Devara Glimpse: దేవర గ్లింప్స్ వచ్చేసింది.. సముద్రాన్ని ఎరుపెక్కించిన ఎన్టీఆర్
Devara Glimpse: దేవర సినిమా గ్లింప్స్ వచ్చేసింది. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ గ్లింప్స్‌లో యాక్షన్ అదిరిపోయింది.
Devara Glimpse: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాపై క్రేజ్ ఏ స్థాయిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ డ్రామా మూవీగా భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతోంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ రేంజ్‍లో హిట్ అయ్యాక ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో దేవరపై అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. ఈ తరుణంలో దేవర సినిమా గ్లింప్స్ నేడు (జనవరి 8) రిలీజ్ అయింది.
యాక్షన్ సీక్వెన్స్‌తో పవర్ ఫుల్‌గా దేవర గ్లింప్స్ ఉంది. సముద్రంపై ఓడల్లో వచ్చే కొందరు నౌకను ఎక్కి దోపిడీ చేసే షాట్‍తో దేవర గ్రింప్స్ మొదలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఊచకోత మొదలైంది. కత్తులతో వీరంగం ఆడి విలన్లను ఎన్టీఆర్ తెగనరికే సీక్వెన్స్ ఉంది. రక్తంతో సముద్రపు నీరే ఎరుపెక్కుతుంది. రక్తంతో అలలు ఎగసిపడతాయి. “ఈ సముద్రం చేపల కంటే కత్తులను, నెత్తురు ఎక్కువగా చూసి ఉండాది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు” అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‍తో ఈ గ్లింప్స్ ముగిసింది. ఈ గ్లింప్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్లు, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్‍కు కూడా దద్దరిల్లిపోయింది. ఇంగ్లిష్ రిలిక్స్‌తో మొదలయ్యే బీజీఎం.. పవర్‌ఫుల్‍గా ఉంది. విజువల్స్, వీఎఫ్‍ఎక్స్ చాలా హై స్టాండర్డ్‌తో ఉన్నాయి. ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్‍లో ఉంది.
దేవర గ్లింప్స్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ అయింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రూపొందుతోంది. దేవర పార్ట్-1 సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
దేవర చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, నరైన్, కలైరాసన్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ ఈ మూవీలో కీరోల్స్ చేస్తున్నారు. అయితే, గ్లింప్స్‌లో ఇతర క్యారెక్టర్లను రివీల్ చేయలేదు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న దేవర చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా ఉన్నారు. మరో నెలలోనే దేవర షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. ఏప్రిల్ 5న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దేవర సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
సముద్ర తీరంలో ఉండే తమ వారి కోసం, తమ ప్రాంతం కోసం విలన్లతో పోరాడే యోధుడు దేవరాజు పాత్రలో దేవర చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో యాక్షన్ సీన్లు ప్రధాన హైలైట్‍గా ఉండనున్నాయి. అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని తెలుస్తోంది. రెండు పార్టులుగా దేవర చిత్రం రానుంది.