తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. దమ్ మసాలా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్: చూసేయండి

Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. దమ్ మసాలా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్: చూసేయండి

29 January 2024, 19:10 IST

    • Guntur Kaaram - Dum Masala Full video song: గుంటూరు కారం చిత్రం నుంచి దమ్ మసాలా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. మహేశ్ బాబు మాస్ డ్యాన్స్‌తో ఈ పాటలో అదరగొట్టారు.
Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. దమ్ మసాలా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. దమ్ మసాలా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. దమ్ మసాలా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మంచి కలెక్షన్లను రాబట్టింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ మూవీ థియేటర్లలో అడుగుపెట్టింది. మహేశ్ బాబు మాస్ యాక్షన్, డ్యాన్సులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినా.. మహేశ్ స్టామినాతో మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు గుంటూరు కారం చిత్రం నుంచి సూపర్ స్టార్ అభిమానులకు సర్‌ప్రైజ్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Prime Video OTT Top Movies: ప్రైమ్ వీడియోలో టాప్‍కు దూసుకొచ్చిన యాక్షన్ మూవీ.. టాప్-10లో ఉన్నవి ఇవే

Vidya Vasula Aham OTT: నేరుగా ఓటీటీలోకి విద్యా వాసుల అహం సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

The Goat Life OTT: పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?

OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న జర హట్కే జర బచ్కే మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. తెలుగులో కూడా..

గుంటూరు కారం సినిమాలో ‘దమ్ మసాలా’ సాంగ్ చాలా పాపులర్ అయింది. ఈ పాటలో మహేశ్ మాస్ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు. ఈ ‘దమ్ మసాలా’ ఫుల్ వీడియో సాంగ్‍ను మూవీ టీమ్ నేడు (డిసెంబర్ 29) రిలీజ్ చేసింది.

దమ్ మసాలా ఫుల్ వీడియో సాంగ్ రావడంతో మహేశ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఓ దశలో ‘దమ్ మసాలా’ ఎక్స్ (ట్విట్టర్)లో ట్రెండ్ అయింది.

గుంటూరు కారం సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని మూవీ టీమ్ ఇటీవలే వెల్లడించింది. ఒకే భాషలో ప్రాంతీయ సినిమాగా రిలీజైన ఈ మూవీ రికార్డులను క్రియేట్ చేస్తోందని ట్వీట్ చేసింది. కాగా, ఈ మూవీ థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కావొస్తోంది.

గుంటూరు కారం సినిమా ఫిబ్రవరిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. ఫిబ్రవరి రెండో వారంలో గుంటూరు కారం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గుంటూరు కారం సినిమాను యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మూవీలో ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ చేశారు మహేశ్. రమణ పాత్రలో అదరగొట్టారు. యాక్షన్‍తో పాటు డ్యాన్స్‌తోనూ మెప్పించారు. అయితే, ఈ సినిమా కథనంపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. గుంటూరు చిత్రంలో మదర సెంటిమెంట్ కూడా ప్రధాన అంశంగా ఉంది. ఈ మూవీకి థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

గుంటూరు కారం మూవీలో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మహేశ్ తల్లి పాత్రను సీనియర్ స్టార్ రమ్యకృష్ణ పోషించారు. జయరాం, జగపతి బాబు, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, ఈశ్వరి రావు, వెన్నెల కిశోర్ కీరోల్స్ చేశారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మించారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. మహేశ్ బాబుకు 29వ చిత్రం కావడంతో రాజమౌళి పేరు కూడా కలిసేలా SSMB29 పేరుతో ఈ మూవీని ప్రస్తుతం పిలుస్తున్నారు. భారీ బడ్జెట్‍తో గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు రాజమౌళి. ఇప్పటికే SSMB29 స్క్రిప్ట్ సిద్ధం కాగా.. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం