Devara OTT Platform: దేవర ఓటీటీ హక్కులు.. కళ్లు చెదిరే మొత్తానికి దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ
15 January 2024, 8:06 IST
- Devara OTT Platform: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ నటిస్తున్న దేవర మూవీ ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఈ పాన్ ఇండియా సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్
Devara OTT Platform: దేవర మూవీకి ఉన్న హైప్ ఎలాంటిదో మనకు తెలుసు. దీంతో ఈ సినిమా థియేట్రికల్, ఓటీటీ హక్కులకు ఎంత డిమాండ్ ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది. తెలుగే కాదు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల హక్కులు కూడా ఈ ఓటీటీకే దక్కాయి.
కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవర మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అతడే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో దేవర ఓటీటీ హక్కుల గురించి వెల్లడించాడు. ఎంత మొత్తానికి ఈ హక్కులు అమ్మారన్నది వెల్లడించలేదు కానీ.. అన్ని భాషల ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ కే వెళ్లాయని మాత్రం చెప్పాడు.
8 వారాల తర్వాతే ఓటీటీలోకి..
ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తారక్.. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజై మార్చి 25నాటికి రెండేళ్లు పూర్తవుతుంది. ఆ తర్వాత పది రోజులకే ఈ దేవర అభిమానుల ముందుకు రానుంది. ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజై 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరింది.
సాధారణంగా 4 వారాల తర్వాత చాలా సినిమాలను ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. అయితే పాన్ ఇండియా మూవీ కావడం, ఓ రేంజ్ హైప్ ఉండటంతో 8 వారాల తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి రానుంది. ఈ దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.
ఇక ఈ మూవీలో తారక్ డ్యుయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. తండ్రిగా, కొడుకుగా అతడు కనిపించనున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఈ మధ్యే గ్లింప్స్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ గ్లింప్స్ కు రెస్పాన్స్ మామూలుగా లేదు. ఎర్ర సముద్రం ఎర్రగా ఎందుకుంటుందో ఇప్పుడు తెలిసిందా అన్నట్లుగా తారక్ డైలాగులు సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి.
తారక్ గంభీరమైన వాయిస్, యాక్షన్ దేవర గ్లింప్స్ లో హైలైట్ గా చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్స్‌తో పవర్ ఫుల్‌గా దేవర గ్లింప్స్ ఉంది. సముద్రంపై ఓడల్లో వచ్చే కొందరు నౌకను ఎక్కి దోపిడీ చేసే షాట్‍తో దేవర గ్రింప్స్ మొదలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఊచకోత మొదలైంది. కత్తులతో వీరంగం ఆడి విలన్లను ఎన్టీఆర్ తెగనరికే సీక్వెన్స్ ఉంది. రక్తంతో సముద్రపు నీరే ఎరుపెక్కుతుంది. రక్తంతో అలలు ఎగసిపడతాయి.
“ఈ సముద్రం చేపల కంటే కత్తులను, నెత్తురు ఎక్కువగా చూసి ఉండాది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు” అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‍తో ఈ గ్లింప్స్ ముగిసింది. ఈ గ్లింప్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్లు, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్‍కు కూడా దద్దరిల్లిపోయింది. ఇంగ్లిష్ రిలిక్స్‌తో మొదలయ్యే బీజీఎం.. పవర్‌ఫుల్‍గా ఉంది. విజువల్స్, వీఎఫ్‍ఎక్స్ చాలా హై స్టాండర్డ్‌తో ఉన్నాయి. ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్‍లో ఉంది.