Mood Kharaab Trailer: ప్రైమ్ వీడియోలో స్టాండప్ స్పెషల్ మూడ్ ఖరాబ్.. మెటావర్స్‌పై బిశ్వకల్యాణ్ రథ్ పంచ్‌లు
Mood Kharaab Trailer: ప్రైమ్ వీడియోలో స్టాండప్ స్పెషల్ మూడ్ ఖరాబ్ రాబోతోంది. మెటావర్స్‌పై బిశ్వకల్యాణ్ రథ్ పంచ్‌లతో దీనికి సంబంధించిన ట్రైలర్ ను గురువారం (మే 4) రిలీజైంది.
Mood Kharaab Trailer: ప్రైమ్ వీడియో మరో స్టాండప్ కామెడీ స్పెషల్ తో ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ షో పేరు మూడ్ ఖరాబ్ (Mood Kharaab). పాపులర్ కమెడియన్, క్రియేటర్ బిశ్వ కల్యాణ్ రథ్ తనదైన స్టైల్ పంచ్ లతో నవ్వించడానికి సిద్ధమయ్యాడు. ఈ మూడ్ ఖరాబ్ స్టాండప్ నుంచి గురువారం (మే 4) ట్రైలర్ వచ్చింది.
ఈ షో శుక్రవారం (మే 5) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ షోను కనన్ గిల్ డైరెక్ట్ చేయగా.. ఓఎంఎల్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేసింది. ట్రైలర్ చూస్తుంటే.. ఈ కాలంలో ఎక్కువగా వాడుతున్న మెటావెర్స్, ఆన్‌లైన్ షాపింగ్ లాంటి వాటిపై బిశ్వ కల్యాణ్ పంచ్ లు వేయడం కనిపిస్తుంది. ఈ షో ఇండియాతోపాటు 240 దేశాల్లో స్ట్రీమ్ అవనుంది.
ప్రైమ్ వీడియోలో ఇప్పటికే ఎన్నో ఒరిజినల్స్ తోపాటు స్టాండప్ కామెడీ షోలు ఉన్నాయి. తాజాగా ఈ మూడ్ ఖరాబ్ కూడా అందులో చేరనుంది. ఓ మనిషి జీవితంలో ఎత్తుపల్లాలను ఈ షోలో సరదాగా చెప్పే ప్రయత్నం చేశాడు బిశ్వ కల్యాణ్. తన సొంత అనుభవాలతోపాటు ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై తనదైన స్టైల్ పంచ్ లతో అతడు అలరించాడు.
యువతను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన స్టాండప్ షో ఇది. వాళ్లకు కచ్చితంగా నచ్చేలా ఉంది. స్టాండప్ కమెడియన్ అయిన బిశ్వ కల్యాణ్ రథ్.. పలు వెబ్ సిరీస్ లు కూడా తీసిన విషయం తెలిసిందే. మన విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ లాఖో మే ఏక్ అనే సిరీస్ తీశాడు. ఈ సిరీస్ రెండు సీజన్లుగా స్ట్రీమ్ అయి మంచి టాక్ కొట్టేసింది.
సంబంధిత కథనం