OTT Thriller Movie: డైరెక్ట్‌గా ఓటీటీలోకి లైగర్ బ్యూటీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
05 August 2024, 14:01 IST
- OTT Cyber Thriller Control: కంట్రోల్ సినిమా నేరుగా ఓటీటీలోకే రానుంది. సైబర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అనన్య పాండే మెయిన్ రోల్ చేశారు. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
OTT Cyber Thriller: డైరెక్ట్‌గా ఓటీటీలోకి లైగర్ బ్యూటీ సైబర్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. తెలుగులో విజయ్ దేవరకొండతో లైగర్ మూవీలో హీరోయిన్‍గా నటించారు. గతేడాది బాలీవుడ్‍లో మూడు సినిమాలు చేశారు. అనన్య పాండే ప్రధాన పాత్ర పోషించిన కంట్రోల్ (CTRL) సినిమా షూటింగ్ పూర్తయింది. కంప్యూటర్ కీబోర్డులో కంట్రోల్ పదానికి షార్ట్ కట్‍గా ‘సీటీఆర్ఎల్’ టైటిల్‍తో ఈ సైబర్ థ్రిల్లర్ చిత్రం వస్తోంది. ఈ కంట్రోల్ మూవీని నేరుగా ఓటీటీలోకే తీసుకొచ్చేందుకు మేకర్స్ డిసైడ్ అయ్యారు. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
కంట్రోల్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అక్టోబర్ 4వ తేదీన ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ నేడు (ఆగస్టు 5) అధికారికంగా వెల్లడించింది. ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేసింది.
మళ్లీ ఆలోచించండి
ఇంటర్నెట్ వాడకం, సైబర్ నేరాలు అంశంపై కంట్రోల్ చిత్రం రానుంది. ప్రస్తుత ఇంటర్నెట్ కాలంలో మీకు సంబంధించిన విషయాలు కంట్రోల్‍లోనే ఉన్నాయనుకుంటున్నారా.. మళ్లీ ఆలోచించండి అనేలా ఈ ప్రోమో ఉంది. “మీ సంతోషం, మీ రిలేషన్‍షిప్స్, మీ జీవితం మీ కంట్రోల్‍లోనే ఉన్నాయని భావిస్తున్నారా.. మళ్లీ ఆలోచించండి” అని ఈ ప్రోమోలో ఉంది. ఈ చిత్రంలో అనన్య పాండేతో పాటు విహాన్ సమత్ మెయిన్ రోల్ చేశారు. అక్టోబర్ 4న కంట్రోల్ మూవీ వస్తుందని నెట్‍ఫ్లిక్స్ సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసింది.
కంట్రోల్ మూవీకి విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించారు. ఉడాన్, లూతేరా, ట్రాప్డ్ లాంటి చిత్రాలను ఆయన గతంలో తెరకెక్కించారు. భారీగా పాపులర్ అయిన సెక్రేడ్ గేమ్స్ సిరీస్‍కు డైరెక్టర్‌గా చేశారు. కంట్రోల్ చిత్రాన్ని సైబర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.
కంట్రోల్ సినిమా షూటింగ్‍ను అనన్య పాండే గతేడాదే పూర్తి చేసుకున్నారు. దర్శకుడు విక్రమాదిత్యకు థ్యాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే, షూటింగ్ పూర్తయి చాలా కాలమైన ఈ మూవీ రిలీజ్ కాలేదు. ఇప్పుడు నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకే వస్తోంది.
అనన్య పాండే ప్రస్తుతం శంకర అనే బాలీవుడ్ సినిమా చేస్తున్నారు. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్‍తో కలిసి ఈ మూవీలో లీడ్ రోల్ చేస్తున్నారు. బ్రిటీష్ పాలన కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍తో డైరెక్టర్ కరణ్ సింగ్ త్యాగీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సాగుతోంది.
ఫిర్ అయీ హసీన్ దిల్‍రూబా
ఫిర్ అయీ హసీన్ దిల్‍రూబా సినిమా ఆగస్టు 9వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్ తాప్సీ పన్ను, యంగ్ హీరో విక్రాంత్ మాసే, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సీక్వెల్ మూవీకి జైప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా అనిపించింది. ఫిర్ అయీ హసీన్ దిల్‍రూబా మూవీని కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ నిర్మించాయి. ఆగస్టు 9 నుంచి ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.