తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi October 26th Episode: బ్రహ్మముడి- బకరా అయిన రాజ్- కనకం ప్లాన్ ఫెయిల్- కావ్యపై పందెం- మేనేజర్‌గా ఆఫీస్‌కు రాజ్

Brahmamudi October 26th Episode: బ్రహ్మముడి- బకరా అయిన రాజ్- కనకం ప్లాన్ ఫెయిల్- కావ్యపై పందెం- మేనేజర్‌గా ఆఫీస్‌కు రాజ్

Sanjiv Kumar HT Telugu

26 October 2024, 8:02 IST

google News
  • Brahmamudi Serial October 26th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 26 ఎపిసోడ్‌లో ఇంట్లోవాళ్లు రూట్ మార్చారని గ్రహించిన రాజ్ తాను రూట్ మార్చి కూరగాయలకు వెళ్తాడు. అక్కడ రాజ్‌కు ఎక్కువ ధరలు చెప్పి బకరాను చేస్తాడు కూరగాయల అతను. కనకం వచ్చి చెప్పిన వినిపించుకోడు. ఆఫీస్‌కు వెళ్లమని కనకం అంటే రాజ్ ఒప్పుకోడు.

బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 26 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 26 ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 26 ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో తనను ఆఫీస్‌కు పంపించాలని అందరూ బతిమిలాడుకుంటున్నారు అనుకుని పలకరిస్తాడు రాజ్. కానీ, ఎవరు దాని గురించి మాట్లాడరు. తండ్రి దగ్గరికి వెళ్లి నన్ను ఏదో అడగాలని అనుకుంటున్నారు కదా అని రాజ్ అంటే.. అవునురా. కానీ నువ్వు ఒప్పుకుంటావో లేదో అని సుభాష్ అంటాడు.

నేను ఒప్పుకోను. మీరు చెప్పేది నేను ఒప్పుకోను అని రాజ్ అంటే.. కారు సర్వీసింగ్‌కు ఇచ్చాను. నీ కారు తీసుకెళ్తాను. ఎందుకు ఒప్పుకోవు అని సుభాష్ అంటాడు. వాడు ఒప్పుకునేదేంటీ అన్నయ్య వాడికేమైనా పనా పాట అని ప్రకాశం పంచ్ వేస్తాడు. నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా. ఎలా ఉండేవాడివి పని లేకుండా ఎలా అయిపోయావ్ అని ఇందిరాదేవి కావాలనే అంటుంది. ఇంతలో రాజ్ అంటూ అపర్ణ వస్తుంది.

రూట్ మార్చారా..

మమ్మీ కచ్చితంగా అడుగుతుంది అని మమ్మీ నువ్ ఏం అడగాలని అనుకుంటున్నావో నాకు తెలుసు మమ్మీ అని రాజ్ అంటాడు. హో తెలుసా. కూరగాయలు తీసుకురమ్మని చెప్పాలనుకుంటుంది నీకెలా తెలుసు. కావ్యకు దడుసుకుని ఆఫీస్‌కు ఎలాగు వెళ్లట్లేదు. కాబట్టి ఇంటి పనులు అయినా చేస్తావని అని అపర్ణ అంటుంది. హో.. మీరు రూట్ ఇలా మార్చారా. ఇంట్లో ఉంటే పని చెబుతారని చచ్చినట్లు ఆఫీస్‌కు వెళ్తాననే కదా మీ ప్లాన్. మారుస్తా.. నేను కూడా రూట్ మారుస్తా అని రాజ్ అనుకుంటాడు.

కూరగాయలు తీసుకొస్తా.. ఏం కూరగాయలు కావాలో లిస్ట్ చెప్పండి అని రాజ్ అంటాడు. దాంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఏంటీ అంతా షాక్ అయ్యారు. ఇంట్లో పనిపాట లేకుండా ఉన్నాను కదా. చెప్పండి అని రాజ్ అంటాడు. వాడికేం తెలుసు పుచ్చులు, చచ్చులు తెస్తాడు అని ఇందిరాదేవి అంటుంది. నేను ఏదైనా పర్ఫెక్ట్‌గా తెస్తాను. చూడు అంటాడు. లిస్ట్ రాసుకుంటూ ఆయిల్ రెండు కేజీలు అంతేగా అని రాజ్ అంటాడు.

ఆయిల్‌ను లీటర్స్‌లో కొలుస్తారని ఇందిరాదేవి చెబుతుంది. కారు లేదని, నడుచుకుంటూ వెళ్లమని అపర్ణ అంటుంది. దాంతో రాజ్ వెళ్లిపోతాడు. తర్వాత రాజ్ కూరగాయలకు బయలుదేరాడని కనకంకు కాల్ చేసి చెబుతుంది అపర్ణ. నేను ఇక్కడే ఉన్నాను అని కనకం చెబుతుంది. మరోవైపు ఆఫీస్‌కు కావ్య ఆటోలో వెళ్తుంది. మేనేజర్ వచ్చి గుడ్ మార్నింగ్ చెబుతాడు. సెల్యూట్ కూడా సరిగ్గా చెప్పడం రాదా. నువ్ చేసిన తప్పు వల్లే నీకు ఈ శిక్ష పడింది. ఇప్పటికైనా నిజాయితీగా పనిచేయు అని కావ్య అంటుంది.

ఆఫీస్‌లో పందెం

నిజాయితీగా చేయడానికి నేనేమైనా మేనేజర్‌నా. సెక్యూరిటీ గార్డ్‌ను. అందరికీ సెల్యూట్ పెడితే సరిపోతుంది అని అతను అంటాడు. నీకు సెక్యురిటీ గార్డ్ అంతా చీప్ అయిపోయిందా. కంపెనీని కాపాడేది వాళ్లే. సరిగ్గా చేయకుంటే బాత్రూమ్ క్లీన్‌కు పంపిస్తా అని కావ్య వెళ్లిపోతుంది. ఈమె నాపై పగ తీర్చుకుంది కానీ, కక్ష మాత్రం పోలేదు అని అతను అనుకుంటాడు. మరోవైపు రాజ్, కావ్యలో ఎవరు వస్తారో పందెం వేసుకుంటారు శ్రుతి, ఇతర స్టాఫ్. కావ్యపై పందెం కడుతుంది శ్రుతి.

అప్పుడే కావ్య వస్తుంది. అది చూసిన స్టాఫ్ షాక్ అవుతారు. దాంతో కావ్య గట్టిగా క్లాస్ పీకుతుంది. తర్వాత రాజ్ రావడం గురించి శ్రుతితో మాట్లాడుతుంది కావ్య. తర్వాత అర్జంట్‌గా మీటింగ్ అరెంజ్ చేయమని, తమ కంపెనీ వద్దనుకుని వెళ్లిన వాళ్లతో మాట్లాడాలి అని, కాల్ చేసి అందరికీ చెప్పమని శ్రుతికి చెబుతుంది కావ్య. తర్వాత అపర్ణకు కాల్ చేస్తుంది కావ్య. చెప్పండి సీఈఓ గారు అని అపర్ణ అంటే.. ఎందుకంత వెటకారం అని కావ్య అంటుంది.

నిజమే కదా అని ఇందిరాదేవి అంటుంది. మీరు తప్పు చేస్తున్నారేమో అత్తయ్య. ఆయన బాధపడుతున్నారు కదా అని కావ్య అంటుంది. అలా అని నిందలు మోస్తావా. నిన్ను చేసింది ఇలా బాధపడటానికి కాదు. రాజ్ వస్తాడు. తప్పకుండా వస్తాడు. వచ్చాకా నీ నిందలు పోగొట్టుకుందువు. అదంతా ఆలోచించడం మానేసి ఆఫీస్ గురించి ఆలోచించు అని ఇందిరాదేవి అంటుంది. చూశారా అత్తయ్య నా కోడలు ఎంత పిచ్చిదో. అంత అవమానించినా వాడి గురించే ఆలోచిస్తుందని అపర్ణ అంటుంది.

డబ్బున్న అమాయకుడు

అందుకేగా వాడు అంతలా రెచ్చిపోతున్నాడు అని ఇందిరాదేవి అంటుంది. కొడుకు అని జాలి చూపించకూడదు. వాడిని ఇంతకింతకు టార్చర్ చేద్దాం అని అపర్ణ అంటే.. ఆల్రెడీ అక్కడ కనకం మొదలుపెట్టే ఉంటుంది అని ఇందిరాదేవి అంటుంది. కూరగాయల వ్యక్తి దగ్గరికి వచ్చి వ్యాపారం ఎలా ఉందని తెలుసుకుంటాడు. గుమ్మడికాయ ఎంత అంటే వంద రూపాయలను అతను చెబుతాడు. ఇంత చిన్న ఆపిల్‌కే 50 తీసుకుంటే అంత పెద్ద గుమ్మడికాయకు వందేనా. రెండు వందలు అయినా తీసుకోవాలి. లేకుంటే హర్ట్ అవుతాను అని రాజ్ అంటాడు.

అదంతా విన్న కనకం షాక్ అవుతుంది. వీడెవడో డబ్బున్న అమాయకుడిలా ఉన్నాడు. ఈరోజు నా పంట పడినట్లే అనుకున్న కూరగాయల వ్యక్తి నిజమే బాబు. మా ఆవిడ చెప్పింది. మీలాంటి దొరబాబులకు తక్కువ చెప్పాను. గుమ్మడి కాయ రెండు వందలే అని అతను అంటాడు. టమాటలు ఎంత అంటే.. ఇంతకుముందు వందకు నాలుగు కిలోలు ఇచ్చాం. ఇప్పుడు నాలుగు వందలకు ఒక కిలో ఇస్తున్నాం. మీకు కాబట్టి 350కే ఇస్తాను అని అతను చెబుతాడు.

