తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nene Vastunna Ott Release Date: ధనుష్ 'నేనే వస్తున్నా' ఓటీటీ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Nene Vastunna OTT Release Date: ధనుష్ 'నేనే వస్తున్నా' ఓటీటీ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

22 October 2022, 17:45 IST

google News
    • Nene Vastunna OTT Release Date: ధనుష్ హీరోగా రూపొందిన నేనే వస్తున్నా సినిమా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. గత నెలాఖరున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు.
నేనే వస్తున్నా ఓటీటీ  రిలీజ్ డేట్ ఫిక్స్
నేనే వస్తున్నా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

నేనే వస్తున్నా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Nene Vastunna OTT Release Date: కోలీవుడ్ హీరో ధనుష్ ఇటీవలే తిరు చిత్రంతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపింది. ఇదే ఊపులో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే అతడు నటించిన నేనే వస్తున్నా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. సెల్వ రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేశాడు. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీ అయింది.

నేనే వస్తున్నా సినిమా అక్టోబరు 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. వెలుగు, చీకటి మధ్య యుద్ధమేనని పేర్కొంది. సెప్టెంబరు నెలాఖరున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తమిళంలో ఓ మాదిరిగా ఆడినప్పటికీ.. తెలుగులో మాత్రం పెద్దగా అలరించలేదు.

సైకాలజికల్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు హర్రర్ టచ్ ఇస్తూ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు దర్శకుడు సెల్వరాఘవన్. ఇద్దరు కవల సోదరులు. అందులో ఓ కుర్రాడు ప్రభు మంచికి మారు పేరయితే.. మరొకడు ఖదీర్ సైకో. తండ్రిని క్రూరంగా చంపాడన్న కారణంతో తల్లి, తమ్ముడు అతడిని చిన్నతనంలోనే ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు. మరి ఇటు తల్లి ప్రేమకు, సోదరుడు అనురాగానికి దూరమైన కుర్రాడు చివరకు ఎలా మారాడు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు అనేది చిత్ర కథాంశం.

నేనే వస్తున్నా సినిమాకు ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇందులో యోగిబాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లీ అవ్రామ్, సెల్వరాఘవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేయనున్నారు. వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చారు. ఈ నెలలోనే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు.

తదుపరి వ్యాసం