తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chaurya Paatam Teaser: “బాహుబలి కూడా రిస్కే.. కానీ దాని రిజల్ట్”: ఫన్నీగా ‘చౌర్యపాఠం’ మూవీ టీజర్: చూసేయండి

Chaurya Paatam Teaser: “బాహుబలి కూడా రిస్కే.. కానీ దాని రిజల్ట్”: ఫన్నీగా ‘చౌర్యపాఠం’ మూవీ టీజర్: చూసేయండి

10 February 2024, 15:09 IST

google News
    • Chaurya Paatam Teaser: చౌర్యపాఠం సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ హీస్ట్ కామెడీ మూవీ టీజర్ సరదాగా, ఆసక్తికరంగా ఉంది. బాహుబలి, జేమ్స్ బాండ్ సినిమాల రిఫరెన్స్ డైలాగ్‍లు కూడా ఉన్నాయి.
Chaurya Paatam Teaser: “బాహుబలి కూడా రిస్కే.. కానీ దాని రిజల్ట్”: ఆసక్తికరంగా, ఫన్నీగా ‘చౌర్యపాఠం’ మూవీ టీజర్
Chaurya Paatam Teaser: “బాహుబలి కూడా రిస్కే.. కానీ దాని రిజల్ట్”: ఆసక్తికరంగా, ఫన్నీగా ‘చౌర్యపాఠం’ మూవీ టీజర్

Chaurya Paatam Teaser: “బాహుబలి కూడా రిస్కే.. కానీ దాని రిజల్ట్”: ఆసక్తికరంగా, ఫన్నీగా ‘చౌర్యపాఠం’ మూవీ టీజర్

Chaurya Paatam Movie: ధమాకా మూవీతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారారు. 'చౌర్య పాఠం' పేరుతో హీస్ట్ కామెడీ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి తెరకెక్కిస్తున్నారు. త్రినాథ రావు నిర్మిస్తుండటంతో ఈ చిత్రంపై బజ్ బాగానే ఉంది. ఈ సినిమాలో ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చౌర్య పాఠం సినిమా టీజర్ నేడు (ఫిబ్రవరి 10) రిలీజ్ అయింది.

ఓ గ్రామీణ బ్యాంకులో చోరీ చేసేందుకు ఓ గ్యాంగ్ చేసే ప్రయత్నం చుట్టూ ‘చౌర్య పాఠం’ కథ సాగుతుందని టీజర్లో రివీల్ అయింది. ఇంద్ర రామ్, అతడి గ్యాంగ్ బ్యాంక్‍లో దోపిడీ చేసేందుకు.. ఆ గ్రామంలో డాక్యుమెంటరీ తీస్తామంటూ అందరినీ నమ్మిస్తుంటారు. మరోవైపు, బ్యాంకును కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తుంటారు.

డాక్యుమెంటరీ తీస్తామని గ్రామస్థులను నమ్మించాలని, వాకీటాకీల్లో మాట్లాడుకోవాలని, కోడ్ భాషలోనే మాట్లాడుకోవాలంటూ ప్లాన్ చేసుకుంటారు ఈ గ్యాంగ్. “మన ఆయుధాలు.. మనకే కనపడాలి. మనం దాచే విధానం చూస్తే జేమ్స్ బాండ్‍కు కూడా ఫ్యూజులు ఎగిరిపోవాలి” అని రామ్ చెప్పే డైలాగ్ ఉంది. ‘ఈ బ్యాంక్ చోరీ బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ ప్లాన్‍లా ఉంది.. రిస్క్ ఏమో’ అని తన ఫ్రెండ్ అంటే.. “బాహుబలి కూడా రిస్కేరా.. కానీ దాని రిజల్ట్” అనే డైలాగ్ చెబుతాడు ఇంద్ర. ఇలా, జేమ్స్ బాండ్, బాహుబలి రిఫరెన్సులను టీజర్‌లో వాడేసుకున్నారు. టీజర్లో రాజీవ్ కనకాల కూడా కనిపించారు.

చౌర్యపాఠం టీజర్ అంతా ఎంటర్‌టైనింగ్‍గా, ఫన్నీగా సాగింది. డైలాగ్‍లు కూడా క్రిస్ప్‌గా ఉన్నాయి. డేవ్ జండ్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. టీజర్‌తో ఈ మూవీ ఇంట్రెస్ట్ పెంచింది. నక్కిన నరేటివ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని త్రినాథ రావు నక్కిన నిర్మించారు.

ధమాకా కాంబో..

ధమాకా (2022) సినిమాకు త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చేశారు. అయితే, చౌర్యపాఠం చిత్రానికి నక్కిన నిర్మాత కాగా.. సినిమాటోగ్రఫీతో పాటు కథ కూడా అందించారు కార్తీక్ ఘట్టమనేని. టీజర్ చూస్తుంటే కథ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో పాటు క్యారెక్టర్ల డిజైన్ కూడా మెరుగ్గా కనిపిస్తోంది. ఇటీవలే రవితేజ హీరోగా నటించిన ఈగల్ మూవీకి కూడా కార్తీక్ దర్శకత్వం వహించారు.

చౌర్యపాఠం చిత్రానికి నిఖిల్ గొల్లమారి డైరెక్షన్ చేశారు. టీజర్లో చూస్తుంటే అతడి టేకింగ్ కూడా ఫ్రెష్‍గా కనిపిస్తోంది. ముఖ్యంగా కామెడీనే ఈ చిత్రంలో ప్రధానంగా ఉండనుంది. ఈ చిత్రానికి డేవ్ జంద్ సంగీతం అందించారు.

చౌర్యపాఠం చిత్రంలో ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించగా.. రాజీవ్ కనకాల, సలీమ్ ఫేకు కీరోల్స్ చేశారు. ఈ మూవీ రిలీజ్ డేట్‍ను ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో విడుదల కానుందంటూ టీజర్లో మేకర్స్ పేర్కొన్నారు.

త్రినాథరావు నక్కిన నిర్మిస్తుండటం, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని కథతో యంగ్ యాక్టర్లతో రానున్న చౌర్య పాఠం మూవీ టీజర్‌తో అంచాలను పెంచేసింది. ఈ మూవీతో నిఖిల్ గొల్లమారి దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. అతడి టేకింగ్ మెరుగ్గా కనిపిస్తోంది. మరి, ఈ చిత్రం థియేటర్లలో అంచనాలను నిలబెట్టుకుంటుందేమో చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం