తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Director Buchi Babu Remuneration: రామ్‌ చరణ్‌ మూవీ కోసం డైరెక్టర్‌ బుచ్చిబాబుకు రికార్డు రెమ్యునరేషన్‌

Director Buchi Babu Remuneration: రామ్‌ చరణ్‌ మూవీ కోసం డైరెక్టర్‌ బుచ్చిబాబుకు రికార్డు రెమ్యునరేషన్‌

HT Telugu Desk HT Telugu

20 December 2022, 15:29 IST

google News
    • Director Buchi Babu Remuneration: రామ్‌ చరణ్‌ మూవీకి రికార్డు రెమ్యునరేషన్‌ అందుకోబోతున్నాడు డైరెక్టర్‌ బుచ్చిబాబు. ఇప్పుడీ న్యూస్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.
తన కొత్త బెంజ్ కారులో డైరెక్టర్ సుకుమార్ తో బుచ్చి బాబు
తన కొత్త బెంజ్ కారులో డైరెక్టర్ సుకుమార్ తో బుచ్చి బాబు

తన కొత్త బెంజ్ కారులో డైరెక్టర్ సుకుమార్ తో బుచ్చి బాబు

Director Buchi Babu Remuneration: ఉప్పెన మూవీతో టాలీవుడ్‌లోకి ఉప్పెనలానే వచ్చాడు డైరెక్టర్‌ బుచ్చిబాబు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో అతనికి మంచి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో తన రెండో సినిమానే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో తీసే ఛాన్స్‌ కొట్టేశాడు. తన తొలి సినిమా ఉప్పెనలోనూ మెగా కాంపౌండ్ నుంచే వచ్చిన వైష్ణవ్‌ తేజ్‌ నటించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు రామ్‌చరణ్‌తో బుచ్చి బాబు సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అంతేకాదు ఈ సినిమా స్క్రిప్ట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ పర్యవేక్షణలో సిద్ధం కానుంది. ఇక ఈ మూవీని సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో కో ప్రొడ్యూస్‌ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు డైరెక్టర్‌ బుచ్చి బాబు అందుకోబోతున్న రెమ్యునరేషన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.

అతడు ఏకంగా రూ.20 కోట్ల రెమ్యునరేషన్‌ అందుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా ఓ రికార్డే. కెరీర్‌లో కేవలం రెండో సినిమా చేస్తున్న డైరెక్టర్‌ టాలీవుడ్‌లో ఇంత భారీ మొత్తం అందుకోవడం విశేషమే. ఇప్పటికే అడ్వాన్స్‌ రూపంలోనే పెద్ద మొత్తం బుచ్చి బాబుకు అందిస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు ఈ పాన్‌ ఇండియా మూవీ కోసం రామ్‌ చరణ్‌ కూడా భారీగానే అందుకుంటున్నాడు. అతనికి ఏకంగా రూ.100 కోట్లకుపైగా రెమ్యునరేషన్‌ రూపంలో అందనుంది. భారీ బడ్జెట్‌తో ఈ స్పోర్ట్స్‌ డ్రామాను తెరకెక్కించనున్నారు. వెంకట సతీష్‌ కిలారు ప్రొడ్యూస్‌ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్‌ జరుపుకోనుంది.

ఈ సినిమాలో ఫిమేల్‌ లీడ్‌, ఇతర నటీనటులను ఇంకా అనౌన్స్‌ చేయాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సమర్పించనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరింత సమచారాన్ని అధికారికంగా అనౌన్స్‌ చేయనున్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ఆర్సీ15 షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకోగా.. జనవరిలో మళ్లీ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

తదుపరి వ్యాసం