HBD Naveen Polishetty: స్టాండప్ కమెడియన్‌గా జాతిరత్నాలు స్టార్.. బర్త్‌డే పోస్టర్ రిలీజ్-naveen polishetty plays as standup comedian in his upcoming movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Naveen Polishetty Plays As Standup Comedian In His Upcoming Movie

HBD Naveen Polishetty: స్టాండప్ కమెడియన్‌గా జాతిరత్నాలు స్టార్.. బర్త్‌డే పోస్టర్ రిలీజ్

Maragani Govardhan HT Telugu
Dec 26, 2022 01:44 PM IST

HBD Naveen Polishetty: టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా.. అనుష్క హీరోయిన్‌గా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో నవీన్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి

HBD Naveen Polishetty: ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ లాంటి సూపర్ హిట్‌తో హీరోగా చిత్రసీమకు పరిచయమయ్యాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా తర్వాత జాతిరత్నాలుతో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాడ నవీన్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తాజాగా సరికొత్త అప్డేట్ వచ్చింది. సోమవారం నవీన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలో అతడి క్యారెక్టర్ పేరు, మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా అతడి లేటెస్ట్ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో అతడి పేరు సిద్ధు పోలిశెట్టిగా పెట్టారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఇందులో నవీన్ స్టాండప్ కమెడియన్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అర్బన్ స్పోర్ట్స్ లుక్‌లో జాతిరత్నాలు స్టార్ సూపర్ స్మార్ట్‌గా ఉన్నాడు.

జాతిరత్నాలు చిత్రంలో నవీన్ కమెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ఈ సినిమాలో స్టాండప్ కమెడియన్‌గా రాబోతుండటంతో అబిమానుల్లో అంచనాలు పెరిగాయి. తన పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్తాడని అంచనాలు వేసుకుంటున్నారు.

ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టితో పాటు అనుష్క కూడా ఫీమేల్ లీడ్‌గా కనిపించనుంది. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ-ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు, విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్