రోహిత్...ఇనాయాను వ‌రెస్ట్ కంటెస్టెంట్‌గా పేర్కొన్నారు. చివ‌ర‌కు ఈ టాస్క్‌లో అత్య‌ధిక స్టాంప్‌లు వ‌చ్చిన ఇనాయాను వ‌రెస్ట్ కంటెస్టెంట్‌గా కెప్టెన్ ఫైమా ప్ర‌క‌టించింది. ఆమెను జైలులో వేసి తాళం పెట్టింది ఫైమా.