Custody Twitter Review: కస్టడీ ట్విట్టర్ రివ్యూ - నాగచైతన్యకు తమిళ దర్శకుడు హిట్ ఇచ్చాడా?
12 May 2023, 7:10 IST
Custody Twitter Review: నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ మూవీ శుక్రవారం (నేడు) థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే...
నాగచైతన్య
Custody Twitter Review: నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ మూవీ శుక్రవారం (నేడు) థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ ద్విభాషా చిత్రంతోనే నాగచైతన్య తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా అరవింద్‌స్వామి, శరత్‌కుమార్, ప్రియమణి కీలక పాత్రలను పోషించారు. కస్టడీ ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉంది? ఈ సినిమాతో నాగచైతన్య తెలుగుతో పాటు తమిళంలో విజయాన్ని అందుకున్నాడా? లేదా? అన్నది చూద్దాం...
సోషల్ థ్రిల్లర్...
సోషల్ థ్రిల్లర్ కథాంశాలతో గతంలో తమిళంలో పలు సినిమాల్ని తెరకెక్కించాడు దర్శకుడు వెంకట్ ప్రభు. కస్టడీ కోసం అదే రూట్‌ను ఫాలో అయినట్లు చెబుతోన్నారు. తమ అధికారాన్ని నిలుపుకోవడం కొందరు నాయకులు చేసే అక్రమాల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు పేర్కొంటున్నారు.
ఇందులో శివ అనే కానిస్టేబుల్‌గా నాగచైతన్య యాక్టింగ్ బాగుందని అంటున్నారు. అయితే కథలో బలం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెయిన్ పాయింట్‌లోకి వెళ్లడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకోవడంతో ఫస్ట్ హాఫ్ పూర్తిగా బోర్ కొట్టిస్తుందని ఓవర్‌సీస్ ఆడియెన్స్ పేర్కొంటున్నారు.
సెకండాఫ్ చాలా స్లోగా సాగుతుందని, క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ముగించినట్లు చెబుతోన్నారు. ఇళయరాజా అందించిన పాటలు ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయని అంటున్నారు. పాటల ప్లేస్‌మెంట్ సరిగా లేదని ట్వీట్స్ చేస్తున్నారు. రిపీటెడ్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకోవని, నాగచైతన్య, కృతిశెట్టి లవ్ ట్రాక్‌ను దర్శకుడు సరిగా రాసుకోలేదని కామెంట్స్ వినిపిస్తోన్నాయి.
ట్విస్ట్‌లు మిస్...
కస్టడీ కోసం ఎంచుకున్న మెయిన్ పాయింట్ బాగున్నా ఎగ్జిక్యూషన్‌లోనే దర్శకుడు తడబడినట్లు చెబుతోన్నారు.నాగచైతన్యతో పాటు అరవింద్‌స్వామి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ బాగున్నాయని అభిప్రాయపడుతోన్నారు. అయితే అరవింద్ స్వామి స్క్రీన్ ప్రజెన్స్ తక్కువగా ఉండటం మైనస్‌గా మారిందని అంటున్నారు. ట్విస్ట్‌లు లేకుండా ఫ్లాట్ నరేషన్ తో దర్శకుడు సినిమాను తెరకెక్కించాడని, థ్రిల్లింగ్ మూవ్‌మెంట్స్ సినిమాలో పెద్దగా లేవని ఓవర్‌సీస్ ఆడియెన్స్ చెబుతోన్నారు.