తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhoomam Ott: ఏడాది తర్వాత అందరికీ అందుబాటులో ఉండే ఓటీటీలోకి వస్తున్న ఫహాద్ ఫాజిల్ మూవీ

Dhoomam OTT: ఏడాది తర్వాత అందరికీ అందుబాటులో ఉండే ఓటీటీలోకి వస్తున్న ఫహాద్ ఫాజిల్ మూవీ

Hari Prasad S HT Telugu

29 May 2024, 7:21 IST

google News
    • Dhoomam OTT: థియేటర్లలో రిలీజైన సుమారు ఏడాది తర్వాత అందరికీ అందుబాటులో ఉండే ఓటీటీలోకి వస్తోంది ఫహాద్ ఫాజిల్ నటించిన ధూమమ్ మూవీ. వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.
ఏడాది తర్వాత అందరికీ అందుబాటులో ఉండే ఓటీటీలోకి వస్తున్న ఫహాద్ ఫాజిల్ మూవీ
ఏడాది తర్వాత అందరికీ అందుబాటులో ఉండే ఓటీటీలోకి వస్తున్న ఫహాద్ ఫాజిల్ మూవీ

ఏడాది తర్వాత అందరికీ అందుబాటులో ఉండే ఓటీటీలోకి వస్తున్న ఫహాద్ ఫాజిల్ మూవీ

Dhoomam OTT: మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన మూవీ ధూమమ్. ఈ సినిమా సుమారు ఏడాది తర్వాత ఇప్పుడు మరో ఓటీటీలోకి వస్తోంది. ఇన్నాళ్లూ ఆపిల్ టీవీలో ఈ సినిమా ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడీ మూవీ వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా యూట్యూబ్ లోకి వస్తుండటం విశేషం. దీంతో ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చినట్లవుతోంది.

ధూమమ్ ఓటీటీ స్ట్రీమింగ్

గతేడాది జూన్ 23న థియేటర్లలో రిలీజైంది మలయాళ మూవీ ధూమమ్. ఫహాద్ ఫాజిల్ లాంటి స్టార్ హీరో, పవన్ లాంటి డైరెక్టర్, హోంబలే ఫిల్మ్స్ లాంటి హిట్ సినిమాల ప్రొడక్షన్ హౌజ్ కలిసి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా పడింది. నిజానికి గతేడాది నవంబర్ నుంచే ఆపిల్ టీవీ ఓటీటీలోకి వచ్చింది. కానీ ఆ ఓటీటీ గురించి చాలా మందికి తెలియక చూడలేకపోయారు.

ఇప్పుడు వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా శుక్రవారం (మే 31) నుంచి ఈ సినిమా హోంబలే ఫిల్మ్స్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో స్ట్రీమింగ్ కానుంది. స్మోకింగ్ వల్ల కలిగే అనర్థాలను యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కించి చూపించిన సినిమా ఇది. థియేటర్లలో కచ్చితంగా సక్సెస్ అవుతుందని భావించినా.. ఆశించిన మేర బాక్సాఫీస్ వసూళ్లు సాధించలేకపోయింది.

ధూమమ్ ఆ హీరో చేయాల్సింది..

ధూమమ్ మూవీని పదేళ్ల కిందటే డైరెక్టర్ పవన్ కుమార్ చేయాలని నిర్ణయించాడు. ఇదే హోంబలే ఫిల్మ్స్ తో కలిసి కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ తో ఈ సినిమా చేయాలని భావించాడు. కానీ పునీత్ అకాల మరణంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

ఇదే సినిమాను ఫహాద్ ఫాజిల్ తో చేయడానికి హోంబలె ఫిల్మ్స్ ఆసక్తి చూపించింది. పవన్ కూడా అందుకు తగినట్లు స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడు. అలా ధూమమ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ధూమమ్ స్టోరీ ఏంటి?

సిగ‌రెట్, పొగాకు ఉత్ప‌త్తుల వ్యాపారాల్ని చేసే వారిని టెర్ర‌రిస్ట్‌ల‌తో స‌మానం అని, వారి వ‌ల్ల సొసైటీకి ఎంతో న‌ష్టం ఉంద‌ని ధూమం సినిమాలో చూపించారు ప‌వ‌న్‌కుమార్‌. సిగ‌రెట్‌, లిక్క‌ర్ వ్యాపారాల్లో లాభాన‌ష్టాలే త‌ప్పితే మంచి చెడులు వంటి నైతిక విష‌యాల‌కు తావు ఉండ‌ద‌ని చాటిచెప్పారు డైరెక్ట‌ర్‌.

లాభాల కోసం సిగ‌రెంట్ కంపెనీలు వేసే ఎత్తుల‌ను ఆలోచ‌న‌నాత్మ‌కంగా ప్ర‌జెంట్ చేస్తూనే మ‌రోవైపు ఓ ట్రాప్‌లో ఇరుక్కున్న యువ‌కుడు త‌న భార్య‌తో క‌లిసి అందులో నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు సాగించిన పోరాటాన్ని చివ‌రి వ‌ర‌కు థ్రిల్లింగ్‌గా సినిమాలో చూపించారు.

రెగ్యుల‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు భిన్నంగా క్లైమాక్స్ సాహోసేపోతంగా ఎండ్ చేశారు డైరెక్ట‌ర్‌. ఇలాంటి క్లైమాక్స్‌ను చూపించ‌డానికి ఎంతో ధైర్యం కావాలి. క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌ను ఫాలో కాకుండా తాను ఏది చెప్పాల‌ని అనుకున్నారో దానినే స్క్రీన్‌పై చూపించారు. ఈ స‌ర్‌ప్రైజింగ్ క్లైమాక్స్‌ను జీర్ణించుకోవ‌డం క‌ష్ట‌మే. అయితే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం