Telugu News  /  Entertainment  /  Ravi Teja Dhamaka Ott Release Date Fix When And Where To Watch
ధమాకా ఓటీటీ రిలీజ్ డేట్
ధమాకా ఓటీటీ రిలీజ్ డేట్

Dhamaka OTT Release Date: రవితేజ ధమాకా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

11 January 2023, 13:44 ISTMaragani Govardhan
11 January 2023, 13:44 IST

Dhamaka OTT Release Date: రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

Dhamaka OTT Release Date: మాస్ మహారాజా రవితేజ గతేడాది 'ధమాకా'తో సాలిడ్ హిట్ అందుకున్నారు. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా రవితేజ పర్ఫార్మెన్స్, శ్రీలీల అందానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫలితంగా ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. రవితేజ కెరీర్లోనే అత్యధికంగా రూ.100 కోట్ల మార్కును అందుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ వేదికగా ఎప్పుడు విడుదలవుతుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ గురించి క్లారిటీ వచ్చింది. ధమాకా చిత్రం ఓటీటీలో జనవరి 22న విడుదల కానున్నట్లు నెట్టింట ఓ వార్త హల్చల్ చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ధమాకా మూవీ ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. విడుదలైన నెల రోజుల్లోనే ధమాకా ఓటీటీలో రాబోతుందన్న వార్త తెలిసిన రవితేజ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

రొటీన్ స్టోరీ లైనే అయినప్పటికీ రవితేజ తనదైన పర్ఫార్మెన్స్‌తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లతో వసూళ్ల వర్షం కురిసింది. మాస్ మహారాజా కెరీర్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. గతేడాది రవితేజ నటించిన మూడు చిత్రాలు విడుదల కాగా.. ఇది మినహా మిగిలిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ధమాకా మాత్రం అద్భుతమైన వసూళ్లతో క్రాక్ తర్వాత రవితేజకు ఆ రేంజ్ హిట్ లభించింది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ధమాకా సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా పనిచేశాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇంకా థియేటర్లలో నడుస్తూనే ఉంది.