Evil Dead Rise OTT Release Date: ఈవిల్ డెడ్ రైజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
10 May 2023, 16:09 IST
- Evil Dead Rise OTT Release Date: ఈవిల్ డెడ్ రైజ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈవిల్ డెడ్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఐదో సినిమా అయిన ఈ ఈవిల్ డెడ్ రైజ్.. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఈవిల్ డెడ్ రైజ్ మూవీలో ఓ సీన్
Evil Dead Rise OTT Release Date: ఈవిల్ డెడ్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతలా భయపెట్టాయో మనకు తెలుసు. ఎప్పుడో నాలుగు దశాబ్దాల కిందట రిలీజైన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ఈ ఫ్రాంఛైజీ నుంచి మరో నాలుగు సినిమాలు వచ్చాయి. అందులో ఐదో మూవీ అయిన ఈవిల్ డెడ్ రైజ్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.
నిజానికి ఈ సినిమాను అప్పట్లో నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని వార్నర్ బ్రదర్స్ సంస్థ భావించింది. కరోనా తర్వాత థియేటర్లకు వచ్చి సినిమా చూసే వాళ్లు ఎవరూ ఉండరన్న ఉద్దేశంతో అలా అనుకున్నా.. ఈ మూవీ వాళ్ల అంచనాలను తలకిందులు చేసింది. ఈ ఫ్రాంఛైజీలోని అన్ని సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
ఈవిల్ డెడ్ రైజ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల డాలర్లు వసూలు చేయడం విశేషం. ఇప్పటికీ ఈ సినిమా చాలా థియేటర్లలో నడుస్తోంది. అయినా దీనిని ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ భావించారు. దీంతో ఈ శుక్రవారం (మే 12) నుంచే ఈవిల్ డెడ్ రైజ్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు ఆపిల్ టీవీ, గూగుల్ ప్లేలలోనూ ఈ మూవీని చూడొచ్చు. ఈ సినిమాలో మోర్గాన్ డేవీస్, గాబ్రియెల్ ఎకోల్స్, నెల్ ఫిషర్ నటించారు.
ఈ సినిమాపై సర్వత్రా పాజిటివ్ టాక్ రావడంతో విపరీతంగా బజ్ ఏర్పడింది. ఆడియెన్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చొబెడుతూ ఆద్యంతం భయపెడుతుంది. హర్రర్ జోనర్ నచ్చేవారికి ఈవిల్ డెడ్ రైజ్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
ఇటీవల కాలంలో విడుదలైన హర్రర్ సినిమాల్లో ఇది బెస్ట్ చిత్రంగా చెప్పవచ్చు. దర్శకుడు లీ క్రొనీన్ హర్రర్ ప్రియులను ఆకర్షించేలా చక్కటి స్టోరీ లైన్‌తో ఒళ్లు గగుర్పొడిపించే సన్నివేశాలతో హర్రర్ యాంబియన్స్‌ను, అనుభూతిని కలిగించారు.