దాంతో కనకం చాలా షాక్ అవుతుంది. అలా తెలిసినవాళ్లు అని ధర తక్కువ చేయొద్దు. నేను కూడా 400 ఇస్తాను అని రాజ్ అంటాడు. పుచ్చులు చచ్చులు లేకుండా స్కాన్ చేసి కూరగాయలని తీసుకెళ్లాలి. అది చూసి ఇంట్లోవాళ్లు అదిరిపోవాలి అని రాజ్ అంటే.. బాబు గారు చాలా బిజీగా ఉంటారని అనుకున్నాను. పాపం పనిపాట ఏం లేకుండా బాగా ఖాళీగా ఉన్నారన్నమాట అని కూరగాయల అతను అంటాడు. నువ్ కూడా అదే మాట అని అవమానంగా ఫీల్ అవుతాడు రాజ్.

భలే బకరా దొరికాడు

దాంతో అతను మాట మార్చేస్తాడు. లిస్ట్‌లో ఉన్నవన్నీ రాజ్ తీసుకుంటాడు. మొత్తం బిల్ ఎంత అయింది అని అడిగితే.. 6200 అయింది. 6 వేలు ఇవ్వండి చాలు అని అతను అంటాడు. అంతేనా.. ఇంత చవకా అని రాజ్ అంటాడు. 600 కూరగాయలకు 6 వేలు వస్తున్నాయి. భలే బకరా దొరికాడు అని కూరగాయల అతను అనుకుంటాడు. అదంతా చూసి షాక్ అయిన కనకం వెళ్లి ఆపుతుంది. బిల్ ఎంతయిందిరా అని కనకం అడుగుతుంది.

ఆరు వందలు కూడా చేయని వాటికి పదిరెట్లు వేస్తావా. పనిపాట లేకుండా ఖాళీగా ఉండి ఏరికోరి తీసుకుంటే ఇలా చేస్తావా అని కనకం అంటే రాజ్ కోప్పడుతాడు. మధ్యలో అదెందుకు అంటాడు. వీడు మిమ్మల్ని మోసం చేశాడు అని కనకం అంటే.. మీరేం చేశారు క్యాన్సర్ కనకం గారు అని రాజ్ అంటాడు. నిజమే బాబు ఆ తప్పు నేనే చేశాను. కానీ, నా కూతురు చేయలేదు అని కనకం అంటే.. మిమ్మల్ని మీ కూతురుని జన్మలో నమ్మను అని రాజ్ అంటాడు.

ఉల్లిపాయ, గుమ్మడికాయ, ఎలక గురించి చెబుతూ సెంటిమెంట్ డైలాగ్ కొడుతుంది కనకం. ఆఫీస్‌కు వెళ్లండి అని కనకం అంటుంది. చచ్చినా వెళ్లను. నీ కూతురు, మీరు ఉన్నచోటికి రాను అని కూరగాయల అతనికి ఆరు వేలు ఇస్తాడు రాజ్. మీరు చెప్పింది నమ్మను అని చెప్పడానికే అని రాజ్ అంటాడు. రోజు రండని అతను అంటే.. పళ్లు రాలతాయ్. రోజు వచ్చి బకరాను అవుతానా. పంతానికి పోయి ఇచ్చాను అంతే అని రాజ్ వెళ్లిపోతాడు.

ఆఫీస్‌కు వెళ్తానన్న రాజ్

మరోవైపు కావ్య దగ్గరికి వచ్చిన శ్రుతి పాత క్లైంట్స్‌కు కాల్ చేసి మీరు చెప్పింది చెప్పాను. కానీ, వాళ్లెవరు కలవాలని లేదని చెప్పారు. వాళ్లకు మన మీద నమ్మకం లేదంటున్నారు. మనతో బిజినెస్ చేయమని గట్టిగా చెప్పారు అని శ్రుతి అంటుంది. ఇంతలోనే కావ్యకు అనామిక కాల్ చేస్తుంది. నిన్ను ఓడించడమే నా పని. నీ కంపెనీ క్లైంట్స్‌ను నేను లాక్కున్నాను. వాళ్లు మీటింగ్‌కు రాము అన్నారు. ఊహల్లోంచి బయటకు రా కావ్య అని అనామిక అంటుంది.

పెళ్లానికి భయపడి ఇంటికే పరిమితి అయితే దుగ్గిరాల వారసుడిని లోకం కోడైకూస్తుందిరా అని ఇందిరాదేవి అంటుంది. కావ్య అంటే భయపడుతున్నావు కదా అని అపర్ణ అంటే.. రాహుల్‌లా ఎప్పటికీ ఇంట్లోనే ఉంటావా అని స్వప్న అంటుంది. ఆపండి.. ఇప్పుడేంటీ నేను ఆఫీస్‌కు వెళ్లాలి అంతే కదా. వెళ్తాను.. ఆ కళావతి కంటే ఎందులోను తక్కువ కాదని, ఎక్కువే అని నిరూపిస్తాను అని రాజ్ అంటాడు. దాంతో అంతా సంతోషిస్తారు. ఆఫీస్‌కు వెళ్లి అనామిక సమస్యను రాజ్ తీర్చుతాడని తెలుస్తోంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం