తెలుగు న్యూస్  /  Entertainment  /  Dasara Movie Pre Release Event Date Fix And Completed Censor Process

Dasara Pre Release Event: దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

25 March 2023, 14:18 IST

  • Dasara Pre Release Event: నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది.

దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్

దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్

Dasara Pre Release Event: నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. దసరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది చిత్రబృందం.

ట్రెండింగ్ వార్తలు

Biggest Flop Movie: ఒక్క సినిమాతోనే రూ.170 కోట్ల నష్టం.. ఇండియన్ సినిమాలో భారీ నష్టాలను మిగిల్చిన మూవీస్ ఇవే

Shaitaan OTT: ఓటీటీలోకి 4 రోజుల్లో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూస్తారంటే?

Thandel OTT Rights: నాగ చైతన్య తండేల్ ఓటీటీ హక్కులు కళ్లు చెదిరే మొత్తానికి.. చైతూ కెరీర్లోనే అత్యధికం

Bigg Boss Priyanka: హైదరాబాద్‌లో భూమి కొన్న బిగ్ బాస్ ప్రియాంక.. వీడియో అసలు విషయం చెప్పిన వంటలక్క

దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 26 ఆదివారం నాడు నిర్వహించనున్నారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఇందుకు వేదిక కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణలోని సింగరేణి సమీపాన ఉండే వీర్లపల్లి గ్రామం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.

అంతేకాకుండా దసరా సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది సెన్సార్ బృందం. సబ్ టైటిల్స్ సహా కొన్ని అసభ్యకరమైన సంభాషణలకు మ్యూట్ పెట్టాలని, మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిపేలా డిస్‌క్లైమర్ పెట్టాలని సూచించింది. అంతేకాకుండా వైలెన్స్ ఉన్న సన్నివేశాలను సీజీతో కవర్ చేయాలని చిత్రబృందానికి సూచించింది. మొత్తంగా 16 కట్స్ చెప్పినట్లు సమాచారం. దసరా నిడివి వచ్చేసి 2 గంటల 39 నిమిషాలు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.