Filmfare Awards Winners: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. ఉత్తమ నటీనటులుగా ఆ భార్యాభర్తలు
Filmfare Awards Winners: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ఉత్సవం ఆదివారం (జనవరి 28) రాత్రి గుజరాత్ లోని గాంధీనగర్ లో ఘనంగా జరిగింది. ఉత్తమ నటీనటులుగా భార్యాభర్తలు రణ్‌బీర్, ఆలియా నిలవడం విశేషం.

Filmfare Awards Winners: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో భార్యాభర్తలు రణ్‌బీర్, ఆలియా ఉత్తమ నటీనటులుగా నిలిచారు. 69వ ఫిల్మ్‌ఫేర్ ఉత్సవం గుజరాత్ లోని గాంధీ నగర్ లో జరిగింది. యానిమల్ మూవీ కోసం రణ్‌బీర్ కపూర్ ఉత్తమ నటుడిగా, రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ కోసం ఆలియా భట్ ఉత్తమ నటిగా ఈ అవార్డులు గెలుచుకోవడం విశేషం.
ఈ అవార్డుల కార్యక్రమాన్ని కరణ్ జోహార్ హోస్ట్ చేయగా.. కరీనా కపూర్, కరిష్మా కపూర్, వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ లాంటి వాళ్లు పర్ఫామ్ చేశారు. ఈ అవార్డుల్లో యానిమల్, 12th ఫెయిల్ లాంటి సినిమాలు అవార్డుల పంట పండించాయి. యానిమల్ మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డుతోపాటు బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డులు రాగా.. 12th ఫెయిల్ మూవీకి బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్(క్రిటిక్స్), బెస్ట్ స్క్రీన్‌ప్లే లాంటి అవార్డులు రావడం విశేషం.
యానిమల్ మూవీపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. మితిమీరిన హింస, ఆడవాళ్లను చిన్నచూపు చూడటంలాంటి విమర్శలు ఎదుర్కొంది. అయినా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.900 కోట్లకు పైగా వసూలు చేయడంతోపాటు ఇప్పుడు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ సత్తా చాటింది. అటు 12th ఫెయిల్ మూవీకి మొదటి నుంచీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతలు వీళ్లే
బెస్ట్ ఫిల్మ్ (పాపులర్) - 12th ఫెయిల్
బెస్ట్ ఫిల్మ్ (క్రిటిక్స్) - జోరమ్
బెస్ట్ డైరెక్టర్ - విధూ వినోద్ చోప్రా (12th ఫెయిల్)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ లీడింగ్ రోల్ - రణ్‌బీర్ కపూర్ (యానిమల్)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) - విక్రాంత్ మస్సీ (12th ఫెయిల్)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ లీడింగ్ రోల్ (ఫిమేల్) - ఆలియా భట్ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ)
బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్) - షెఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్ (మేల్) - విక్కీ కౌశల్ (డంకీ)
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్ - షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ)
బెస్ట్ లిరిక్స్ - అమితాబ్ భట్టాచార్య (తేరే వాస్తే - జర హట్కే జర బచ్కే
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ - యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్ధన్ రామేశ్వర్)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) - భూపిందర్ బబ్బల్ (అర్జన్ వైలీ-యానిమల్)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్) - శిల్పా రావ్ (బేషరమ్ రంగ్ - పఠాన్)
బెస్ట్ స్టోరీ - అమిత్ రాయ్ (ఓఎంజీ 2)
బెస్ట్ స్క్రీన్‌ప్లే - విధూ వినోద్ చోప్రా (12th ఫెయిల్)
బెస్ట్ డైలాగ్ - ఇషితా మోయిత్రా (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)