Sapthagiri: కట్న కానుకలుగా మూడింతలు లాభాలు రాబోతున్నాయి.. కమెడియన్ సప్తగిరి కామెంట్స్
24 October 2024, 15:35 IST
Sapthagiri About Laggam Producer In Pre Release Event: కమెడినయ్ సప్తగిరి నటించిన లేటెస్ట్ తెలుగు చిత్రం లగ్గం. తాజాగా జరిగిన లగ్గం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమెడియన్ సప్తగిరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కట్న కానుకలుగా మూడింతలు లాభాలు రానున్నాయి అని చెప్పాడు సప్తగిరి. పూర్తి వివరాల్లోకి వెళితే..
కట్న కానుకలుగా మూడింతలు లాభాలు రాబోతున్నాయి.. కమెడియన్ సప్తగిరి కామెంట్స్
Comedian Sapthagiri Comments: టాలీవుడ్ యంగ్ హీరో సాయి రోనక్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం లగ్గం. ఈ సినిమాలో సాయి రోనక్‌కు జంటగా కొత్త హీరోయిన్ ప్రగ్యా నగ్ర నటిస్తోంది. అలాగే, నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి రోహిణి, కమెడియన్ సప్తగిరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మణిశర్మ సంగీతం
లగ్గం చిత్రాన్ని సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిగా.. వేణుగోపాల్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. లగ్గం సినిమాకు డైరెక్టర్ రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న లగ్గం చిత్రానికి బాల్ రెడ్డి కెమెరా వర్క్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా లగ్గం ట్రైలర్‌ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
సాఫ్ట్‌వేర్ సంబంధాలు
సాఫ్ట్‌వేర్ సంబంధాలు, వ్యవసాయం, నేపథ్యంలో లగ్గం మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక లగ్గం చిత్రం అక్టోబర్ 25న గ్రాండ్‌గా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా లగ్గం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి హీరో హీరోయిన్లతోపాటు రాజేంద్ర ప్రసాద్, సప్తగరి, రోహిణి, నిర్మాత, దర్శకుడు ఇతర టెక్నిషియన్స్ హాజరు అయ్యారు.
25 ఏళ్లు వెలుగుతారు
లగ్గం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ.. "నిర్మాత వేణు గోపాల్ రెడ్డి గారు ఇలాంటి సాంప్రదాయ బద్ధమైన సినిమాతో మన ముందుకు వచ్చారు. లగ్గం చిత్రం ద్వారా ఆయనకి మూడింతలు లాభాలు కట్న కానుకలుగా రాబోతున్నాయి. రమేశ్ చెప్పాల లాంటి రచయిత, దర్శకుడు టాలీవుడ్‌కి చాలా అవసరం. లగ్గం చిత్రం తర్వాత ఆయన 25 ఏళ్లు టాలీవుడ్ లో వెలుగు వెలుగుతారు" అని ప్రశంసించారు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ
"లగ్గం సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే 2024 నేషనల్ అవార్డ్ విన్నర్ ఈ మూవీ. అలాగే, నేషనల్ అవార్డే కాదు వరల్డ్ వైడ్‌గా ఎన్ని అవార్డ్స్ ఉన్నాయో అన్ని గెలుచుకునే గొప్ప సినిమా. అలాగే డబ్బులు కూడా వచ్చే సినిమా. కాబట్టి, కచ్చితంగా 25వ తేది నాడు ఇది మీ సినిమాగా భావించి.. మీ ఇంట్లోని ఎమోషన్స్ అన్ని ఇందులో ఉంటాయి కాబట్టి.. మధ్యతరగతి వాళ్ల మనసును కదిలించే లగ్గం మూవీకి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను" అని సప్తగిరి తన స్పీచ్ ముగించారు.
మంచి మెసేజ్‌ను అందంగా
ఇదే లగ్గం ప్రీ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. "ఎంతో మంది కలసి పనిచేస్తే ఒక సినిమా పూర్తవుతుంది. లగ్గం చిత్రంతో ఒక మంచి మెసేజ్‌ని అందంగా చెప్పాలని అనుకున్నాం. ఆ విషయంలో దర్శకుడు రమేష్ చెప్పాల సక్సెస్ అయ్యారు. ఇంత మంచి చిత్రాన్ని తెరకెక్కించిన మా దర్శకుడు రమేష్ గారికి కృతజ్ఞతలు" అని తెలిపారు.
ఎలాంటి స్కిన్ షో లేకుండా
తెలంగాణ వుమెన్ కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారదా మాట్లాడుతూ.. "స్కిన్ షో చేస్తేనే సినిమా ఆడుతుంది అని భావించే రోజుల్లో.. ఎలాంటి స్కిన్ షో లేకుండా ఇంత మంచి సినిమా తీశారు. లగ్గం లాంటి చిత్రాలని ఆడియన్స్ ప్రోత్సహించాలి. అప్పుడే మార్పు మొదలవుతుంది" అని ఆమె వెల్లడించారు.