తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Ott Release Date: దేవర ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. ముందుగా అనుకున్నట్లే.. ఎక్కడ చూడాలంటే..

Devara OTT Release Date: దేవర ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. ముందుగా అనుకున్నట్లే.. ఎక్కడ చూడాలంటే..

Hari Prasad S HT Telugu

14 October 2024, 17:52 IST

google News
    • Devara OTT Release Date: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే అంటూ ఓ బజ్ క్రియేటైంది. ముందుగా అనుకున్నట్లే థియేటర్లలో రిలీజైన ఆరు వారాల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కానుంది.
దేవర ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. ముందుగా అనుకున్నట్లే.. ఎక్కడ చూడాలంటే..
దేవర ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. ముందుగా అనుకున్నట్లే.. ఎక్కడ చూడాలంటే..

దేవర ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. ముందుగా అనుకున్నట్లే.. ఎక్కడ చూడాలంటే..

Devara OTT Release Date: దేవర మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుందా? వచ్చే నెలలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుందా? తాజాగా వస్తున్న వార్తలను చూస్తుంటే.. ఈ నెలలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సెప్టెంబర్ 27 నుంచి థియేటర్లలో ఆడుతున్న ఈ మూవీ.. ఇప్పటికే రూ.500 కోట్లకుపైగా కొల్లగొట్టిన విషయం తెలిసిందే.

దేవర ఓటీటీ రిలీజ్ డేట్

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ నవంబర్ 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు మిగిలిన భాషల్లోనూ ఆ రోజు నుంచే దేవర స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ డైరెక్ట్ చేసిన దేవర మూవీ.. 16 రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

తారక్ సోలో హీరోగా నటించి ఈ మార్క్ దాటిని తొలి సినిమాగా దేవర నిలిచింది. గతంలో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ రూ.1200 కోట్లకుపైనే వసూలు చేసిన విషయం తెలిసిందే. అయితే మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా దేవర ఇలా రూ.500 కోట్లకుపైగా వసూలు చేయడం మాత్రం సాధారణం విషయం కాదని చెప్పొచ్చు.

ఓటీటీ హక్కులకు రికార్డు ధర

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర సినిమాపై మొదటి నుంచీ ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.100 కోట్లకుపైగా చెల్లించి ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

దేవర పాన్ ఇండియా మూవీగా రావడంతో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లన్నీ నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కానున్నాయి. మేకర్స్ తో ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి మూవీని తీసుకు వచ్చే వీలుంటుంది. దీంతో నవంబర్ 8న దేవర ఓటీటీలోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

దేవర మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మించాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించగా.. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, కలైయారాసన్, శృతి మరాఠే కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించాడు.

దేవ‌ర‌, వ‌ర రెండు పాత్ర‌ల్లో ఎన్టీఆర్ ఒదిగిపోయాడు. భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన పాత్ర‌లు అత‌డు చూపించిన వేరియేష‌న్‌, డైలాగ్ డెలివ‌రీ బాగున్నాయి. ఎన్టీఆర్‌పై షూట్ చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కు ట్రీట్‌లా ఉన్నాయి. ఎన్టీఆర్‌కు ధీటుగా సైఫ్ అలీఖాన్ విల‌నిజం సాగింది.

భైర పాత్ర‌లో త‌న‌ను త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోలేనంత‌గా సైఫ్ అలీఖాన్ న‌టించాడు. జాన్వీక‌పూర్ పాత్ర‌కు పాట‌లు, కొన్ని సీన్స్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ప్ర‌కాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, ముర‌ళీ శ‌ర్మ న‌ట‌న ఓకే అనిపిస్తుంది. అనిరుధ్ బీజీఎమ్‌, చుట్ట‌మ‌ల్లే పాట బాగున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం