తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 17th Episode: బ్రహ్మముడి- రాజ్ కల్యాణ్ అప్పును విడిపించిన కావ్య- వీడియో ప్లాన్ సక్సెస్- భర్తపై సెటైర్లు

Brahmamudi July 17th Episode: బ్రహ్మముడి- రాజ్ కల్యాణ్ అప్పును విడిపించిన కావ్య- వీడియో ప్లాన్ సక్సెస్- భర్తపై సెటైర్లు

Sanjiv Kumar HT Telugu

17 July 2024, 7:58 IST

google News
  • Brahmamudi Serial July 17th Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 17వ తేది ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్ నుంచి రాజ్ కల్యాణ్ అప్పులను విడిపించుకుని తీసుకెళ్తుంది కావ్య. అనంతరం రాజ్ చేత తన చేతులకు గోరింటాకు పెట్టించుకుంటుంది కావ్య. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూలై 17వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూలై 17వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ జూలై 17వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్‌లో అప్పును కామెంట్ చేసిన వాళ్లను కావ్య నిలదీస్తుంది. మీరు మా బస్తీలోనే కదా ఉండేది. మీకు అప్పు ఎలాంటిదే తెలియదా. ఏమని కామెంట్ చేశారో చెప్పండి అని కావ్య గట్టిగా అడుగుతుంది. మేము ఏం అనలేదు. అప్పునే వచ్చి కొట్టింది అని వాళ్లు అంటారు.

ఫుల్ హెచ్‌డీలో

అవునా.. మీరు ఏం చేశారో మొత్తం రికార్డ్ అయింది. బంటీ వీళ్లు ఏమని మాట్లాడారో మొత్తం రికార్డ్ చేశావుగా అని అడుగుతుంది కావ్య. ఇదేంటీ అక్క నన్ను ఇలా ఇరికించింది. నేను ఏం రికార్డ్ చేయలేదుగా అని బంటీ మనసులో అనుకుంటాడు. దాంతో కావ్య కన్ను కొట్టి ఊరికే అన్నట్లుగా సైగ చేస్తుంది. దాంతో హా చేశాను అక్క. ఫుల్ హెచ్‌డీలో అని బంటి అంటాడు.

కోర్టులో తీర్పు

దాంతో కావ్య కాళ్లను అక్కా.. సారీ అక్కా.. అంటూ టక్కున పట్టుకుంటారు అప్పును కామెంట్ చేసినవాళ్లు. అలా అప్పును ఏమని కామెంట్ చేశారో చెబుతారు వాళ్లు. అప్పుడు ఎస్సైకి ఇందుకే వీళ్లను అంతలా కొట్టింది. వాళ్లు హోటల్‌లో దొరికింది అంతా కల్యాణ్ భార్య కావాలని ప్లాన్ చేసింది. కోర్టులో వీళ్లవైపు తీర్పు కూడా వచ్చిందని చెబుతుంది కావ్య.

స్త్రీ సంక్షేమం వాళ్లకు

అదంతా విన్న ఎస్సై సైలెంట్‌గా ఉంటాడు. ఇందులో మా వాళ్ల తప్పు ఏం లేదని, మీరు ఎవరిది తప్పో తెలుసుకుండా అందరిని లోపల వేశారు. చేయని నేరాలకు బాధ్యులను చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. మీకు కూడా వచ్చింది కదా అని కావ్య చెబుతుంది. తన వాళ్లను విడిచిపెట్టాలని, లేకుంటే ఈ వీడియో స్త్రీ సంక్షేమం వాళ్లకు చూపించి మీ ఉద్యోగం పోయేలా చేస్తానని కావ్య బెదిరిస్తుంది. దాంతో ఎస్సై కాస్తా ఆలోచిస్తాడు.

వదిలేయమన్న ఎస్సై

తర్వాత కావ్య చెప్పిందంతా విన్న ఎస్సై అప్పును కామెంట్ చేసినవాళ్లపై కోప్పడతాడు. అనంతరం అప్పు, కల్యాణ్, రాజ్‌లను లాకప్ నుంచి వదిలివేయమని చెబుతాడు. ఇలా ఎప్పుడు ఆవేశపడి ఎవరినీ కొట్టకండి అని ఎస్సై వార్నింగ్ ఇస్తాడు. ముగ్గురుని కావ్య విడిపించుకుని తీసుకెళ్తుంది. అలా కావ్య వేసిన మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. తర్వాత మీరు వచ్చేముందు ఏమన్నారు.. ఆడవాళ్లు ఏం చేయగలరని అన్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని కాపాడింది ఆడదే అని కావ్య సెటైర్లు వేస్తుంది.

రాజ్‌పై కావ్య సెటైర్లు

వచ్చి డీల్ చేస్తాను అన్నారు. దబాయిస్తాను అన్నారు. ఆఖరికి లాకప్‌లోకి వెళ్లారు అని కావ్య వెటకారంగా అంటుంది. రాజ్‌కు కోపం వచ్చిన ఏం అనలేక సైలెంట్‌గా ఉండిపోతాడు. కట్ చేస్తే.. రాజ్‌తో కొంచెం గోరింటాకు పెట్టొచ్చు కదా అని కావ్య అడుగుతుంది. నేనా అని ఆశ్చర్యంగా, చిరాకుగా అంటాడు రాజ్. దాంతో కావ్య ఓరగా చూస్తుంది. అయినా ఇప్పుడు పెళ్లి ఏం లేదు కదా. ఎందుకు స్పెషల్‌గా తెచ్చావ్ అని రాజ్ అంటాడు.

ఆషాడంలో గోరింటాకు

ఆడవాళ్లు ఆషాడం మాసంలో గోరింటాకు పెట్టుకోవాలట అని కావ్య చెబుతుంది. ఓహో.. అని రాజ్ అంటాడు. కొంచెం గోరింటాకు పెట్టండి అని క్యూట్‌గా అడుగుతుంది కావ్య. సరే తప్పుతుందా అని రాజ్ గోరింటాకు తీసుకుని పెడతాడు. రాజ్ గోరింటాకు పెడుతుంటే కావ్య అలాగే ప్రేమగా చూస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం