తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Record: దేవర దెబ్బకు రికార్డులు బ్రేక్.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే ఆ అరుదైన రికార్డు

Devara Record: దేవర దెబ్బకు రికార్డులు బ్రేక్.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే ఆ అరుదైన రికార్డు

Hari Prasad S HT Telugu

09 September 2024, 9:45 IST

google News
    • Devara Record: దేవర మూవీ రికార్డుల హోరు అప్పుడే మొదలైంది. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము రేపుతోంది. మంగళవారం (సెప్టెంబర్ 10) ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
దేవర దెబ్బకు రికార్డులు బ్రేక్.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే ఆ అరుదైన రికార్డు
దేవర దెబ్బకు రికార్డులు బ్రేక్.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే ఆ అరుదైన రికార్డు

దేవర దెబ్బకు రికార్డులు బ్రేక్.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే ఆ అరుదైన రికార్డు

Devara Record: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ ఊహించినట్లే రిలీజ్ కు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఇండియాలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాకపోయినా.. ఓవర్సీస్ లో మొదలయ్యాయి. అంతేకాదు నార్త్ అమెరికాలో ఇప్పటికే ఈ సినిమా 8 లక్షల డాలర్ల మార్క్ అందుకోవడం విశేషం.

దేవర మిలియన్ డాలర్ మార్క్

దేవర జోరు చూస్తుంటే ట్రైలర్ కూడా రిలీజ్ కాక ముందే మిలియన్ డాలర్ మార్క్ అందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ను ట్రైలర్ ను మంగళవారం (సెప్టెంబర్ 10) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

యూఎస్ఏ ప్రీమియర్ కు మరో 18 రోజుల సమయం ఉండగానే రికార్డు సమయంలోనే 25 వేల టికెట్లు అమ్ముడైనట్లు కూడా మేకర్స్ వెల్లడించారు. ఇప్పడే ఇలా ఉంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సేల్స్ మరింత పెరిగి రిలీజ్ సమయానికి ఎన్ని రికార్డులు బ్రేకవుతాయో చూడాలి.

ట్రైలర్ కోసం ఎదురు చూపులు

దేవర ట్రైలర్ రిలీజ్ గురించి మేకర్స్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. మంగళవారం ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ ముంబైలో జరగనుండగా.. ఆదివారమే తారక్ అక్కడికి వెళ్లాడు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు రాగా అన్నీ ఆకట్టుకున్నాయి.

అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మెస్మరైజ్ చేస్తోంది. ఈ సాంగ్స్ కూడా సినిమా రిలీజ్ కోసం మరింత ఆతృతగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. దేవరలో జూనియర్ ఎన్టీఆర్ తోపాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ నటించారు. వీళ్లే కాకుండా శ్రీకాంత్, తారక్ పొన్నప్ప, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ ముఖ్యమైన పాత్రలు పోషించారు.

చేతికి కట్టు తీసేసిన తారక్

ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టుకు గత నెల స్వల్ప గాయమైంది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, రెండు వారాల్లో అది తగ్గిపోతుందని ఆయన టీమ్ వెల్లడించింది. ఇటీవల కర్ణాటకలోని ఆలయాలను దర్శించుకునేందుకు వెళ్లిన సమయంలోనూ ఎన్టీఆర్ చేతికి కట్టు కనిపించింది. దీంతో గాయం ఇంకా తగ్గలేదా అనే టెన్షన్ నెలకొంది.

అయితే, ఎన్టీఆర్ ఇప్పుడు ఎడమ చేతికి ఉన్న ఆ కట్టు తీసేశారు. ఆయన ముంబైకు బయలుదేరిన సమయంలో చేతికి కట్టు కనిపించలేదు. దీంతో గాయం పూర్తిగా నయమైందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‍ ఔట్‍ఫిట్‍లో స్టైలిష్‍గా ముంబైకు బయలుదేరారు ఎన్టీఆర్. బ్లాక్ హుడీ, జీన్స్ ధరించి.. బ్లాక్‍ గ్లాసెస్‍తో ఆయన లుక్ అదిరిపోయింది.

దేవర సినిమాకు తెలుగుతో పాటు హిందీలోనూ మంచి క్రేజ్ ఉంది. దీన్ని మరింత పెంచేలా ముంబై నుంచే ప్రమోషన్లలను మూవీ టీమ్ షురూ చేస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రంపై బజ్ మరింత పెరగడం పక్కాగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం