తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Darling Collections: భారీగా డ్రాప్ అయిన డార్లింగ్ మూవీ కలెక్షన్లు.. బయ్యర్లకు నష్టాలే!

Darling Collections: భారీగా డ్రాప్ అయిన డార్లింగ్ మూవీ కలెక్షన్లు.. బయ్యర్లకు నష్టాలే!

22 July 2024, 16:59 IST

google News
    • Darling Movie Collections: డార్లింగ్ సినిమా కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. చాలా అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. మళ్లీ కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు.
Darling Collections: భారీగా డ్రాప్ అయిన డార్లింగ్ మూవీ కలెక్షన్లు
Darling Collections: భారీగా డ్రాప్ అయిన డార్లింగ్ మూవీ కలెక్షన్లు

Darling Collections: భారీగా డ్రాప్ అయిన డార్లింగ్ మూవీ కలెక్షన్లు

టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలు పోషించిన ‘డార్లింగ్’ సినిమా మంచి అంచనాలను నెలకొల్పింది. గ్లింప్స్ నుంచి ట్రైలర్ వరకు ప్రతీది ఈ చిత్రంపై బజ్ పెంచింది. సుమారు మూడేళ్ల అనంతరం నభా నటేష్ రీఎంట్రీ ఇవ్వడంతోనూ డార్లింగ్ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. అయితే, అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ గత శుక్రవారం (జూలై 19) థియేటర్లలో రిలీజై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

డార్లింగ్ చిత్రానికి మొదటి నుంచే ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు, టాక్ వచ్చాయి. దీంతో ఈ మూవీ వసూళ్లపై ఇవి బాగా ప్రభావం చూపాయి. కలెక్షన్లు డ్రాప్ అవుతూ వచ్చాయి. 

కలెక్షన్లు ఎంతంటే..

డార్లింగ్ సినిమాకు తొలి మూడు రోజుల్లో సుమారు రూ.కోటిన్నర వరకు కలెక్షన్లు వచ్చాయని అంచనాలు ఉన్నాయి. అయితే, వీకెండ్ తర్వాత నాలుగో రోజైన సోమవారం ఈ మూవీకి భారీగా కలెక్షన్లు డ్రాప్ అవడం ఖాయంగా ఉంది. బుకింగ్స్ ట్రెండ్ చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తోంది. సోమవారం ఈ చిత్రానికి కనీసం రూ.10లక్షల వసూళ్లు కూడా రావని అంచనాలు కడుతున్నారని ట్రేడ్ నిపుణులు. బాక్సాఫీస్ వద్ద డార్లింగ్ మూవీ మళ్లీ పుంజుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

నిర్మాతలకు ముందే లాభం

ఈ ఏడాది హనుమాన్ చిత్రంతో భారీ బ్లాక్‍బస్టర్ సాధించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ డార్లింగ్ చిత్రాన్ని ప్రొడ్యూడ్ చేసింది. ఆ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు సుమారు రూ.8కోట్ల బడ్జెట్‍ను ఖర్చు చేసినట్టు తెలిసింది. ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారానే సుమారు రూ.8కోట్ల నిర్మాతలకు వచ్చేసింది. థియేట్రికల్ బిజినెస్ కూడా రూ.7కోట్ల వరకు జరిగింది. దీంతో రిలీజ్‍కు ముందే ప్రొడ్యూజర్లకు టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేశాయి. లాభాలు దక్కాయి.

బయ్యర్లకు నష్టాలు!

డార్లింగ్ సినిమా థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసిన బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. ఈ మూవీ కలెక్షన్లు విపరీతంగా డ్రాప్ కాగా.. మళ్లీ పుంజుకునే సంకేతాలు కనిపించడం లేదు. సోమవారం ట్రెండ్ చూస్తే ఇది స్పష్టమవుతోంది.

డార్లింగ్ చిత్రంలో ప్రియదర్శి, నభాతో పాటు విష్ణు, హస్య బ్రహ్మ బ్రహ్మానందం, కృష్ణ చైతన్య, అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో స్ల్పిట్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిగా నభా నటించారు. అయితే, ఆమె పర్ఫార్మెన్స్‌కు కూడా మిశ్రమ స్పందనే వచ్చింది. కొత్త దర్శకుడు అశ్విన్ రామ్ ఈ చిత్రాన్ని ఎంగేజింగ్‍గా తెరకెక్కించడంలో తడబడ్డారు.

డార్లింగ్ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. నరేశ్ రామదురై సినిమాటోగ్రఫీ చేయగా.. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

డార్లింగ్ స్టోరీలైన్

తన భార్యతో పారిస్‍కు హనీమూన్‍కు వెళ్లడమే లక్ష్యంగా బతుకుతుంటాడు రాఘవ్ (ప్రియదర్శి). అయితే, ఓ పెళ్లి క్యాన్సల్ అవుతుంది. ఈ క్రమంలో ఆనంది (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత పెళ్లి చకచకా జరుగుతుంది. అనంతరం ఆనందికి స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని బయటపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. రాఘవ్ జీవితం ఎలా మారింది.. సమస్య తీరిందా అనే విషయాలు డార్లింగ్ సినిమాలో ఉంటాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం