Brahmamudi October 17th Episode: బ్రహ్మముడి- కొంపముంచిన బంటి- బయటపడిన కనకం నాటకం, మొదటికే మోసం- ముక్కలైన కావ్య కాపురం
17 October 2024, 8:53 IST
Brahmamudi Serial October 17th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 17వ తేది ఎపిసోడ్‌లో దాంపత్య వ్రతంలో తన భార్యగా వచ్చి కూర్చోవాలని, అది మనస్ఫూర్తిగా చెబుతున్నట్లు కావ్యతో రాజ్ అంటాడు. కానీ, కనకం డ్రామా బయటపెట్టి రాజ్ కావ్యను విడగొడుతుంది రుద్రాణి. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 17వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్‌లో దాంపత్య వ్రతానికి తన గౌరవం పక్కన పెట్టి కావ్యను ఒప్పించలేను అని రాజ్ అంటాడు. అవును బాబు మీరు మాత్రం ఏం చేయగలరు. నా రాత అలా ఉంది. ముగ్గురు కూతుళ్లు వ్రతం చేస్తే చూసి కన్ను మూయాలన్న నా కల కలగానే నా కళ్ల ముందు కదలాడుతుంది అని దగ్గుతుంది కనకం.
ఏం అనకుండా ఉండేలా
కనకం ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు పడిపోయిన రాజ్ మీరు బాధపడకండి అత్తయ్య. మీ కూతురుని నేను ఒప్పించి తీసుకొస్తాను. మీరు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. సంతోషమే సగం బలం అన్నారు. సంతోషంగా ఉండండి అని వెళ్లిపోతాడు రాజ్. వీడు కాస్తా కరిగినట్లు ఉన్నాడు. మళ్లీ కావ్య ఇగోకి పోతే గడ్డకట్టుకుని పోతాడు. కావ్య ఇగోకి పోయిన ఏం అనకుండా ఉండేలా వీడిని ప్రిపేర్ చేద్దాం అని అపర్ణ, ఇందిరాదేవి అనుకుంటారు.
మీ అత్తగారి పరిస్థితి చూస్తుంటే గుండె చెరువు అవుతుందిరా. దాంపత్య వ్రతానికి కూర్చోరా అని అపర్ణ అంటుంది. నేను కూర్చోను అన్నాన. కావ్యనే నిల్చోను అని కూడా అంటోంది అని రాజ్ అంటాడు. కావ్య అమాయకురాలురా. కన్నతల్లి కడసారి కోరిక అని తెలియక అలా చేస్తోంది. లేకుంటే ముందే వచ్చేది అని ఇందిరాదేవి అంటుంది. కావ్య మన ఇంటి కోడలిరా మనం కావ్యను పూజించాలి. కావ్యను నువ్ ఒప్పించాలి అంటే నువ్ మాట్లాడాలి అని అపర్ణ అంటుంది.
అటు చూడు సంతోషంగా ఉన్నట్లు కనకం ఎంతలా నటిస్తుందో. మీ అత్తగారి చివరి కోరిక నెరవేర్చడానిక ఈ ఒక్కరోజు కాస్తా తగ్గితో పోయేదేముంది. ఓ నిండు ప్రాణం తృప్తిగా పోతుంది అని అపర్ణ అంటుంది. యెస్ మమ్మీ కావ్యను నేను ఒప్పిస్తా. నేను నొచ్చుకున్న కావ్యను ఒప్పిస్తాను అని రాజ్ అంటాడు. కనకంతో మాట్లాడుతున్న కావ్యను నీతో మాట్లాడాలి రా అని బలవంతంగా తీసుకెళ్తాడు రాజ్. తర్వాత కనకంతో నా కొడుకు ఒప్పిస్తాడు. నీ కూతురే ఎక్కువ చేస్తుంది. మా ఇంటికి రాని చెబుతా అని అపర్ణ అంటుంది.
తిక్కల్దానా ఆగవే
మీ ఇంటికి అయితే రానివ్విండి. ఆ తర్వాత మీ ఇష్టం అని కనకం అంటుంది. చేయి వదలండి. ఆరోజు గుడిలో చేయి తాకితేనే తేళ్లు జలగలు పారినట్లు ఉందన్నారు అని కావ్య అంటే.. వసుదేవుడు అంతటివాడే గాడిద కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందట. నేను నీ చేయి పట్టుకుంటే ఏంటీ అని రాజ్ అంటాడు. రాజ్ అన్నదానికి కావ్య కోపంగా వెళ్లిపోతుంటే చేయి పట్టుకుంటాడు. తిక్కల్దానా ఆగవే. అటు ఇటు పోతావేంటే అని రాజ్ అంటాడు.
కావ్య సెటైర్ వేస్తుంది. నీకు నాకు మధ్య ఏదైనా ఉంటే ఎక్కడికైనా వెళ్లి తేల్చుకుందాం అని రాజ్ అంటాడు. ఎక్కడికి వెళ్దాం. ఊటికా, కొడైకెనాల్‌కా.. బూతు బంగ్లాకే కదా అని కావ్య అంటుంది. ఇదంతా అపర్ణ, కనకం, ఇందిరాదేవి వింటుంటారు. ఛీ ఛీ.. అంటూ షాక్ అవుతారు. నేను ఎక్కడికి రాను అని కావ్య అంటుంది. సరే, ఇప్పుడు దాంపత్య వ్రతానికి వచ్చి కూర్చుంటావా లేదా అని రాజ్ అడుగుతాడు. దాంపత్య వ్రతంలో దంపతులే కూర్చుంటారు. మీతో నాకు సంబంధం లేదని మీరే చెప్పారు కదా అని కావ్య అంటుంది.
మీ అమ్మ ముగ్గురు కూతుళ్లు కలిసి వ్రతం చేయాలని అనుకుంటుంది అని రాజ్ అంటాడు. అది మా అమ్మతో మాట్లాడుకుంటా. కట్టుబట్టలతో నేను వచ్చినప్పుడు ఇలాంటి కోరికలు ఎలా కోరుకుంటుందో అని కావ్య అంటుంది. నన్నేమైనా అను. అత్తగారిని ఏమనకు అని రాజ్ అంటాడు. దాంతో కనకం మురిసిపోతుంది. ఇదెప్పటి నుంచి పాము పడగంటే పగ.. తోక అంటే చుట్టమా అని కావ్య అంటుంది. చూడు పాము మనం ఆర్గ్యుమెంట్ చేసుకునే సమయం కాదు అని రాజ్ అంటాడు.
రుబ్బురోలులా గుండ్రంగా
అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు. నాకు తెలియాలి అని కావ్య అంటుంది. అవన్నీ చెప్పలేను అని రాజ్ మొత్తుకుంటాడు. అయితే, నాకు క్లారిటీ వచ్చేదాకా ఒప్పుకోలేను అని కావ్య అంటుంది. ఒసేయ్.. మీ అమ్మా.. అని ఆగిపోతాడు రాజ్. ఏంటీ మా అమ్మ.. మా అమ్మకు ఏమైంది.. మా అమ్మ కోసం చేస్తున్నారా ఇదంతా అని కావ్య అడుగుతుంది. మీ అమ్మకు ఏమైంది. రుబ్బురోలులా గుండ్రంగా ఉంది అని రాజ్ అంటాడు. ఛీ ఛీ అదేం పోలిక. ఏంటీ ఏదోదో మాట్లాడుతున్నారు అని కావ్య అంటుంది.
ఈ ఒక్కసారికి అన్ని దులిపేసుకుని రా.. ఇంకోసారి దులిపేసుకుని రావాల్సిన అవసరం లేదు. నా మనసు ఎంత విశాలమైందో తెలుస్తుంది అని రాజ్ అంటే.. ఎప్పుడు తెలుస్తుంది అని కావ్య అంటుంది. మీ అమ్మ.. మా అత్తగారు.. సంతోషంగా మన మూడు జంటలను దీవిస్తుంది అని రాజ్ నోరు జారుతాడు. ఏంటీ పైనుంచి దీవిస్తుందా అని కావ్య షాక్ అవుతుంది. అంటే మీ అమ్మ పైన నిల్చుని దీవిస్తుంది అని కవర్ చేస్తాడు రాజ్.
ఇన్ని బిట్ క్వశ్చన్స్‌కు నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నానే. వచ్చి వ్రతంలో కూర్చోవే అని రాజ్ అంటాడు. ఎలా కూర్చోవాలి. మీ భార్యగా కూర్చోవాలా. కనకం కూతురిలానా, దుగ్గిరాల ఇంటి కోడలిగానా అని కావ్య అడుగుతుంది. నా భార్యగా వచ్చి కూర్చో. నేను మీ అమ్మ, మా అమ్మ కోసమో చెప్పట్లేదు. మన గురించి కూడా ఆలోచించి చెబుతున్నాను. చూడు. ఇది మనిద్దరి జీవితాలకు సంబంధించింది. నేను అన్ని మర్చిపోయి పిలుస్తాను. నువ్ అన్ని గుర్తుపెట్టుకుని రానంటే అది నీ ఇష్టం అని రాజ్ అంటాడు.
నిజం తెలుసుకున్న రుద్రాణి
నేను వెళ్లి పీటలపై కూర్చుంటాను. నువ్ వస్తావో రావో నీ ఇష్టం కళావతి. ఇది నా మనస్ఫూర్తిగా చెబుతున్నా మాట అని రాజ్ వెళ్లిపోతాడు. దాంతో కావ్య మౌనంగా ఉండిపోతుంది. అమ్మో.. అమ్మో.. ఇన్ని తెలివితేటలా.. పెద్దమ్మ అనుకున్నది చేసింది. బావను దారిలోకి తీసుకొచ్చింది. పెళ్లిరోజును సాకుగా చెప్పి బావను మార్చింది అని బంటి ఓ గదిలో అనుకుంటాడు. ఆ మాటలు విన్న అప్పు బంటిని పిలుస్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న రుద్రాణి అది చూస్తుంది.
ఏంట్రా ఏదో అంటున్నావ్. నిజం చెప్పరా. మా అమ్మ ఏం ప్లాన్ చేసింది. వెనుక ఉండి ఏం నడిపించిందో చెప్పు. చెబుతావా లేదా కొట్టమంటావా అని గద్దిస్తుంది అప్పు. చెబుతాను. కానీ, నేను చెప్పినట్లు పెద్దమ్మకు చెప్పొద్దు. కావ్య అక్కను రాజ్ బావను కలిపేందుకు పెద్దమ్మకు క్యాన్సర్ అని, త్వరలోనే చనిపోతుందని అబద్ధం చెప్పింది. అందుకే బావ వచ్చి ఈ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇదే సాకుగా చూసుకుని వాళ్లిద్దరిని కలిపేందుకు ట్రై చేస్తుంది అని బంటి అంటాడు.
ఇది బావకు తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా. సరే వ్రతం అయ్యేవరకు ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉండు అని అప్పు అంటుంది. అదంతా విన్న రుద్రాణి నాకు తెలిసిపోయిందిగా. ఇది ఎప్పుడు ఎక్కడ చెప్పాలో నాకు తెలుసు అని రుద్రాణి అనుకుంటుంది. తర్వాత అంతా వ్రతంలో కూర్చుంటారు. ఏంటీ అక్క, చెల్లి కూర్చున్నారు. ఈవిడగారు రారా. తన ఇంటి వ్రతానికి కూడా బొట్టు పెట్టి పిలవాలా అని ధాన్యలక్ష్మీ అంటుంది.
మనసులోనే బాస చేసుకోండి
ఇంతలో కావ్య వస్తుంది. వచ్చి రాజ్ పక్కన కూర్చుంటుంది. రాజ్ సంతోషంగా కావ్యను చూస్తాడు. తర్వాత రాజ్‌కు సిగ్గు పడుతూ కావ్య బొట్టు పెడుతుంది. రాజ్ కూడా కావ్యకు బొట్టు పెడతాడు. ఆ మంగళగౌరికి మీ దాంపత్యం కలకాలం ఉండాలని కోరుకోండి అని పంతులు చెబుతాడు. అంతా అలాగే చేస్తారు. రాహుల్ కూడా మొక్కడంతో నిజంగా ఇది భక్తేనా అని స్వప్న షాక్ అవుతుంది. తర్వాత దాంపత్య వ్రతం పూర్తి అయింది. ఈ కంకణాలు కట్టుకుని జీవితాంతం భార్యాభర్తలుగా విడిపోకుండా ఉంటామని మనసులోనే బాస చేసుకోండి అని పంతులు చెబుతాడు.
కావ్యకు రాజ్ కంకణం కడుతుంటే.. రుద్రాణి చప్పట్లు కొడుతుంది. అంతా షాక్ అయి చూస్తారు. నాటకం రసవత్తరంగా పూర్తయిన తర్వాత ప్రేక్షకులు కొట్టే చప్పట్లు ఇవి. నీ నాటకం గురించే మాట్లాడుతున్నాను కనకం అని రుద్రాణి అంటుంది. అత్త.. ఏంటిది ఏం మాట్లాడుతున్నావ్ అని రాజ్ కోప్పడుతాడు. నువ్ ఎలా మోసపోయావో చెప్పబోతున్నాను. మనమంతా ఎలా ఫూల్స్ అయ్యామో చెప్పబోతున్నాను అని రుద్రాణి అంటుంది.
మీకంటే నేను చాలా తెలివైనదాన్ని. మీరు అమోఘమైన నాటకం ఆడితే అవి గుర్తించే తెలివితేటలు నాకు ఉన్నాయి అని రుద్రాణి అంటుంది. తర్వాత మాట్లాడుకుందాం అని అపర్ణ అంటే.. నాటకం ఇక్కడ జరుగుతుంటే ఇంకెక్కడో మాట్లాడుకుందాం అంటావేంటీ వదినా అని రుద్రాణి అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
కూతురు కూడా నటించింది
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో తను అలా చెబుతుంటే మీరేం మాట్లాడట్లేదు ఏంటీ. మీకు నిజంగానే క్యాన్సర్ లేదా అని రాజ్ అడుగుతాడు. లేదు అని కనకం అంటుంది. తల్లితో కలిసి కూతురు కూడా బాగా నటించింది. ఇక జీవితంలో కళావతిని ఈ కుటుంబాన్ని నేను చచ్చినా నమ్మను అని రాజ్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు.
టాపిక్