తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dadasaheb Phalke Awards 2024: బెస్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి.. బెస్ట్ యాక్ట్రెస్ నయనతార.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు

Dadasaheb Phalke awards 2024: బెస్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి.. బెస్ట్ యాక్ట్రెస్ నయనతార.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు

Hari Prasad S HT Telugu

21 February 2024, 9:57 IST

    • Dadasaheb Phalke awards 2024: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు 2024లో బెస్ట్ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా నిలవగా.. ఉత్తమ నటిగా నయనతార, ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్ నిలిచారు.
దాదాసాహెబ్ ఫాల్కే 2024 అవార్డుల్లో బెస్ట్ విలన్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్ అవార్డులు అందుకున్న బాబీ డియోల్, నయనతార, సందీప్ రెడ్డి
దాదాసాహెబ్ ఫాల్కే 2024 అవార్డుల్లో బెస్ట్ విలన్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్ అవార్డులు అందుకున్న బాబీ డియోల్, నయనతార, సందీప్ రెడ్డి

దాదాసాహెబ్ ఫాల్కే 2024 అవార్డుల్లో బెస్ట్ విలన్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్ అవార్డులు అందుకున్న బాబీ డియోల్, నయనతార, సందీప్ రెడ్డి

Dadasaheb Phalke awards 2024: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు 2024 ఈవెంట్ మంగళవారం (ఫిబ్రవరి 20) రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ అవార్డుల్లో యానిమల్ మూవీ తీసిన సందీప్ రెడ్డి వంగా బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకోవడం విశేషం. ఇక ఉత్తమ నటీనటులుగా షారుక్ ఖాన్, నయనతార నిలిచారు. ఈ అవార్డుల సెర్మనీకి బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల పూర్తి జాబితా

ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్)

ఉత్తమ నటి: నయనతార (జవాన్)

ఉత్తమ నటి: రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ vs నార్వే)

ఉత్తమ దర్శకుడు: సందీప్ రెడ్డి (యానిమల్)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)

ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (జవాన్)

ఉత్తమ నేపథ్య గాయకుడు - వరుణ్ జైన్ - తేరే వాస్తే (జర హట్కే జర బచ్కే)

ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు: బాబీ డియోల్ (యానిమల్)

టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటి: రూపాలీ గంగూలీ (అనుపమ)

టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటుడు: నీల్ భట్

టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్: ఘుమ్ హై కిసికే ప్యార్ మే

వెబ్ సిరీస్‌లో ఉత్తమ నటి: కరిష్మా తన్నా (స్కూప్)

చలనచిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సహకారం: మౌషుమి ఛటర్జీ

సంగీత పరిశ్రమకు అత్యుత్తమ సహకారం: కేజే యేసుదాస్

జవాన్, యానిమల్ హవా

గతేడాది బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన సినిమాలు జవాన్, యానిమల్. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా షారుక్ ఖాన్ నటించిన జవాన్ నిలిచింది. ఈ సినిమాలో నటించిన షారుక్ ఖాన్, నయనతార ఉత్తమ నటీనటులుగా అవార్డులు అందుకోవడం విశేషం. ఇక యానిమల్ మూవీ రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోపాటు బెస్ట్ విలన్ గా బాబీ డియోల్ నిలిచాడు.

ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ ఈ సినిమా దుమ్ము రేపింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. థియేటర్లలోనే కాదు తర్వాత ఓటీటీలోనూ యానిమల్ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ లో అతి ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియన్ సినిమాగా నిలవడం విశేషం. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ మూవీపై ఎన్ని విమర్శలు ఉన్నా.. ఆ మూవీ అదే స్థాయిలో అవార్డులు, రివార్డులు కూడా అందుకుంది.

ఇక జవాన్ మూవీ 2023లో అత్యధిక వసూళ్లు సాధించింది. అంతకుముందు అదే ఏడాది పఠాన్ తో వెయ్యి కోట్ల సినిమా అందుకున్న షారుక్ ఖాన్.. వరుసగా రెండో సినిమాను కూడా ఆ మార్క్ దాటించాడు. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి షారుక్, నయనతార ఉత్తమ నటీనటులుగా అవార్డులు అందుకున్నారు. అంతేకాదు మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దక్కించుకున్నాడు. మొత్తంగా ఈ రెండు సినిమాలు కలిపి ఐదు కీలకమైన అవార్డులు గెలుచుకున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం