Metaverse Experience | ఇది మెటావర్స్‌, నిజమో.. మాయో అర్థం కాని వింతైన యూనివర్స్!-take a tour of the metaverse experiences in india ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Metaverse Experience | ఇది మెటావర్స్‌, నిజమో.. మాయో అర్థం కాని వింతైన యూనివర్స్!

Metaverse Experience | ఇది మెటావర్స్‌, నిజమో.. మాయో అర్థం కాని వింతైన యూనివర్స్!

May 29, 2022 10:51 AM IST HT Telugu Desk
May 29, 2022 10:51 AM IST

మెటావర్స్ అనేది ఇంటర్నెట్ లో 3D వెర్షన్ సాంకేతికత. మెటావర్స్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులు మున్ముందు మెటావర్స్‌లోనే పని చేయవచ్చు. స్నేహితులను కలవడం, చలనచిత్రాలను వీక్షించడం, క్రీడా పోటీలను ఆస్వాదించడం, వివాహ వేదికల లాగా ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, మాట్లాడటం, ఆటలాడుకోవడం, డబ్బు సంపాదించడం ఇలా ఎన్నెన్నో చేయవచ్చు. అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు రోబో సినిమా చూస్తే ఒక క్లిక్ ద్వారా చిట్టి రోబో రూపం ప్రత్యక్షం అయి, అది నేరుగా మాట్లాడుతుంది. ఈ సాంకేతికతతో ఏదో వీడియోలో చూసినట్లు కాకుండా నేరుగా కలుసుకున్న అనుభూతి కలుగుతుంది. అయితే ఈ సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. మరి మీరు ఈ తరహా అనుభూతి పొందాలంటే.. భారతీయ మెటావర్స్‌ ప్లాట్‌ఫారమ్ 'లోకా' తమ వినియోగదారులను ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో వర్చువల్ టూర్ చేయడానికి అనుమతిస్తుంది. మరొక ప్లాట్‌ఫారమ్ Zippy తమ వినియోగదారులు ఎక్కడ ఉన్నా బోస్టన్ మారథాన్‌ "పరుగు" చేయడానికి అనుమతిస్తుంది. అలాగే అజ్నాలెన్స్, ఇమాజినేట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఫ్యాక్టరీ ఫ్లోర్ లేదా డీప్ సీ డ్రిల్లింగ్ రిగ్‌పై శిక్షణను అందించడానికి భారతీయ బహుళజాతి సంస్థలతో కలిసి పని చేస్తున్నాయి. ఇంకా మరిన్ని విశేషాలను ఈ వీడియోలో తెలుసుకోండి.

More