NTR: ఎన్టీఆర్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ఉప్పెన దర్శకుడు-uppena director buchibabu busy with preparing story for ntr movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Uppena Director Buchibabu Busy With Preparing Story For Ntr Movie

NTR: ఎన్టీఆర్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ఉప్పెన దర్శకుడు

HT Telugu Desk HT Telugu
Jul 28, 2022 04:20 PM IST

ఎన్టీఆర్ (Ntr)తో ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా (Buchibabu Sana) ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై బుచ్చిబాబు సానా గురువారం ఆస‌క్తికర ట్వీట్ చేశాడు.

ఎన్టీఆర్
ఎన్టీఆర్ (twitter)

ఉప్పెన సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే భారీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకున్నాడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా విభిన్న ప్రేమ‌క‌థ‌తో ఈసినిమాను తెర‌కెక్కించి గురువుకు త‌గ్గ శిష్యుడిగా పేరుతెచ్చుకున్నారు. ఉప్పెన స‌క్సెస్ త‌ర్వాత బుచ్చిబాబు సానా త‌న ద్వితీయ చిత్రాన్ని ఎన్టీఆర్‌తో చేయ‌బోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా గురువారం ఈ సినిమాపై బుచ్చిబాబు సానా క్లారిటీ ఇచ్చారు.

ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో క‌లిసి బుచ్చిబాబు స్క్రిప్ట్ డిస్క‌ష‌న్స్‌లో పాల్గొన్న ఫొటోలు కొన్నాళ్లుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పుష్ప 2 స్క్రిప్ట్ వ‌ర్క్‌లో భాగంగానే బుచ్చిబాబుతో సుకుమార్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. శిష్యుడి నుండి కొన్ని ఐడియాల‌ను సుకుమార్ స్వీక‌రించిన‌ట్లు ఈ ఫొటోల‌ను ఉద్దేశించి ప‌లువురు కామెంట్స్ చేశారు. వీటిపై బుచ్చిబాబు గురువారం స్పందించారు. ఉప్పెన త‌ర్వాత తాను చేయ‌బోయే త‌దుప‌రి సినిమాకు సంబంధించిన డిస్క‌ష‌న్స్‌లో భాగంగా దిగిన ఫొటో ఇద‌ని పేర్కొన్నాడు.

‘మా గురువుగారు సుకుమార్ సార్ నా కోసం, నా సినిమా కోసం హెల్ప్ చేయ‌డానికి వ‌చ్చారు. సుకుమార్ సార్ సినిమా క‌థ‌లో కూర్చొని డిస్క‌ష‌న్స్ చేసేంత స్థాయి నాకు లేదు. ఆయ‌న నుంచి నేర్చుకోవ‌డం, తీసుకోవ‌డమే త‌ప్ప ఆయ‌న‌కు ఇచ్చేంత లేదు’ అంటూ బుచ్చిబాబు ట్వీట్ చేశారు. అత‌డి ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఎన్టీఆర్ సినిమా కోసమే బుచ్చిబాబు కథ సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు రెడీ చేసిన పాయింట్ న‌చ్చ‌డంతో ఎన్టీఆర్ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ స‌క్సెస్ త‌ర్వాత కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారు ఎన్టీఆర్‌. త్వ‌ర‌లో ఈ సినిమా సెట్స్‌పైకిరానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్